వాళ్లకు చెప్పారు….. మీరు చేసింది ఏంటి??
మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి -మత్తయి 27:62
ఈ వచనాల్లో జరిగిన సంఘటనలు శనివారం చోటుచేసుకుని ఉండి ఉండొచ్చు. ఇది యూదులకు విశ్రాంతి దినం, ఈ సమయంలో వారు దేవునిని ధ్యానిస్తూ, వారి పాపములు ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో గడపాల్సింది పోయి పిలాతు సన్నిధిలో గడపటానికి వెళ్ళారు, విశ్రాంతి దినాన వెన్నులు తుంచితేనే, స్వస్థత చేస్తేనే ఒప్పుకోని వీరు, మరి పిలాతు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు??
ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులదిచూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా -మత్తయి 12:1,2
సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యిచాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయన నేలాగు సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. -మార్కు 3:1-6
ఆ దినాన యేసయ్య మంచి చేస్తే ఒప్పుకోని వీరు, ఇప్పుడు ఎందుకు కూడుకుంటున్నారు ఒకసారి గమనించండి! ఇతరులకు బోధించే మనమందరమూ మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో మొదట చూసుకోవాలి.
ప్రభువా ఇతరులకు బోధించి మేము భ్రష్టులము కాకుండా ఉండునట్లు, మమ్మల్ని మేము నలుగకొట్టుకుంటూ, నిన్ను పోలి ఈ లోకంలో జీవించే భాగ్యం ఇవ్వండి - ఆర్. సమూయేలు

అన్న ఊచ చెయ్యి గలవాడు అంటే ఎవరు దేవునికి వ్యతిరేక లేక దేవునికి కూడా ఒకడా
రిప్లయితొలగించండిదీని మీద ప్రత్యేకముగా ఒక వ్యాసం రాయబడింది , దయ చేసి దానిని చదవండి
తొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి