విజయమిచ్చు దేవుడు


విజయమిచ్చు దేవుడు

విజయమిచ్చు దేవుడు

    నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము. -కీర్తనలు 44:5

    ప్రతి వ్యక్తి తన జీవితంలో క్షేమమును, ఆరోగ్యమును, విజయమును, జ్ఞానమును సంపదను, ఘనతను కోరుకుంటాడు. వాటిని పొందుకోడానికి ఎంతగానో ఆశపడతాడు, ప్రయాసపడతాడు. 

    అయితే అవి తాను పొందుకోలేకపోవడానికి ఇవి రెండు కారణాలు అవుతాయి. మొదటిగా తాను సరియైన మార్గమును ఎంచుకొనకపోవడం, రెండు అనేకులు తనకు విరోధులై తనకు విజయము దక్కనివ్వకుండ అడ్డుపడడం.

    జీవితంలో తాము కోరకున్న వాటిని పొందడానికి అనేకులు తమ సామర్థ్యమును నమ్ముకుంటారు, వనరులను ఆశ్రయిస్తారు, అవి వారికి విజయమును చేకూర్చుతాయి అని ఆశపడతారు. అయితే కార్యము సఫలము దేవునివలనే సాధ్యమని, విజయము ఆయన అధీనములో వున్నదని చాలా మంది గ్రహించరు. 

    తమ సామర్థ్యము చేత ఎన్నిటినో జయించు వీరు తమను తాము జయించలేని దుస్థితిలో వుంటారు. మహాఅలెగ్జాండర్‌కు యుద్దవిజయాలు ఎన్నో వున్నాయి గాని తనపై తనకు విజయం లేదు.

    మానవుడు శరీరము, లోకము, సాతాను అను ఈ ముగ్గురు శత్రువులను తప్పక జయించాలి, లేకపోతే తాను విజయం సాధించలేడు. మానవుడు ఎన్నో విజయాలు పొందినా వీటిపై విజయమును పొందలేని స్థితిలో వుండగా క్రీస్తు మనకు విజయమిచ్చుటకు భూలోకానికి దిగివచ్చి, తన రక్తము మూలముగా మనకు విజయమును అనుగ్రహించాడు. 

    ఆత్మదేవుని మనలో నివాసముండునట్లుగా చేసి, ఆత్మానుసారముగా మనము నడచుట వలన ఆ శత్రువులను అణచివేయునట్లు సహాయపడుతున్నాడు. ఈ విశ్వాసముందు నీవు జన్మిస్తే నీకు కూడా విజయమున్నది.

    నేటికైన దేవుని వలనే విజయము కలుగుతుందని నమ్ము, నీవు చేయలేకపోయిన అనేక కార్యములు ఆయన ద్వారా నీవు జరిగించగలవని విశ్వసించు. అధికారము కలిగిన ఆయన నామమును ఉచ్ఛరిస్తూ గొప్ప విజయమును సొంతం చేసుకో. 

    ఆత్మ పరిశీలనకు ఇది సమయం, విధేయత చూపుటకు అవకాశం, వదలిపెట్టకు, త్రోసివేయకు, చేర్చుకో యేసుని, నిత్యమైన ఆశీర్వాదములను పొందుకొని జయజీవితమును జీవించు, అట్టి కృప ప్రభువు మనకు దయచేయును గాక. ఆమెన్‌.  - ఆర్. సమూయేలు

2 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి