బైబిల్ భాష్యం - సాహిత్య రూపాలు


బైబిల్ భాష్యం - సాహిత్య రూపాలు


బైబిల్ భాష్యం - సాహిత్య రూపాలు 

    పరిశుద్ధ గ్రంథమును మనం చదువుతుండగా, అనేకమైన సాహిత్య రూపాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒక మంచి బైబిల్ విద్యార్థి వీటిని గూర్చి అవగాహన కలిగినవాడై, అవి ఉపయోగించబడిన సందర్భాలను గుర్తించి, అక్కడ రాయబడిన విషయాలను అక్షరార్ధంగా కాక, అలంకార రూపం గా వాటిని అర్థం చేసుకునేవాడుగా ఉంటాడు. 

    సాహిత్య రూపాలు లేదా అలంకారాలు ఉపయోగించబడిన ప్రతిచోట అక్షరార్ధమైన అర్థం కంటే మరొక అర్థము ఖచ్చితంగా ఉంటుంది. ఈ సాహిత్య రూపాలు చాలా రకాలు ఉన్నాయి, వాటిలో ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ, ఉదాహరణలతో దానిని గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Merism : 

    ఈ అలంకార రూపంలో ఒక మొత్తాన్ని సూచించడానికి, ఆ మొత్తం లోని రెండు విభిన్న భాగాలను కలిపి చెప్పడం జరుగుతుంది.

ఉదాహరణ -1 

    ఉదాహరణకు ఆదికాండము 1:1 లో దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పబడింది. ఇక్కడ భూమి ఆకాశాలు అనే పదములు విశ్వమంతటిని సూచించడానికి ఉపయోగించబడ్డాయి. ఇక్కడ భూమి ఆకాశం అనేవి రెండు విభిన్నమైన అంశాలు, ఒకటి కింద ఉండేది రెండు పైనుండేది, ఈ రెండిటినీ కలిపి ఉపయోగించడం ద్వారా పైనున్న ఆకాశమునకు కింద ఉన్న భూమికి మధ్యలో ఉన్నదంతటిని  దేవుడు సృజించాడు అని తెలియజేస్తున్నది.

ఉదాహరణ 2 :

దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. -ఆదికాండము 1:5

    ఇక్కడ అస్తమయము, ఉదయము అనగా ఒక దినము అని అర్థం, అందులోనే మధ్యాహ్నం కూడా మిళితం చేయబడి ఉన్నది.

ఉదాహరణ 3 :

నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. -కీర్తనలు 139:2

ఇక్కడ కూర్చుండుట లేచుట అనే పదాలు ఒక వ్యక్తి చేసే క్రియలన్నిటిని సూచిస్తూ ఉన్నవి.

ఉదాహరణ 4 :

పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు; వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు; చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. -ప్రసంగి 3:2-8

    ఇక్కడ 14 జతల రెండు విభిన్నమైన అంశాలు చెప్పబడ్డాయి.

ఉదాహరణ 5 :

అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. -ప్రకటన గ్రంథం 1:8

    ఇక్కడ అల్ఫా ఓమెగ అనేవి ఈ విభాగమునకు చెందినవి . 

- ఆర్ . సమూయేలు 

Post a Comment