విమోచింపబడినవారు చేయవలసినది ఏమిటి?
నన్ను నేను నమ్ముకొని కాదు నేను బ్రతికేది! నిన్ను నమ్మి నేను ముందుకు వెళ్తాను నా మీద నేను ఆశ నిలుపుకొని కాదు బ్రతికేది! నీ మీద ఆశ పెట్టుకొని నేను ముందుకు వెళ్తాను నాకు ఇక ఆశలు లేవు అని నేను అనుకోను ఎందుకంటే నా ఆశగా నీవు ఉన్నావు! నువ్వే నా ఆశ నువ్వే నా కోరిక నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు మేలు చేసే దేవుడవు దారులన్నీ మూయబడిన సమయాన నా కొరకు దారి తెరిచావు కదా ఇప్పుడు ఎక్కడ ఏమి దొరుకుతదో తెలియని ఈ పరిస్థితుల్లో నేను నీ మీద ఆనుకుంటే నువ్వు నన్ను విడిచిపెట్టకుండా నడిపిస్తావు అనే బలమైన విశ్వాసము కలిగి ఈ జీవితాన్ని సాగిస్తాను అనే తీర్మానము మనందరిలో రావాలి.
పరిచయం :
విమోచింపబడిన ప్రతి ఒక్కరూ వారి జీవితములో గతములో దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయనపై విశ్వాసముంచి ముందుకు సాగాలి.
విమోచింపబడిన ప్రతి ఒక్కరికి మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసయ్య నామములో శుభములు కలుగును గాక.
అందరూ బాగున్నారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క విరోధులను ఓడించి వారిని ఏ విధంగా విమోచించాడో గత ధ్యానాల్లో విన్నాం కదా! ఎర్ర సముద్రమును దాటిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించాడో, వారు దానికి ఎలా స్పందించారో అనే విషయాలను నిర్గమకాండము 16 &17 అధ్యాయముల ద్వారా ఈ భాగంలో తెలుసుకుందాం.
ఎర్ర సముద్రం దాటిన ఇశ్రాయేలీయులు పాటలు పాడుతూ చక్కగా దేవుని స్తుతించారు, అయితే ఇక వారి ముందు గొప్ప ప్రయాణం ఉన్నది. వారి ముందు ఉన్నది ఎడారి ప్రయాణం, వారి ఎదురు కావలసిన సమస్యల్లో ఆకలి దప్పిక ప్రధమంగా వారి ఎదుట ఉన్నవి. ఆలస్యం చేయకుండా ఐగుప్తు నుండి బయలుదేరారు, ఖచ్చితంగా వారు తెచ్చుకున్న ఆహార పానీయాలు ఖాళీ అయిపోయి ఉంటాయి.
ఇప్పుడు వారికి నీళ్లు ఎలాగూ? ఆహారం ఎలా? కొయ్యలేరు కొనలేరు. చేయాల్సింది ఒక్కటే దేవుని వైపు చూడటమే విశ్వాసముతో దేవుని వైపు చూస్తే ఆయనే తగిన కాలంలో నీళ్లు ఆకలి తీర్చడానికి ఆహారం వారికి అనుగ్రహించ ప్రణాళిక కలిగి ఉన్నాడు.
కానీ ఈలోగానే వారు దేవునిపై సణుగుతూ మోషేపై సనుగుతూ గడిపినవారుగా ఉన్నారు. విమోచింపబడిన ప్రతి ఒక్కరు దేవుని పై విశ్వాసంతో శేష జీవితమును కొనసాగించాలి.
నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. -గలతియులకు 2:20
దేవుడు మనలను విడిచి పెట్టేవాడు కాదు, కనుక మన విశ్వాసమును మనం కోల్పోకుండా, ఆయన కొరకు ఎదురుచూస్తూ మనం కొనసాగితే ఆయన మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఇక్కడ ఇంత ఎడారిలో ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి నీళ్లు, ప్రతి దినము ఆహారము దేవుడు వారికి అనుగ్రహించాడు. నీవు విశ్వాసం కలిగి ఉంటే నీవును వాటిని పొందుకొనగలవు
ముగింపు :
మన ఈ ఆత్మీయ యాత్రలో ఎంతో ప్రాముఖ్యమైన విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. ప్రభు చిత్తమైతే మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి