దిగులు చెందకు మిత్రమా ! నీకు ఒక ప్రత్యేకత ఉన్నది !! -ఆర్. సమూయేలు.

    

 దిగులు చెందకు మిత్రమా ! నీకు ఒక ప్రత్యేకత ఉన్నది !!

    


    కొంత మంది కొన్ని పనులు చాలా సులభంగా చేయగలగుతారు. మరి కొంత మందికి అవే పనులు చాలా కష్టంగా అనిపిస్తాయి మరియు అవి పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకు ఈ వ్యత్యాసం???? 

    కేవలం దేవుని కృప మాత్రమే. కొంత మందికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు కాబట్టి వారు త్వరగా దానిని పూర్తి చేయగలిగారు. మిగతా వారికి దేవుడు ఇంకో విషయం లో వారిని గొప్ప స్థాయి లో ఉంచారు కాని ఈ విషయం లో వారికి ఆ కృప ను ఇవ్వలేదు అంతే తేడా.

    కాబట్టి నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి నీకు ఉన్న గొప్ప సామర్ధ్యం ను బట్టి గర్వించకు. అది లేని వారిని చిన్న చూపు చూడకు. ఏదైనా నీకు లేనందున చింతించకు, కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించు, కృతజ్ఞత కలిగి ఉండు...

ఆర్. సమూయేలు.

Post a Comment