ఫలభరితముగా చేయు దేవుడు
గొడ్రాలితనము, ఫలింపు లేని, ఉపయోగకరము కానీ జీవితము, ఎదుగుదలలేని పరిచర్య, మాటిమాటికి పాపములో పడిపోయే బలహీన స్థితి, పరిశుద్ధంగా జీవించాలని వాంఛ ఉన్న అలా జీవించలేని దౌర్భాగ్యస్థితి చాలా వేదనను మిగులుస్తుంది. నీవు ఒకవేళ ఈ వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటే నేను నీకు ఈ విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను.
ఆదికాండం ఒకటో అధ్యాయం రెండవ వచనం, దేవుడు సృష్టిని కలిగించక ముందు ఉన్న పరిస్థితులను వివరిస్తున్నది. ఇదే వచనాన్ని కాంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ లో చదివితే ఇలా రాయబడింది. Genesis 1 : 2 - The earth was barren (CEV).
దేవుడు తనకున్న శక్తి చేత ఈ భూమి మీద దృష్టి నిలిపి దాని యొక్క నిష్ఫలమైన స్థితి నుండి, నివాసయోగ్యము కానీ స్థితి నుండి మనందరికీ ప్రయోజనకరంగా దాన్ని మార్చారు. ఈరోజు మనం చూస్తున్న ఈ సృష్టి, నేడున్న స్థితిలో ఒకప్పుడు లేదు.
" దేవా మమ్మును ఫలింప చేయండి " -
- Rephidim Ministries

కామెంట్‌ను పోస్ట్ చేయండి