రూబేను ప్రేమ - మాతృ దినోత్సవ ప్రత్యేకము
హాయ్ పిల్లలు బాగున్నారా? సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? హిమబిందు అని ఒక పాప ఉంది! ఈ పాప వీళ్ళ ఇంట్లో పెద్దదన్నమాట, తన తర్వాత ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. హిమబిందుకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 10 సంవత్సరాలు.
అయితే హిమబిందుకి ఎప్పుడు ఆటలే ఆటలు అన్నమాట, ఇంట్లో ఏ పని చేయదు, ఇల్లు అన్ని తిరుగుతా ఉంటూ ఉంటది. అయితే నేను ఈరోజు ఒక బాబు గురించి చెప్తాను మీకు, తను మాత్రం అలా లేడు! సరే మీకు బైబిల్ రూబేను అంటే ఎవరో తెలుసా?
రూబేను యాకోబు యొక్క పెద్ద కుమారుడు. వీళ్ళ అమ్మ పేరు లేయా, ఈయనకి 11 మంది తమ్ముళ్లు ఒక చెల్లి ఉంది. ఇంకా ముగ్గురు చిన్నమ్మలు కూడా ఉన్నారు వాళ్ళల్లో ఒక ఆవిడ పేరు రాహేలు. సరే ఇప్పుడు రూబేను యొక్క జీవితంలో సరిగ్గా తాను మీ వయసులో ఉన్నప్పుడు చేసిన ఒక పని గురించి మాట్లాడుకుందాం. అందరూ జాగ్రత్తగా వింటారా?
గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాతవృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. .......... -ఆదికాండము 30:14
రూబేను తనకై తానుగా వెళ్ళుంటే రూబేను మంచిగా కష్టపడి పనిచేసే అబ్బాయి అని మనం అనుకోవచ్చు, ఇంతకు రూబేనుకు అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలుసా? బహుశా ఆరు నుంచి పది సంవత్సరాల లోపు ఉండొచ్చు. మీరు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి సహాయం చేస్తారా? అందరూ ఇంట్లో అమ్మానాన్నకి హెల్ప్ చేయాలి. ఏదో ఒక పనిలో భాగం పంచుకోవాలి. అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ నేనేమన్నా పని చేయనా అని అడగాలి?
సరే ఒకవేళ రూబేనుని వాళ్ళ అమ్మ పంపించింది అనుకుందాం? వాళ్ళ అమ్మ పంపించినప్పుడు రూబేను వెళ్లి ఆ పూలు లేదా పండ్లు తీసుకొచ్చాడు అనుకుందాం. అప్పుడు రూబేను మనకు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? అమ్మ వాళ్ళు చెప్పిన మాట వినాలి. వింటున్నారా మీరందరూ మీ అమ్మ వాళ్ళు చెప్పిన మాట? మీరందరూ చెప్పిన మాట అసలు వినట్లేదు అంటగా. నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, అందరూ అమ్మ వాళ్ళ మాట వినండి.
సరే రూబేను తీసుకొచ్చి ఏం చేశాడు ఆ పండ్లని? తనవి తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు! ఎంత మంచి బాబో కదా! మీరు కూడా మీకు ఏమి దొరికినా వాటిని తీసుకెళ్లి మీ అమ్మకి ఇవ్వాలి ఎవరైనా మీకు ఏమైనా ఇచ్చిన మిమ్మల్ని ఏదైనా అడిగినా అది మీ అమ్మ వాళ్లతో చెప్పాలి అలా చేయడం చాలా మంచిది.
రూబేను తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఎందుకు ఇచ్చాడు ? వాళ్ళ అమ్మంటే రూబేనుకి ఎంతో ఇష్టం. వాళ్ళ అమ్మకి రూబేను గిఫ్ట్ ఇచ్చాడు అని అనుకోవచ్చు మనం, పిల్లలు మీరు ఎప్పుడైనా మీ అమ్మకి గిఫ్ట్ ఇచ్చారా? లేకపోతే ఈ రోజే వెళ్లి మీ అమ్మకు ఒక మంచి గిఫ్ట్ మీ డబ్బులతో కొనివ్వండి, అది ఒక చాక్లెట్ అయినా లేదా మీ అమ్మకి ఇష్టమైనవి ఏవైనా! ఎంతమంది చేస్తారు ఆ పని ఈరోజు!
అవును మనం ఎందుకు అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలి? రోజు అమ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది కదా, అన్నము వండుతుంది బట్టలు ఉతుకుతుంది, గిన్నెలు కడుగుతుంది మనకు బాగా లేకపోతే చాలా బాగా మనల్ని చూసుకుంటుంది ఇంకా ఎన్నో ఎన్నో చేస్తా ఉంది కదా కాబట్టి అమ్మను మరలా మనం ప్రేమించాలి అమ్మను మనం ప్రేమిస్తున్నామంటే అమ్మకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అందరికి అర్థమవుతుందా.
ఈ పాఠం నుంచి మనం ఏమి నేర్చుకోవాలో చూద్దాం. మొదటిగా, ఇంటి పనుల్లో సహాయం చేయాలి, రెండవదిగా, అమ్మ చెప్పిన మాట వినాలి, మూడోదిగా, అమ్మను ప్రేమిస్తూ ఆమెకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. దేవుడి మీకు ఇచ్చిన అమ్మను బట్టి ఆయనకు వందనాలు చెబుతూ మీ అమ్మకు రూబేను చేసినట్లుగా ఆ మూడు పనులు చేయాలని ప్రార్ధన చేస్తారా?
నాకు వచ్చేవారం మీరందరూ మీ అమ్మకి ఏం గిఫ్ట్ ఇచ్చారో చెప్పాలి! ఓకేనా! సరే కింద నేను ఒక కంఠత వాక్యం ఇస్తున్నాను, అందరూ అది నేర్చుకుని వచ్చేవారం పాఠం కొరకు రెడీగా ఉండండి, ఓకే బాయ్ గాడ్ బ్లెస్స్ యు!
,......... ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి. -రోమీయులకు 13:7
ఆర్. సమూయేలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి