హల్లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను దేవుడు మనలను ఎంతగా కేర్ చేస్తున్నాడో చెప్పాలనుకుంటున్నాను.
చాలా మంది నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, ఎవరు ప్రేమించరు, నాకిష్టమైనవి ఎవరు కుక్ చేసి పెట్టరు, నాకు నచ్చినవి కొనివ్వరు, అమ్మా నాన్న కూడా సరిగా కేర్ చెయ్యరు అని థింక్ చేస్తుంటాము.
అయితే మనలను పట్టించుకొనే వారు ఒకరు ఉన్నారు, ఆయనే మన సృష్టికర్త ఎస్...
నిన్ను నన్ను
- పుట్టించాడు,
- పోషిస్తున్నాడు,
- ప్రేమిస్తున్నాడు,
మన కోసం తన ప్రాణం కూడా పెట్టాడు, అంతే కాకుండా కంటికి కునుకు లేకుండా కాపాడుతున్నాడు, పగలు ఎండ దెబ్బ తగులకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మన రాకపోకలలో తోడుగా ఉంటూ నడిపిస్తున్నాడు
కాబట్టి ఇంతగా మనలను కేర్ చేస్తున్న దేవునికి మనము ఎంత దగ్గరగా ఉంటున్నాము అనేది థింక్ చేసి ఆయనకు దగ్గరవుదాం....
- ఆర్. సమూయేలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి