విజ్ఞాపన - ప్రార్ధన - యాచన - కృతజ్ఞత
పరిచయం
- మొన్నటి వరకు కరోనా తో పోరాటం చేసాం, ఇప్పటికి కరోనా పూర్తిగా తగ్గనప్పటికి కొంత ఉపశమనం కలిగింది.
- అయితే ఇప్పుడు అనేకమైన ఆర్థిక ఒత్తిడిలతో పోరాటం చేయవలసి ఉంటుంది. ఈ పరిస్థితి లో మనము ఏమి చేయాలో పౌలు గారు చక్కగా వివరించారు.
- 1తిమోతికి 2:1 మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తమ అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును
- 1తిమోతికి 2:2 రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.
- ప్రార్ధన అను పదానికి గ్రీకు లో 7 పదాలు ఉన్నాయి వాటిలో నాలుగు పదాలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి
మొదటిగా - యాచన.
- Greek లో deisis అనే పదం ఉపయోంగించబడింది. చాలా త్వరగా కావాలి అని అడగడాన్ని ఇది సూచిస్తుంది.
- మన కొదువుల నిమిత్తం, ఇతరల అవసరముల నిమిత్తం దేవునిని యాచించాలి. ప్రత్యేక అవసరముల కొరకు మనవి చేయడం,
- సాధారణముగా మనుష్యుల దగ్గర అలా అడుగుతాం కాని దేవుని దగ్గర అడగమని పౌలు ఇక్కడ బోదిస్తున్నారు.
- మనకున్న గొప్ప ఆత్మీయ అవసరత ను బట్టి దేవునిని అడగడం లేదా వేడుకొనడమై యున్నది.
- ఇదే పదం యాకోబు 5:16లో కూడా ఉపయోగించబడింది.
- యాకోబు 5:16 మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
- ఇదే పదం లూకా 1:13 లో కూడా వాడబడింది
- లూకా 1:13 అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీస బెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
- ఇదే పదం లూకా 5:33లో కూడా వాడబడింది.
- లూకా 5:33 వారాయనను చూచియోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరి సయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి.
రెండు - ప్రార్ధన
- ఇది దేవునితో మనం కలిగియుండే సంబంధం ను సూచించుచున్నది.
- ప్రార్ధన అనే ఈ ఒక్క పదం లోనే యాచన, విజ్ఞాపన, కృతజ్ఞత అనే అంశాలు మిలితం చేయబడి ఉన్నాయి.
- ప్రార్ధన అనేది మనం దేవుని పట్ల కలిగియున్న ఆరాధన భావమును తెలియజేసే క్రియగా ఉన్నది అది కేవలం మన కోరికలను అవసరములను తెలిపే ప్రక్రియ కాదు. మనం దేవునికి ప్రార్థన చేయునప్పుడు ఆయన పట్ల గౌరవం ను భయభక్తులును కలిగి్యుండాలి.
- 1 పేతురు 3:7 లో కూడా ఇదే పదం వాడబడింది.
- 1పేతురు 3:7 అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.
- ప్రార్ధన, విజ్ఞాపన అనే పదాలు 1 తిమోతి 5:5 లోను ఎఫెసీ 6:18లోను కలిపి ఉపయోగించబడినవి.
- 1తిమోతికి 5:5 అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాప నలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును.
- ఎఫెసీయులకు 6:18 ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
మూడు - విజ్ఞాపన
- ఇతరుల నిమిత్తం దైర్యం తో మనవి చేయడం. ముఖ్యంగా అవిశ్వాసులుగా ఉన్న వారి విషయంలో వారి రక్షణ కొరకై ప్రార్ధించాలి.
- ఇదే పదం కొత్త నిబంధన లో 1 తిమోతి 4:5 లో మాత్రమే వాడబడింది.
- 1తిమోతికి 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు; అయితే తెలుగు బైబిల్లో కృతజ్ఞత అని అనువాదం చేసారు. మనం తినే ఆహారం ను బట్టి దేవుని స్తుతించడం.
- ఇక్కడ వాడబడిన ఈ పదమునకు అర్ధం ఏమిటంటే ఓ వ్యక్తి కి దగ్గరగా వచ్చి విశ్వాసంతో సంభాషించడం అని చెప్పవచ్చు. ఉదాహరణ - అబ్రహం (ఆది 18)
- యేసు వారు విశ్వాసులు నిమిత్తం చేసే ప్రార్ధన ను గూర్చి హెబ్రీ 7:25 లో వాడబడింది.
- హెబ్రీయులకు 7:25 ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
- యాచన అనేది ఒక వ్యక్తి యొక్క అవసరత ను తెలియజేస్తే, ప్రార్ధన ఆ వ్యక్తి యొక్క భక్తి ని తెలియజేయుచున్నది, విజ్ఞాపన ఆ వ్యక్తి కున్న చిన్న పిల్లలు వంటి నమ్మకం ను తెలియజేయుచున్నది. అని ఓ సేవకుడు అభివర్ణించాడు.
నాలుగు - కృతజ్ఞత
- greek లో ucharist అనే పదం ఉపయోగించబడింది.
- దేవునిని ఆరాధించడం లో ప్రార్ధించడంలో ఆయన కు కృతజ్ఞతలు తెలపడం అనేది భాగమై యున్నది.
- దేవుడు మన ప్రార్ధన లకు దేవుడు ఆయన జవాబు ఇచ్చినందుకు మాత్రమే కాక ఆయన ఏమై ఉన్నాడో తన కృప లో మనకేమి చేసాడో వాటిని బట్టి ఆయన కు కృతజ్ఞతలు తెలపాలి.
- దేవుడు ఇచ్చిన సదుపాయాలు, దీవెనలు నిమిత్తం దేవునిని స్తుతించాలి.
- కీర్తన 103లో దావీదు చేసినట్టుగా విన్నపములు లేకుండా కేవలం కృతజ్ఞతలు మనము కొన్ని సార్లు చెల్లించడం మంచిది.
- మన హృదయంలలో దేవుని సమాధానం ఉండాలంటే ప్రార్ధన, యాచన, కృతజ్ఞత ఉండాలి అని పౌలు తెలియజేసారు - ఫిలిప్పీ. 4:6
- ఫిలిప్పీయులకు 4:6 దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
- ఈ విధమైన ప్రార్ధన జీవితం దానియేలు కలియున్నాడు అనే విషయం మనం గమనించాలి.
- దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.
- దానియేలు 6:11 ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి
- ప్రార్ధన గురించి ఉపయోగించబడిన నాలుగు పదాలు కూడా బహు వచనంలో ఉన్నాయి.
ముగింపు
- మన ప్రార్థనలలో ఆరాధన , ఒప్పుకోలు, కృతజ్ఞత విజ్ఞాపన మరియు విన్నపం ఉండాలి. నీకు నచ్చినవారి కొరకు మాత్రమే కాక నీకు నచ్చని వారి కొరకు కూడా ప్రార్ధించవలసియున్నది

కామెంట్‌ను పోస్ట్ చేయండి