Thank you
క్రీస్తునందు ప్రియులైన మీకందరికి యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాము, అందరూ బాగున్నారా? దేవుని చిత్తమును బట్టి రెండవ సీజన్ ప్రారంభించబడి దాదాపుగా 40 గ్రంధములను పూర్తి చేయగలిగాము.
మీరందరు ప్రతివారం నిర్వహించబడుచున్న బైబిల్ క్విజ్లలలో ఎంతో ఆసక్తిగా పాల్గోనుచున్నందుకు, దీనిని మరింతగా మెరుగుపరచుటకు మీరు చేస్తున్న సూచనలు, సలహాలను బట్టి అభినందనలు తెలియజేయుచున్నాము.
ఈ క్రింది భాగంలో ఈ సీజన్ 2 లో గత 146 వారాలుగా నిర్వహించబడుతున్న క్విజ్ లలో పాల్గొన్న వారి యొక్క మార్కులు ప్రచురిస్తున్నాము. ఈ యొక్క క్విజ్ లలో మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 49 మంది క్రమముగా పాల్గొనుచున్నందుకు దేవునిని స్తుతిస్తున్నాము, అందులో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మొదటి ఐదుగురి వివరాలను ఈ క్రింద పొందుపరుస్తూ వీరిని "శ్రద్ధ గల బైబిల్ విద్యార్థులు" అని పిలవాలనుకుంటున్నాము.
ఈ వివరాలను ఇక్కడ పొందుపరచడంలో మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశమే తప్ప కించపరచాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. మీలో కొంత మంది క్రమముగా ఈ క్విజ్ లలో పాల్గోనకపోవడం ద్వారా ఎక్కువ మార్కులు సంపాదించుకోలేకపోయారు.
కాబట్టి వీలైనంతవరకు క్రమముగా పాల్గోనుటకు ప్రయత్నం చేయండి. మీలో కొంతమంది దీనిని మీ కుటుంబ సభ్యులకు పరిచయం చేసి వారిని కూడా మీతో పాటు ఈ క్విజ్‌లలో పాల్గోనునట్లుగా చేయుచున్నారు. గనుక మీకు ప్రత్యేక అభినందనలు.
ఇంకను మీ స్నేహితులకు, మీ మీ సంఘములలలో వున్న యవ్వనస్థులకు పరిచయం చేయండి. గడిచిన వారములలో మంచి ఫలితాలు పొందిన మొదటి 23 మందికి మా పరిచర్యల ద్వారా తయారు చేయబడిన ఆధ్యాత్మిక పుస్తకాలను మీకు బహుమతిగా అందించదలిచాము. కాబట్టి అర్హులైన వారు క్రింద ఇవ్వబడిన పుస్తకాల పట్టికను చూసి మీకు కావలసిన పుస్తకాలను గూర్చి మాకు తెలియజేయండి.
ఈ క్విజ్ ను ప్రతి వారం మీకు అందించడానికి నాతో పాటు సమానంగా కష్టపడుతున్న మా నాన్నగారు జోసఫ్ గారికి, నా సతీమణి ఫీబే సమూయేలు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మనం మొదటి సీజన్ ముగించుకొని రెండో సీజన్లో కూడా 146 వారాలు పాటు 40 పుస్తకాలను పఠనం చేయగలిగామంటే, అది మీ వల్లనే సాధ్యపడింది, ఇందులో పాల్గొంటున్న మీరు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనప్పటికీ, వయసులో నాకంటే పెద్దవారైనప్పటికీ, నా నిర్ణయాలను గౌరవిస్తూ, పొరపాట్లను మన్నిస్తూ, సలహాలిస్తూ ప్రోత్సహిస్తున్నందుకై మీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, దేవుడు మనలను మన దేశమును దీవించును గాక ఆమెన్.
పుస్తకాల వివరములు
- 100 ప్రసంగంశములు
- యేసు రక్షించును
- సంఘసేవకురాలు
- నీవు చేసినట్టే నీకును చేయబడును
- మోజెస్ మిషన్
- నిష్ప్రయోజకుడు ప్రయోజకుడాయెను
- మంచిని అనుసరించి నడుచుకో
- అబద్ధ బోధకులు
- దైవజనుడా...
- ఆత్మీయ ఆహారము
- ఆత్మీయ ఆహారము - 2
- ఆత్మీయ ఆహారము - 3
- యేసుక్రీస్తు ఎందుకు చనిపోవడానికి వచ్చాడు
- విశ్వాసుల మార్గదర్శి.
- దేవుడు చూపిన ప్రేమ
- ఆదిని గూర్చిన 7 విషయాలు
- మన దేవుడు (మొదటి భాగము)
- ఆర్. సమూయేలు









Bro ఆర్. సమూయేలు గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియ జేస్తున్నాను.Rephidim Ministries ద్వారా మీరు నిర్వహిస్తున్న బైబిల్ క్విజ్ ను బట్టి మీకు many many thanks. ఈ బైబిల్ క్విజ్ వలన నా మట్టుకు నేను అనేక సత్యాలు నేర్చుకున్నాను. క్రమముగా బైబిల్ reading చేయుటకు అవకాశం దొరికింది. మీకు ఎంతో సేవ పరిచర్య ఉన్నప్పటికీ మీరు క్రమము గా బైబిల్ క్విజ్ నిర్వహిస్తున్నందు కు మీకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. ఈ క్విజ్ కార్యక్రమంలో మీకు సహాయ సహకారాలు అందిస్తున్న పాస్టర్ ఆర్. జోసెఫ్ అయ్యగారికి, sister ఫీబే సమూయేలు గారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ పరిచర్యను దేవుడు దినదినము అభివృద్ధి పరచాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను.thankyou for all.
రిప్లయితొలగించండివందనాలు బ్రదర్,నాకు అబద్ద బోధకులు,దైవజనుడా, యేసుక్రీస్తు ఎందుకు చనిపోవడానికి వచ్చాడు, విశ్వాసుల మార్గ దర్శి పుస్తకాలు పంపించగలరని నా యొక్క మనవి. Thanking you brother
తొలగించండిThank You Brother
రిప్లయితొలగించండివందనాలు బ్రదర్, Rephidim మినిస్ట్రీస్ ద్వారా మీరు నిర్వహిస్తున్న బైబిల్ క్విజ్ ను బట్టి many many thanks బ్రదర్.మీకు ఎంతో సేవా పరిచర్య వున్నప్పటికి, ఈ బైబిల్ క్విజ్ ద్వారా మమ్మల్ని బలపరస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు బ్రదర్. ఈ బైబిల్ క్విజ్ వలన మేము అనేక సత్యాలు తెలిసి కొన గలిగాము.ముఖ్యం గా నా మట్టుకు నేను అనేక సత్యాలు తెలిసికొనగాలిగాను. అంతే కాకుండా క్రమంగా బైబిల్ రీడింగ్ చేయుటకు ఆసక్తి ఏర్పడింది.అందును బట్టి మీకు ధన్యవాదములు తెలియ జేస్తున్నాను. ఈ క్విజ్ కార్యక్రమంలో మీకు సహాయ సహకారాలు అందింస్తున్న పాస్టర్ R. Joseph అయ్యా గారికి, సిస్టర్ R. Phibhe samuel గారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదములు.ఈ పరిచర్య ను దేవుడు అభివృద్ధిపరచాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను. Thanking you brother, Thank you for All.
రిప్లయితొలగించండిGod Bless you Brother
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి