విశ్వాసి విడిచిపెట్టవలసినవి
ఈ క్రింది విషయాలు విశ్వాసికి ఉండకూడదు.
1. వివాదాలు:
విశ్వాసి జీవితంలో కలహమునకు తావుండకూడదు. ఆది. 13: 8. అబ్రహాము లోతుతో కలహమును కోరుకోలేదు. వివాదములను ప్రేమిస్తున్నావా? అసహ్యించుకొంటున్నావా? వివాదమా? సమాధానమా? ఏది నీకిష్టం. వివాదములు వద్దునుకొన్న ఇస్సాకు దూరముగా జరిగాడు (ఆది. 26: 16`22).
2. గొప్పలు చెప్పుకోవడం:
ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్పుకొనే జీవితం ఉండకూడదు. బారుజడ, పెట్టుడు పళ్లు ఉదాహారణ. అపొ. కా. 8: 9. దేవుడు నీకు ఎంత ఇచ్చినా దానిగురించి గొప్పలు చెప్పుకొనే జీవితం ఉండకూడదు.
3. పక్షపాతం:
యాకోబు లేయాను ఒకరకంగా రాహేలును ఇంకో రకంగా చూసాడు (ఆది. 29:30,31). ఇద్దరు పిల్లలు వుంటే పక్షపాతం వుండకూడదు. ఇస్సాకు, రిబ్కాలు యాకోబు ఏశావుల విషయంలో పక్షపాతమును చూపారు. యాకోబు తన కుమారుల విషయంలో పక్షపాతమును కనబరచారు. కొరింథులోని విశ్వాసులు సేవకుల విషయంలో పక్షపాతం చూపారు, ఏది నీ జీవితంలో రాజ్యమేలుతుంది, పక్షపాతమా? సమానత్వమా?
4. గర్వం:
2 దిన. 32:25 హిజ్కాయా దేవుని మూలముగ మేలు పొంది, ఆ తరువాత గర్వపు జీవితాన్ని జీవించాడు. ఫరో తన హాదాను చూసుకొని గర్వించాడు. గొల్యాతు తన బలమును చూసుకొని గర్వించాడు. గర్వం విశ్వాసి జీవితంలో ఉండకూడదు.
5. ధనాపేక్ష:
ధనాపేక్షతో యూదా యేసయ్యను పట్టించాడు (మత్త. 26:15) ధనవంతుడు దేవుని రాజ్యమును విడిచిపెట్టాడు (మార్కు. 10: 22). ఆ అపేక్ష వుంటే దేవునిలో ఎదగలేవు.
6. అధికార వాంఛ:
అతల్యా అధికార వాంఛతో రాజకుమారులను చంపింది. దియెత్రెఫే ఆ వాంఛతోనే సేవకుని తృణీకరించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి