పల్లవి: వందనమయ్య యేసయ్య (4)
వందనమయ్య యేసయ్య నీ ప్రేమకై `
వందనమయ్య యేసయ్య నీ జాలికై
వందనమయ్య యేసయ్య నీ కరుణకై `
వందనమయ్య యేసయ్య నీ కృపకొరకై
నన్ను ప్రేమించిన నా దేవుడా
మహోన్నతుడవు నీవేనయ్యా
నాకై ప్రాణమిచ్చిన నా యేసయ్య
నీలా ప్రేమించేవారు లేనేలేరేయ్యా
1. మోడుబారిన నా ఈ బ్రతుకును
చిగురింపజేసిన జీవపుధాతవు
మోసుకొనుచున్న భారములన్ని
నాపైనే మోపమంటివి
మోసుకువెళ్లితివి నా పాపములన్ని
మోసెద నేను సులువైన నీ కాడి ॥వందనమయ్య॥
2. అందచందాలు ఐశ్వర్య అంతస్థులు
కోరకనే నన్ను ప్రేమించితివి
అంతరంగ సౌందర్యం అసలే లేని
నాతో నీవు స్నేహించితివి
అగోచరములు నీ ఉద్ధేశ్యములు
ఆనందముతో ఆరాధింతును ॥వందనమయ్య॥
3. పరాభవము నన్ను వెక్కిరించగా
ప్రతికూలత నన్ను కృంగదీసెను
పరిస్థితి చేయిదాటి పోయిన వేళ
ఆశలన్ని ఉడిగిపోయెను
పాపము మన్నించి ప్రేమను కురిపించి
ప్రాణము పెట్టి నన్ను లేవనెత్తితివి ॥వందనమయ్య॥
- ఆర్. సమూయేలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి