Rephidim Weekly Bible Quiz
గత వారం క్విజ్ సమాధానాలు
- చిన్న పిల్లలు వలె మారాలి, తగ్గించుకోవాలి (మత్త. 18: 3,4);
- 3 (మత్త . 19:12);
- ద్రాక్షతోట యజమాని ప్రొద్దున కూలికి వచ్చినవారితో (మత్త . 20:15);
- ప్రధానయాజకులు, ప్రజల పెద్దలు (మత్త . 21:23,25);
- హేరోదియులు, పరిసయ్యుల శిష్యులు (మత్త. 22:15-17);
- శాస్త్రలు, పరిసయ్యులు (మత్త. 23:13-15);
- దేవుని చేత ఏర్పరచబడినవారిని (మత్త. 24:31).
Rephidim Weekly Bible Quiz
మత్తయి సువార్త 25 నుండి మార్కు సువార్త 3 వ అధ్యాయము వరకు చదివి రెఫరెన్సుల ఆధారంగా మీ సమాధానాలు వ్రాయండి. మొత్తం మార్కులు (14)
సాధారణ ప్రశ్నలు :
- తన యజమాని కఠినుడు అని ఎరిగిన వ్యక్తి ఎవరు? (2M)
- యేసుక్రీస్తువారిని చంపాలని ఆలోచన చేసిన సమయంలో ఉన్న ప్రధాన యాజకుడు ఎవరు ? (2M)
- ఏ కారణం చేత యేసుక్రీస్తువారిని యూదా పెద్దలు అప్పగించారని పిలాతు అర్థం చేసుకున్నాడు ? (2M)
- కావలివారు భయపడినదెవరికి?(2M)
- బాప్తిస్మమిచ్చు యోహాను ఎక్కడ ఉండి పాపక్షమాపణ గురించి ప్రకటించాడు? (2M)
- సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న వ్యక్తి యొక్క తండ్రి పేరేమిటి?(2M)
- సమాజ మందిరములో యేసుక్రీస్తువారు దుఃఖపడుటకు కారణం ఏమిటి ? (2M)
గమనిక:
- సమాధానమునకు, రెఫరెన్సుకు సమానముగా మార్కులు ఇవ్వబడతాయి
- whatsapp లేదా SMS సమాధానాలు వంపేవారు 9666981896కు ఆదివారం లోపుగా పంపండి.
- మీలో కొంతమంది రెఫరెన్సులు రాయకుండా కేవలం సమాధానాలు మాత్రమే రాస్తున్నారు, అలా రాసిన యెడల మీకు సగం మార్కులే వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి