Praise God for His Protection - ps. 124.

Praise God for His Protection - ps. 124.

దేవుడిచ్చిన భద్రత కొరకై .......ఆయనను స్తుతించండి! 

    ప్రతి రోజూ వేల మంది, లక్షల మంది చనిపోతూన్నారు! మరి నీవు నేను మాత్రమే యెందుకు బ్రతికి ఉన్నాము? నిజంగా దేవుడు మన జీవితంలో లేకపోతే విపత్తులు, వినాశనాలు, వ్యసనములు, విరోధులు, మనల్ని యెప్పుడో చీల్చి వేసేవే!! దేవుడు కలిగించిన ఈ భద్రత కొరకై ఆయనను మనసారా స్తుతించండి!!! 

    ఇప్పుడే చదవడం ఆపి కొంచెం సేపు దేవున్ని స్తుతించండి.

    మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల, వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు, యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు,  జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక. 

    వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది (కీర్తన 124).

- ఆర్ సమూయేలు .

Post a Comment