ఆసా : ఆత్మీయ ఉజ్జీవమును కలిగించే రాజు
( ప్రభువా ఇలాంటి నాయకులను ఇవ్వండి)
రాజులు లేదా నాయకులు చాలా మంది ఉంటారు కాని, వారిలో ఆత్మీయులు దేవునికి ఇష్టులు అతి కొద్ధి మంది మాత్రమే. యూదా రాజ్యమును పాలించిన 20 మంది రాజులు, రాణులలో కేవలం 8మంది మాత్రమే దేవునికి ఇష్టులుగా ఉన్నారు.
గడచిన భాగంలో అబీయా చేసిన ప్రసంగంలో యరోబాము ఏ విధంగా దేవుని నుండి దూరంగా తొలగిపోయాడు అనేది తెలియపరిచాడు, కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అబీయా యరోబాము కంటే మెరుగైన ఆత్మీయ స్థితిలో ఉన్నాడు కానీ, దేవుని కొలమానానికి సరిపోయిన ఆత్మీయ స్థితిలో అతని జీవితం లేదు.
దావీదు తర్వాత దేవునిని అంతగా సంతోషపరిచిన రాజులు ఇటు యూదా రాజ్యంలోనూ ఇశ్రాయేలు రాజ్యంలోనూ లేరనే చెప్పాలి.
దావీదు కుమారుడైన సొలొమోను తన జీవితంలో దేవుని నుండి దూరంగా తొలగిపోయినవాడుగా ఉన్నాడు, అదే క్రమంలో రెహబాము, అబీయా కూడా కొనసాగారు.
అయితే ఇప్పుడు అబీయా కుమారుడైన ఆసా శ పరిపాలనలోకి రాగానే తాను కొన్ని సంస్కరణలు చేపట్టాడు. ఈ సంస్కరణల్లో భాగంగా దేవునికి వ్యతిరేకమైన వాటన్నింటినీ వారి యొక్క దేశంలో నుండి తొలగిస్తూ ఆ రీతిగా ఆజ్ఞలు జారీ చేశాడు.
వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి -2 దినవృత్తాంతములు 14:4
నిర్లక్ష్యం విడిచిపెడదాం
ఆసా చేసిన ఈ పనిని బట్టి మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. యూదా ప్రజలు వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవునిని నిర్లక్ష్య పెట్టినవారుగా ఉన్నారు, ఆయనకు వారు ఇవ్వవలసిన స్థానమును ఇవ్వలేదు అని మనం గ్రహించవచ్చు.
అందుకే వారిని తిరిగి దేవుని యొద్దకు వారిని ఆసా ఆహ్వానిస్తున్నవాడుగా ఉన్నాడు. నిర్లక్ష్యం తిరుగుబాటు అనేవి అక్క చెల్లలు అని చెప్పవచ్చు. నిర్లక్ష్యం మనలో కలిగింది అని అంటే దాని వెంటే తిరుగుబాటు చేయడానికి సిద్దపడేవారముగా ఉంటాము.
ఒకవేళ మనం కూడా మనం జీవితాల్లో ఏ కారణం చేతనైనా దేవునిని నిర్లక్ష్యపరచినవారంగా ఉన్నట్లయితే ఆసా ఆ దినాల్లో ఇచ్చిన పిలుపును బట్టి మనం కూడా మన జీవితాలను దిద్దుకోవటానికి ప్రయత్నం చేద్దాం.
దేవునిని, ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం భారీ మూల్యానికి కారణం అవుతుంది. వ్యక్తిగత ప్రార్ధన సమయాలు, వాక్య ధ్యాన సమయాలు, దేవుని చిత్తముకై కనిపెట్టడం, ఆత్మీయ సహవాసములు, దేవుని పరిచర్య కొరకు గుప్పిలి విప్పడం, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం, వంటి అంశాలను నిర్లక్ష్యం చేసావా? ఇక ఆలస్యం చేయక దేవునిని ఆయన ఉండవలసిన స్థానంలో మన జీవితంలో ఉండునట్లు కూర్చోబెడదాం.
దేవా గత కాలములో మేము నీ పట్ల చూపిన ప్రతి విధమైన నిర్లక్ష్యమును బట్టి మమ్మల్ని క్షమించండి.
మన కర్తవ్యం నెరవేరుద్దాం
ఏదైనా ఒక పని విజయవంతం కావాలంటే దానికి అనేకమైన విషయాలు కారణమవుతాయి. ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు సమ్మతించకపోతే వారు కలిసి నడవలేరు, ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రేమ కొనసాగాలన్న ఒక వ్యక్తి ప్రేమ చూపుతున్నప్పుడు మరోవైపు మరో వ్యక్తి వద్ద నుండి ప్రతిస్పందన కావాలి.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు విరుపాక్షాలు ఒకచోటకు చేరితేనే ఇద్దరు వ్యక్తులు ఒక అంశంపై అంగీకారాన్ని తెలిపితేనే మేలు జరుగుతుంది.
మేలు చేయాలనుకున్న వారు మేలు చేస్తూ ఉన్నప్పటికీ అనేకమంది ఆ మేలును పొందలేకపోవటానికి కారణమేంటి?
ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందించి ప్రజలకు మేలు చేయాలని సేవ చేయాలని ఆశిస్తున్నప్పుడికి ప్రజలకు అది ఎందుకు దొరకటం లేదు. వీటన్నిటికీ ఒకటే కారణం మేలు చేసే వ్యక్తి ప్రయాస పడుతున్నాడు గాని మేలు పొందాలనుకున్న వ్యక్తి ప్రయాస పడడం లేదు.
దేవుని కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు, మరి మన వంతు పని మాత్రమే మిగిలింది. మన వంతు పని మనం చేసినప్పుడే మనం మేలు పొందగలిగే వరంగా ఉంటాం.
ఇదే విషయాన్ని ఆశా తన ప్రజలకు గుర్తు చేశాడు. వారికి ఒక పిలుపునిచ్చాడు, ఆయన ఇచ్చిన ఈ పిలుపు మనకు ఏ పాటని నేర్పుతుందో చూద్దాం రండి.
ఆశ ఇచ్చిన ఈ పిలుపు మనకు రెండవ పాఠాన్ని నేర్పిస్తుంది, అదేమిటంటే ఇక్కడ ఆశ యూదా ప్రజలకు ఆజ్ఞ ఇస్తున్న వాడిగా ఉన్నాడు, దీనిని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఉత్తర రాజ్యంలో లేదా ఇశ్రాయేలు రాజ్యంలో లేవీయులు వారి పని వారు చేయనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది, కానీ ఈ రాజ్యంలో లేవీయులు వారు చేయవలసిన పనులను వారు చేస్తూనే ఉన్నారు అని అభియా తాను చేసిన ప్రసంగలో కూడా గుర్తు చేశాడు.
అనగా దేవుని సేవకులు వారి యొక్క కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తున్నారు, దేవుని సేవకులు వారి యొక్క కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తున్నారంటే మరి మిగిలి ఉన్నది ఏంటి మనదే కదా.
ఆశ అదే విషయాన్ని తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు, లేవీలుగా ఉన్నటువంటి వారు వారికి ఇవ్వబడిన పనిని వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు కనుక మీరు నిర్లక్ష్యం విడిచిపెట్టి, దేవుని వైపు తిరిగి మీ వంతు కర్తవ్యం మీరు నెరవేర్చండి.
ఇక్కడ యోధా ప్రజల యొక్క కర్తవ్యం ఏంటి? వీరు నిర్లక్ష్యపు విధానాలు విడిచి దేవుని వైపు తిరగాలి, బోధించబడుతున్న ధర్మశాస్త్రకు విధులను అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడాలి. మరి ఈనాడు ఈ విషయం మనకేం నేర్పుతున్నది?
దేవుని సేవకులు, వాక్యాన్ని బోధించే భారము కలిగిన వారు వారి యొక్క పనిని వారు జరిగిస్తూ ఉండగా, వాక్యాన్ని విని నేర్చుకుని, శిష్యులుగా చేయబడి అనేకమందికి బోధించేవారుగా మారడమే మన కర్తవ్యం అవుతుంది.
ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో మీరు మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారా? లేకపోతే ఆశ ఇచ్చే ఈ పిలుపును అంగీకరించి, ఈ దినము నుండైనా ఆ విధంగా చేయడానికి ప్రారంభించండి.
ఆసా మాదిరి అనుసరిద్దాం
ఆశ ఇచ్చిన పిలుపు మనకు మూడవ పాఠాన్ని కూడా నేర్పిస్తున్నది. నాయకత్వం అనేది మార్పులు తీసుకురావడానికి అనేకులను ప్రభావితం చేయడానికి ప్రయోజనకరమైన ఒక ఉన్నత స్థానమైనది.
దీనిని సరిగా ఉపయోగించుకుని, వారి అధికారాన్ని దుర్వినియోగపరచుకుండా వారి చేతికి ఇవ్వబడిన కుటుంబాన్ని సంఘాన్ని దేశాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే నాయకులందరూ ఈ లోకంలో మనకు కనబడతారు.
అంతేకాదు కేవలము వారు నాయకులమనే ఆధిక్యతను ఆధారం చేసుకుని ఎవరిని లెక్క చేయక, సమాజ శ్రేయస్సు ప్రజల శ్రేయస్సును ఏమాత్రం పట్టించుకోక, స్వార్థపూరితమైన వారి ఆశలను నెరవేర్చుకోవడానికి దాన్ని ఉపయోగించుకునే నాయకులు కూడా ఉంటారు.
ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేదానికి ఆశ ఒక చక్కని మాదిరి చూపిస్తున్న, మనము ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో నాయకులుగా ఉన్న ఆశా చూపిస్తున్న ఈ మాదిరిని మనము అనుసరించి నడవవలసిన వారమైన.
ఆశ అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిన నాయకుడుగా ఉన్నాడు. మనదేశంలో ఆత్మీయ బుజ్జి వానికి ఆయన కారణమయ్యాడు, ప్రజలకు ఆ రీతిగా ఆయన పిలుపునిచ్చినవాడుగా ఉన్నాడు.
ప్రియతన్రులారా, నాయకులారా బోధకులారా మీరు మీ యొక్క జీవితాల్లో ఆశా వంటి మాదిరిని కలిగి ఉన్నారా? ఎన్నో పనులు చేయడానికి మీ కుటుంబానికి పిలుపునిస్తారు కదా!
కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవడానికి, వాక్యమును ధ్యానించుటకు ప్రాముఖ్యత ఇవ్వడానికి, దాని ప్రకారము నడుచుకొనడానికి మీ కుటుంబానికి మీరు పిలుపునిస్తున్నారా, మీ అధికారం కింద ఉన్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారా? ఆలోచించండి.
ఈ దినం నుండి ఆసరా మనకు చూపుతున్న మాదిరిని అనుసరించి మన జీవితాల్లో మనము మన కుటుంబాలను, మన అధికారం మనకు అప్పగించబడిన సమస్తాన్ని దేవునికిష్టంగా కొనసాగించుటకు గాను ఆత్మీయ ఉజ్జీవంలో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం.
ఆసా లాంటి వారిని బట్టి దేవుని స్తుతిద్దాం
ఆశ ఇలా చేయడం ద్వారా మనకు 4వ పాఠాన్ని కూడా నేర్పిస్తున్నాడు. ఆశ లాంటి నాయకుడు లేకపోతే, మన ఆత్మీయ జీవితాల్లో ఆత్మీయత రోజురోజుకీ అడుగంటి పోతుంది.
మనము దేవునితో కలిగి ఉండవలసిన సహవాసాన్ని మనకు గుర్తు చేస్తూ, మన ఆత్మీయ స్థితిగతులను హెచ్చరిస్తూ, సక్రమంగా మనం నడుచుకున్నట్లుగా మనలను ప్రోత్సహిస్తూ నడిపించేటువంటి ఆశా వంటి నాయకులను దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించి ఉంటే వారిని బట్టి మనము ప్రభువుకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాల్సి ఉంటుంది.
ఆసాను బట్టి మనం ప్రభువును స్తుతించాలి, కారణమేంటంటే ఆయన మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు, అనేక మందికి ప్రేరణగా నిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆశ యొక్క జీవితాన్ని బట్టి ఆశ తీసుకున్న ఈ నిర్ణయాలను బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ప్రేరణ పొంది ఆ రీతిగా ప్రవర్తించుటకు తీర్మానించుకుందాం.
ఒక క్షణం సమయం తీసుకుని మీ జీవితంలో మీరు కలిగి ఉన్న ఆసాను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి నిజానికి ఆశ మీ జీవితంలో లేకపోయి ఉంటే మీ పరిస్థితి మరో గ్రహంగా ఉండేదేమో, నశించిపోయే ఈ లోకంలో ఎక్కడో కాలగర్భంలో మీ జీవితాలు కలిసి పోయేవేమో.
కాబట్టి ఆశ లాంటి వ్యక్తిని నా జీవితంలో అనుగ్రహించి ఆత్మీయ ఉద్యమంలోనికి నన్ను నడిపించినందుకు వందనాలన్నీ దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించండి.
ఆసా లాంటి వారి కొరకు ప్రార్ధన చేద్దాం
ఆశ చేసిన ఈ పనిని బట్టి మనం ఈ ఐదవ పాఠాన్ని కూడా నేర్చుకుందాం, ఆశ చేసిన ఈ పని ద్వారా యుధారాజ్యము నెమ్మది పొందింది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది.
ఈరోజు మన యొక్క దేశాలు నెమ్మది పొందాలంటే, మన కుటుంబాలు సంఘాలు దీవించబడాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన నాయకులు, దేవునికి ప్రార్థన చేయండి, మీ ఆత్మీయ జీవితాలను కట్టుకొనండి, ప్రభువు ఇష్టమైన జీవితాలను జీవించండి అని ప్రోత్సహించే నాయకులు మనకు కావాలి.
అలాంటి నాయకులు లేపబడడానికి మనము ప్రభువు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రతి తండ్రి ఒక ఆసా వలే మారడానికి మనం ప్రార్థించాలి ప్రతి సంఘాన్ని నడిపించే నాయకుడు ఒక ఆసా వలే మారడానికి మనం ప్రార్థించాలి.
అధికారంలో ఉండి రాష్ట్రాలను దేశాలను పరిపాలించే నాయకులు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలను ఆత్మీయ పదములో నడిపించే ఆశా వలే మారాలని మనం ప్రార్థించాలి. ఈ దినం కొంచెం సమయం తీసుకుని కుటుంబంలోని నాయకుని కోసం, సంఘములోని నాయకుని కోసం, దేశంలోని నాయకుని కోసం ప్రార్థన చేద్దాం.
వారి యొక్క ఆత్మీయ జీవితాలు సరిగా లేకపోతే మొదటిగా అవి సరి చేయబడాలని ప్రార్థిద్దాం, వారు రక్షణ పొందాలని ప్రార్థిద్దాం. వారి ఆత్మీయంగా బలపరచబడాలని ప్రార్థిద్దాం. వారు దేవుని పట్ల రోషము కలిగిన వారుగా బ్రతకాలని ప్రార్థిద్దాం. వారు వారి చేతి కింద ఉన్నటువంటి కుటుంబాలను సంఘాలను దేశాలను ప్రభువుకిష్టంగా నడిపించేటట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనదేశంలో నెమ్మది కలుగజేయును గాక ఆమెన్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి