దేవుడు నన్ను ఇంతగా పట్టించుకుంటున్నాడా?
నన్ను సృష్టించాడు, పోషిస్తున్నారు, ప్రేమించుచున్నాడు, ప్రాణం పెట్టాడు, కునుకు లేకుండా కాపాడుతున్నాడు. ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండ కాపాడుతున్నాడు.
ప్రయాణంలో తోడుగా నిలిచి భద్రత ఇస్తున్నారు. మన పట్ల ఇంత ప్రేమ కలిగిన దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాము??? ఆయనకు దగ్గరగా వద్దాం.
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును - కీర్తన 121.

కామెంట్‌ను పోస్ట్ చేయండి