Bible Quiz on Proverbs 29-Ecclesiastes 4


Bible Quiz on Proverbs 29-Ecclesiastes 4


Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/102- ANSWERS)


గత వారం క్విజ్ సమాధానాలు

  1. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలికే వానికి; హేతువు (సామెత . 22:11; 26:2);
  2. ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో (సామెత . 23:6);
  3. ద్రాక్షారసము (సామెత . 23:31,32);
  4. కీడుచేయ పన్నాగములు పన్నువాడు; కపట మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు (సామెత . 24:8; 25:14);
  5. నిద్ర, కునుకు పాటు, చేతులు ముడుచుకొనుట (సామెత . 24:33,34);
  6. ప్రాకారము కట్టుకొనుటతో; తనకు పట్టని జగడమును బట్టి రేగడం (సామెత. 25:28; 26:17);
  7. కీర్తి చేత (సామెత. 27:21).
  8. అతిక్రమములు దాచి పెట్టకుండా దేవుని యందు నమ్మకం ఉంచితే (సామెత. 28:13, 25).

Rephidim Weekly Bible Quiz
(RWBQ Season 2/103-QUESTIONS 28-05-2023)


సామెతల గ్రంధము 29వ అధ్యాయము నుండి ప్రసంగి గ్రంధము 4 వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. (సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి). మొత్తం మార్కులు (17)

సాధారణ ప్రశ్నలు :
  1. ఈ బాలుడు తెచ్చేది అవమానమే! (2M)
  2. జలగ యొక్క కూతురుల పేర్లు రాయండి? (2M)
  3. గుణవతియైన భార్య సేవకురాలేనా బోధకురాలు కూడానా! (2M)
  4. అధిక శోకము ఎవరికి కలుగును? (2M)
  5. దేనితో సొలోమోను నీవు వెర్రి దానవు అని అన్నాడు? (2M)
  6. నరుని దినములు ఇలా ఉంటే వాని పాట్లు ఇలా ఉన్నాయి?(3M)
  7. నరునికి దేవుడు కష్టానుభవమును ఎందుకు ఏర్పాటు చేసాడు? (2M)
  8. బుద్ధిహీనుడు భక్షించినది ఏమిటి? (2M)

గమనిక:

  • whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
  • మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

- Rephidim Ministries

Post a Comment