మిర్యాము శ్రద్ధ గలది



మిర్యాము శ్రద్ధ గలది


మిర్యాము శ్రద్ధ గలది (బాధ్యత గలది)

    హాయ్ పిల్లలు బాగున్నారా? మరలా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా! క్రమంగా స్కూల్ కి వెళ్తున్నారా? ఆల్ఫా అనే అబ్బాయిని వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా కష్టపడి మంచి స్కూల్లో చేర్పించారు, అక్కడ ఫీజులు కూడా చాలా ఎక్కువే, వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం, అయినా గాని వాళ్ళ పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలని పిల్లల్ని మంచిగా చదివించడం తల్లిదండ్రులు బాధ్యత కాబట్టి వారు ఎంతైనా కష్టపడి ఆ స్కూల్లో ఆ బాబును చదివించడానికి నిర్ణయం తీసుకున్నారు. 

    అయితే ఆల్ఫా ఏం చేసేవాడో తెలుసా? రోజు సరిగ్గా స్కూల్ కి వెళ్లేవాడు కాదు! రోజు ఏదో ఒక సాకు చెప్పి ఎలాగైనా స్కూల్ మానుకోవాలని అనుకుంటూ ఉండేవాడు, ఒకవేళ స్కూలుకు వెళ్లినా సరిగ్గా పాఠాలు వినేవాడు కాదు, హోంవర్క్ చేసేవాడు కాదు, ప్రాజెక్ట్ వర్క్స్ చేసేవాడు కాదు, అలా తన ఇష్టానుసారంగా ఉండేవాడు. ఈ ఆల్ఫా ని మనం ఏమని పిలవచ్చు? మీరు ఏదైనా పేరు పెట్టండి! నేనైతే బాధ్యత లేనోడు, శ్రద్ధ లేనోడు అంటాను. 

    అంతే కదా అమ్మ వాళ్ళు అంత కష్టపడి మన గురించి బాధ్యత తీసుకొని ఫీజులు కట్టి స్కూలుకి ట్యూషన్లకి పంపిస్తా ఉంటే మనం సరిగ్గా శ్రద్ధగా చదువుకోకపోతే మనం బాధ్యత లేని వాళ్ళమే అవుతాం. మనలను చదివించడం తల్లిదండ్రులు బాధ్యతైతే మంచిగా చదువుకోవడం మన బాధ్యత. ఆల్ఫా ఇలా ఉన్నాడు కదా మరి మిర్యాము ఎలా ఉందో చూద్దామా!

    గడచిన పాఠంలో మిర్యాముకు వాళ్ళ అమ్మ ఒక పని అప్పగించినట్లు తెలుసుకున్నాము. ఆ పని ఏంటో మీకు గుర్తుందా? (పిల్లల్ని సమాధానం చెప్పనివ్వండి) ఆ….! తన తమ్ముడికి ఆ పాపను కాపలా ఉంచింది.

     ఒకవేళ ఈ పాప తన తమ్ముడి మీద ప్రేమతో తనకు తానుగా అక్కడ నిలబడింది అని అనుకుంటే అప్పుడు ఈ పాప ప్రేమగలది శ్రద్ధగలది తన తమ్ముడు పై బాధ్యత గలది అవుతుంది. 

    ఆ బాబుకు ఏం జరుగుతుందో చూడడమే తన పని. తన పని తను మంచిగా చేయాలంటే వాళ్ళ అమ్మగారు తనని ఎక్కడ నిలబెట్టారో, అక్కడే ఉంటూ, వేరే పనిలేవి పెట్టుకోకుండా, దిక్కులు చూడకుండా, బాబునే గమనిస్తూ తాను ఉండాలి. 

    అలా ఉండడం తన బాధ్యత. అలా ఉన్నప్పుడు మాత్రమే తన బాధ్యతను తాను మంచిగా నెరవేర్చినది అవుతుంది. ఇక్కడ ఆ పాప చాలా శ్రద్ధ కలిగి బాధ్యతగా ఉన్నది. 

    మీరే ఆ పాప స్థానంలో ఉంటే ఏం చేస్తారు? మనలో కొంతమంది ఆ బాబుకు ఏమీ కాదులే అని చెప్పి వదిలేసి దూరంగా వెళ్ళిపోతాము. అమ్మ వచ్చేసరికి మరల రావచ్చులే అని ఫ్రెండ్స్ ఇంటికో, ఆడుకోవడానికో వెళ్ళిపోతాం. 

    అలా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? తన తమ్ముడికి ఏమైనా జరగొచ్చు కదా! ఆ బాబుని ఎవరైనా దొంగతనం చెయ్యొచ్చు, ఈ పాప ఆడుకొని వచ్చే లోపల ఆ బుట్ట ఇంకొక చోటకి వెళ్ళిపోవచ్చు, వీళ్లంటే గిట్టని వారెవరైనా ఉంటే వాళ్లు ఆ బుట్టని నీళ్ళల్లో ముంచి వేయొచ్చు, ఇలా ఏమైనా జరగొచ్చు. 

    ఆ పాప అక్కడే కనిపెట్టుకొని ఉండకుండా ఎక్కడికైనా వెళ్లి వస్తే ఆ బాబుకి ఏమి జరిగినా తనకు అది తెలిసే అవకాశం ఉండదు. అంతేకాదు తాను శ్రద్ధ కలిగి బాధ్యతగా ఉండనందుకు ఆ బాబుకి ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు వాళ్ళ అమ్మ పడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది కదా. 

    బుట్ట తయారు చేయడం, బాబుని అందులో పెట్టడం, నీళ్లు రాకుండా తారు పూయడం, ఈ శ్రమంతా వ్యర్థమైపోతుంది. అంతేకాదు ఆ పాపకి ఇంకా తమ్ముడు ఉండడు, కాని ఇవేమీ జరగటానికి వీలు లేకుండా మిర్యాము శ్రద్ధ కలిగి బాధ్యతగా కావలి కాసింది.

    కాబట్టి పిల్లలు, మీరు కూడా శ్రద్ధ కలిగి బాధ్యతగా చదువుకుంటే, మీ భవిష్యత్ బాగుంటుంది, మీ అమ్మానాన్నల కష్టానికి ఉపయోగం ఉంటుంది. శ్రద్ధగా మీరు చదువుకుంటే దేవుడు మిమ్ములను దీవిస్తాడు. 

    మీరు శ్రద్ధ లేకుండా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే దేవుడు కూడా మీకు సహాయం చేయడు. స్కూల్లో సండే స్కూల్ లో చెప్పే పాఠాలు శ్రద్ధగా వినటానికి బాధ్యత కలిగి రండి. ఆలస్యంగా రావద్దు.

కంఠత వాక్యము :

 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని…..నడచినయెడల,.......రోగాములలో ఏదియు మీకు రానియ్యను…… నిర్గమకాండము 15:26

కార్యాచరణ :

శ్రద్ధ కలిగిన పిల్లలకు బాధ్యత లేని పిల్లలకు ఉండే ఐదు తేడాలను ఒక పట్టికగా రాయండి.


- ఆర్ . సమూయేలు 

Post a Comment