దావీదు అన్న కోపముకు గురయ్యాడు
అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను. -1 సమూయేలు 17:28
మీ మీద ఎవరైనా ఎప్పుడైనా కోప్పడ్డారా? కచ్చితంగా ఎవరో ఒకరు మన మీద కోపపడి ఉండి ఉండొచ్చు. కానీ వారు మన మీద కోపాన్ని వ్యక్తం చేయడానికి కారణం ఏంటి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనలను సరిదిద్దాలని మన మీద కొన్నిసార్లు మన పెద్దవారు కోప్పడుతూ ఉంటారు. మనం మనకంటే చిన్న వాళ్ళకి నొప్పి పుట్టించే పనులు చేసినప్పుడు వాళ్లు కూడా మన మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.
ఇలా కోపానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని కోపాలకు మంచి కారణాలు ఉంటే, మరికొన్ని కోపాలకు చెడ్డ కారణాలు. కోపం పాపం కాదు గాని, కోపపడిన దాన్నిబట్టి పాపం చేయడానికి అవకాశం ఉంటది. గొల్యాతు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలను బట్టి దావీదు కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకుని గొల్యాతును చంపినవారికి బహుమానం ఏంటని అడుగుతూ ఉన్నాడు.
బహుమతి ఏమిటో తెలిసినప్పటికి, మరల దాని గురించి దావీదు అడగడం ఏమి తెలియజేస్తుంది?? గొల్యాతు విషయంలో దావీదుకున్న ఆసక్తి, బహుమతి గురించి వాకబు చేయడం, మెల్లగా ఆ నోట ఈ నోట పడి, సౌలు యొద్దకు చేరాలేనేది బహుశా దావీదు ఉద్దేశ్యమై యున్నది.
అయితే ఈ మాటలు విన్న దావీదు పెద్దన్న ఏలీయాబు దావీదు మీద కోపం తెచ్చుకున్నాడు. ఏలీయాబు దావీదు మీద కోపం తెచ్చుకోవడానికి కారణం ఏమిటి? కేవలం దేవుని కొరకు రోషం కనబరచడమే. ప్రేమను బట్టి, తప్పును దిద్దడానికి, దేవుని కోసమో, ఏలీయాబు ఇక్కడ కోపం తెచ్చుకోవడం లేదు. అతని కోపమునకు మంచి కారణం ఏమి లేదు.
ఏలీయాబు వలె అకారణముగా ఎవరి మీద మనము కోపమును పెంచుకోకూడదు, ప్రదర్శించకూడదు. అలా చేయడం పాపమే. ప్రేమను బట్టి, తప్పును దిద్దడానికి, దేవుని కోసమో, లేదా అకారణము చేత ఎవరైనా మన మీద కోపపడితే, దానిని మనము మంచిగా స్వీకరించాలి. దావీదు ఇక్కడ తిరిగి కోపపడలేదు, అతను కోపపడిన విధానమును బట్టి వేరే భావాలు దావీదు పెంచుకోలేదు.
కంఠత వాక్యము :
కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు. -ఎఫెసీయులకు 4:26పునర్విమర్శ ప్రశ్నలు : క్రింది వాటిలో తప్పు ఒప్పులు గుర్తించండి.
- ఏలీయాబు మంచి కారణముతో కోపపడ్డాడు ( )
- దావీదు గొల్యాతుతో యుద్ధం చేయాలనుకోవడమే ఏలీయాబు కోపముకు కారణం ( )
- ఏ కారణం చేత కోపం కనబరిచినా అది పాపమే ( )
- కోపపడి కూడా పాపం చేయకుండా ఉండడం ఎలా సాధ్యపడుతుంది?

కామెంట్‌ను పోస్ట్ చేయండి