మార్కు సువార్త 3:1 లో ఉన్న ఊచ చేయి గలవాడు అనే పదానికి అర్థం ఏమిటి? అతను ఎందుకు అక్కడ ఉన్నాడు??


మార్కు సువార్త 3:1 లో ఉన్న ఊచ చేయి గలవాడు అనే పదానికి అర్థం ఏమిటి? అతను ఎందుకు అక్కడ ఉన్నాడు??

మార్కు సువార్త 3:1 లో ఉన్న ఊచ చేయి గలవాడు అనే పదానికి అర్థం ఏమిటి? అతను ఎందుకు అక్కడ ఉన్నాడు??

     సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. -మార్కు 3:1

    ఊచ చెయ్యగలవాడు అని అంటే చెయ్యి ఎండిపోయిన వాడు అని ఇతర అనువాదాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇతని చేతికి పాక్షికంగా పక్షవాతం వచ్చి ఉండొచ్చు, అతను దేవుని మందిరంలో ఉండడాన్ని బట్టి చూస్తే తన చెయ్యి మాత్రమే బాగాలేదు కాళ్లు బాగానే పనిచేస్తున్నాయి అని భావించవచ్చు. 

    చెయ్యి బాగా లేకపోయినా దేవుని కార్యములలో పాలు పంపులు కలిగి ఉండడానికి ఆయన దేవుని మందిరానికి వచ్చాడు, అయితే అదే సమయానికి యేసుక్రీస్తు వారు అక్కడికి రావడం, అది విశ్రాంతి దినం కావడం, మరి ఆ రోజున యేసయ్య స్వస్థ పరుస్తాడేమో దానిని బట్టి ఆయన మీద నేరం మోపవచ్చు అని పరిసయ్యులు కనిపెట్టడం యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, అంతేకానీ ఈయన పరిసయ్యుల గుంపుకు చెందినవాడని గాని, కేవలం యేసు వారి మీద నేరం మోపటానికి అక్కడ ఏర్పాటు చేయబడ్డాడని గాని భావించవలసిన అవసరం లేదు.

    అయితే ఈ వ్యక్తి మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాడు, చిన్న చిన్న సమస్యలను బట్టి , అవి తట్టుకోగలిగినవే అయినప్పటికీ మనం దేవుని మందిరంలో పరిశుద్ధుల సహవాసంలో పాల్గొనే అద్భుతమైన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తాము, కానీ ఈయన అలా చేయలేదు. 

    ఒకవేళ అలా చేసి ఉంటే ఆయనకు స్వస్థత ఇంకా ఆలస్యం అయ్యేదేమో, ఇప్పటికైనా సాకులు మాని చేతనైనంత మట్టుకు, వీలైనంతవరకు దేవుని సేవించడానికి ప్రయత్నం చేద్దాం, దేవుడే తగిన కాలమున తన ఆశీర్వాదములు మనకు అనుగ్రహిస్తాడు. - ఆర్. సమూయేలు

2 కామెంట్‌లు

  1. వందనాలు బ్రదర్, అవకాశం ఉన్న చోట హెబ్రీ,గ్రీకు పదాలు కూడా ఉపయోగిస్తే మేము కొంత subject నేర్చు కున్నట్లు ఉంటుంది brother.

    రిప్లయితొలగించండి
  2. అవసరమైతే నేను ఖచ్చితంగా వాడతాను అన్న, మీరు ఒక్కో పదం గురించి తెలుసుకోవాలనుకుంటే Bible Dictionary అనే సెక్షన్ చూడండి.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి