సహోదరీలారా..... ఆలోచించండి...... మీ బాధ్యతను గుర్తించండి.....!
ఈనాటి వాక్య భాగము సామె 31:27.....
ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును........ గుణవతియైన స్త్రీకి తన ఇంటి వారిని గురించిన భారము మరియు బాధ్యత కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు.
ముఖ్యముగా తన పిల్లల విషయములో మరి ఎక్కువ అంట, వారు ఏమి చేస్తున్నారు, ఎలా ఎదుగుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఏమి తింటున్నారు మరియు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు వంటి విషయాలను గమనిస్తూ ఉంటుంది గనుకనే "వారి నడతలు బాగుగా ఎరుగును......" అని వ్రాయవడింది అంటే పిల్లలను పెంచే విధానమును ఆమె బహు చక్కగా చేసినట్లు కనబడుతుంది.
ఇంకా..., ఈమె చాలా పెద్ద వ్యాపారవేత్త కాబట్టి తన ఇంట్లో పనివారు కూడా ఉన్నట్లు మనకు తెలుసు, కనుక వారి నడతలు కూడా కనిపెట్టి చూస్తుంది అంట.
"పని చేయకుండా ఆమె భోజనము చేయదు...." ఇలా తన ఇంటి వారి గురించి చేయవలసిన పనులు చేయకుండా భోజనము చేయదంట, అంటే సోమరిగా ఏమి పట్టనట్టు ఉండకుండా తన కుటుంబము కొరకు పాటుపడుతుంది, మనము కూడా ఈమె లాగ భారము మరియు బాధ్యత కలిగి యున్నట్లైతే, మన కుటుంబాలను చక్కగా దేవుని మాదిరి కలిగిన కుటుంబాలుగా కట్టుకోవచ్చు.
ఇంటిని చూసి, ఇల్లాలు ఎలాంటిదో చెప్తుంది ఈ లోకం మరి ఇంటిని చూడడం అంటే ఇంటి శుభ్రత మాత్రమే కాదు గాని ఇంటిలో ఉండేవారిని కూడా చూసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది మనకు కాబట్టి ప్రియమైన సహోదరీలారా..... ఆలోచించండి...... మీ బాధ్యతను గుర్తించండి.....!
Sis.Sujatharani.G

Good job brother & sister, may God bless you sir
రిప్లయితొలగించండిThank you Sir/Madam. keep praying for us.
తొలగించండిమంచి ప్రాధాన్యత కలిగిన వర్తమానం...
రిప్లయితొలగించండిThank you Uncle
తొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి