మన విరోధులను ఓడించు దేవుడు

 

మన విరోధులను ఓడించు దేవుడు

మన విరోధులను ఓడించు దేవుడు 

మన దేవుడు విమోచించేవాడు గనుక నీవు ఆయనపై లక్ష్యం నుంచి కొనసాగితే నీ విరోధులను ఆయన అణిచివేస్తాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును ఆయన వర్ధిల్లనియ్యడు.

పరిచయం :

 మన శత్రువు బలవంతుడు, అయినప్పటికీ మనం భయపడవలసిన అవసరం లేదు, ఎందుకనగా మనం ఆరాధిస్తున్న దేవుడు, మనలో వశిస్తున్న దేవుడు  మన శత్రువు కంటే బలము కలవాడై ఉన్నాడు. సత్యాన్వేష్కులకు విజయశీలుడైన యేసయ్య నామములో శుభములు కలుగును గాక.

అందరూ బాగున్నారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై లక్ష్యముంచి చేసిన కార్యములను గూర్చి  వారి విమోచన నిమిత్తమై ఆయన చేసిన వింతైన కార్యాలను, వినాశనమును తప్పించిన విధానాన్ని  గూర్చి గత ధ్యానాల్లో విన్నాం కదా! గెలిచామని భావిస్తున్న విరోధి యొక్క గర్వాన్ని అణచివేస్తూ, శత్రుబలమంతటి నుండి తన ప్రజలైన వారికి ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో  నిర్గమాకాండం 13-15 అధ్యాయముల ద్వారా  ఈ భాగంలో తెలుసుకుందాం.

ఇశ్రాయేలు ప్రజలను పంపించి వేసిన తర్వాత ఐగుప్తీయులు మరల వారిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తూ వారిని సరిగ్గా ఎర్ర సముద్రం ఎదుటకు తీసుకొచ్చి ఆపాడు.

కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు, కానీ ఆయన కీడు చేసే వాడు మాత్రం కాదు. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఎర్ర సముద్రంలో మార్గాన్ని కలుగజేశాడు, వీరిని త్వరగా కలుసుకోవాలని పరిగెత్తుతున్న ఐగుప్తీయులను సరాసరి ఎర్ర సముద్రంలోనికి రానిచ్చి వారిని అందులో ముంచివేశాడు. ఇంతకాలం వారిని బాధించిన అధిపతులు ఘనులు శ్రేష్టులు అక్కడ శవాలుగా వారు ముందు తేలేరు.

యేసయ్య మరణం ఆయన యొక్క విమోచన కార్యం మన విరోధి అయిన సాతాను అణచివేసింది. మన దేవుడు విమోచించేవాడు గనుక నీవు ఆయనపై లక్ష్యం నుంచి కొనసాగితే నీ విరోధులను ఆయన అణిచివేస్తాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును ఆయన వర్ధిల్లనియ్యడు.

ముగింపు :

 మన విరోధులు మనపై జయమొందనివ్వని దేవుడు మన దేవుడు.  నీవు ఆయన పై గురి నిలుపుకో, ఎన్ని అడ్డంకులు వచ్చినా , నిన్ను చెక్కు చెదరినివ్వకుండా విజయ తీరాలకు చేర్చుతాడు. ప్రభు చిత్తమైతే మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్. 

Post a Comment