యేసుక్రీస్తు వారి పరిచర్యతో సంబంధమున్న ప్రాంతాలు

యేసుక్రీస్తు వారి పరిచర్యతో సంబంధమున్న ప్రాంతాలు
యేసుక్రీస్తు వారి పరిచర్యతో సంబంధమున్న ప్రాంతాలు  

పెరయ -

   దీనిని బైబిల్ లో ఇలా పిలిచారు "యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతము",

    యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత... గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంత ములకు వచ్చెను.- మత్తయి 19:1 

    గలీలయ నుండి యూదయాకు వెళ్లేవారు సమరయను తప్పించుకోడానికి పెరయా గుండా వెళ్తారు, ఈ ప్రాంతములో యేసువారు చేసిన పరిచర్య గురించి లూకాగారు ఎక్కువగా తన సువార్తలో పొందుపరచారు, - లూకా. 9:51-18:30,

    ఇదే ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను తాను ఐనోనుకు రాక ముందు పరిచర్య చేసాడు, ఆయన యోర్దను దగ్గర నున్న బేతనియలో బాప్తిస్మము ఇచ్చినట్లుగా వ్రాయబడింది.

 యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. యోహాను 1:28

     గనుక వారు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. యోహాను 3:26

    యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.యోహాను 10:40 

     అయితే ఈ బేతనియ, మార్త, మరియల బేతనియ ఒకటి కాదు, యోర్దను దగ్గర ఉన్నది పెరయకు సంబందించినది . యేసయ్య అదే సమయంలో కొంతకాలం అక్కడ పరిచర్య చేసి, అక్కడ నుండి గలీలయకు వెళ్ళిపోయాడు, తర్వాత మరల యోహాను 10:40, లూకా 9:51- 18:30లో వ్రాయబడినట్టు యేసుక్రీస్తు వారు మరల ఈ ప్రాంతములో సేవ చేయడానికి తిరిగి వచ్చాడు,

    ఈ ప్రాంతము మొదట్లో మహా హేరోదు పరిపాలన క్రింద ఉండేది, ఆయన తన రాజ్యమును తన కుమారులకు పంచి ఇచ్చిన తర్వాత అది హేరోదు అంతిప చేతి క్రిందకు వెళ్ళింది. యోర్దానుకు అద్దరినున్న గోత్రముల (రూబేను, గాదు, మనష్షే అర్ధ గోత్రపువారు) వారు, ఈ ప్రాంతములో దక్షిణ భాగములో ఉన్నారు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం

 మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని యెహోషువ యీలాగు ఆజ్ఞా పించెను. యెహోషువ 1:12

     కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమియైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్దనుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు యెహోషువ 22:9

    యెహోషువ. 1:12-14, యెహోషువ. 22:9 ని బట్టి పాత నిబంధనలోని గిలాదు అనే ప్రాంతమును ఇలా పిలిచారు అని కొంతమంది పండితుల అభిప్రాయం.

ఎఫ్రాయిము-

    ఇది యెరూషలేముకు ఉత్తర తూర్పుగా 12 మైళ్ళ దూరంలో ఉన్నది. ఈ ప్రాంతముకు దగ్గరలో అబ్షాలోము తన గొర్రెల బొచ్చు కత్తిరించుకున్నాడు 

 రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను. -2 సమూయేలు 13:23

బేతనియ - 

    బేతనియ (కష్టాల ఇల్లు) అనేది ఓలివ కొండ మీద తూర్పు వాలున ఉన్న ఒక గ్రామం, ఇక యెరూషలేముకు తూర్పుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది (యోహాను. 11:18). 

    యేసయ్య ఇక్కడే తన ఆఖరి వారమును గడిపాడు (మత్త. 21:17; 26:6; లూకా. 21:37). బహుశా మార్త వాళ్ళ ఇంట్లో ఉండి ఉంటాడు. ఇక్కడ నుండే యేసయ్య ఆరోహనం అయ్యాడు అనేది బైబిల్ పండితులు అభిప్రాయం. దీనిని పాత నిబంధనలోని అనన్యా అనే గ్రామముగా గుర్తిస్తూ ఉంటారు.
 అనాతోతులోను నోబులోను అనన్యాలోను - నెహెమ్యా 11:32
    ప్రస్తుతం దీనికి లాజరు పేరును కాపాడుతూ ఎల్ - అజర్య అని పిలువబడుతున్నది. జెరోమ్ గారు వ్రాసిన దానిని బట్టి లాజరు సమాధి మీద ఒక మందిరం కట్టబడింది, ముస్లింలు దానిని ఆక్రమించుకున్నాక కూడా అది లాజరు సమాధి అనే పిలువబడుతున్నది. మార్త ఇల్లు అని పిలువబడుతున్న చోట 1953 లో ఒక మందిరమును నిర్మించడం జరిగింది. యోహాను బాప్తిస్మము ఇచ్చిన బేతనియను యెరూషలేము నుండి చూస్తే కనుక్కోవడం కష్టం, అయితే మృత సముద్రముకు ఉత్తరముగా యెరూషలేముకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెతబరా గా పిలువమని Origen అనే church father ప్రతిపాదించాడు. (Myers, A. C. (1987). In The Eerdmans Bible dictionary (p. 139). Eerdmans).

బేత్పగే

దీనికి అత్తి ఇల్లు- fig house అని అర్ధం .


- ఆర్. సమూయేలు.




Post a Comment