God has been calling you /ఆది నుండి దేవుడు మానవులను పిలచువాడుగా ఉన్నాడు/ Telugu Commentary on Genesis 1:1

God has been calling you /ఆది నుండి దేవుడు మానవులను పిలచువాడుగా ఉన్నాడు/ Telugu Commentary on Genesis 1:1


ఆది నుండి దేవుడు మానవులను పిలచువాడుగా ఉన్నాడు 

  • ఆదిలో మనుషులను కలుగజేసినవాడు దేవుడే, వారికి రకరకాల పనులు కల్పించినవాడుగా, ఏర్పాటు చేసినవాడుగా ఉన్నాడు.

  • ఆయన వారిని రకరకాల పనులు కొరకు పిలిచినవాడుగా ఉన్నాడు. 

  • యెషయా 41:4 ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.

  • యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విధానమును బట్టి చూస్తే ఆయనే ప్రతి మనిషిని ఒక్కో పని కొరకు పిలిచి వారు ఆ పని పూర్తి చేయు వరకు లేదా వారి జీవితం అంతము వరకు వారితో ఉండేవాడుగా ఉంటాడు.

  • వారు దేవునిని విడిచి వెళ్ళవలసిందే గాని దేవుడు వారిని విడువడు.

దేవుడు మానవులను ఎందుకొరకు పిలుచుచున్నాడు??

1. రక్షణ పొందునట్లుగా పిలుచుచున్నాడు.

  • యెషయా 45:22 భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

2. ప్రత్యేక పని కొరకు పిలుచుచున్నాడు. 

  • నిర్గమకాండము 31:2 చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.

  • కీర్తనలు 78:70 తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను.

  • యెషయా 44:28 కోరెషుతో  నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను. 

  • యెషయా 45:1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని  యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. 

  • యెషయా 45:13 నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును

3. వెలుగులోనికి పిలుచుచున్నాడు

  • 1పేతురు 2:9 అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును , పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.

  • దేవుడు నిన్ను ఎందుకొరకు పిలిచాడో లేదా పిలుచుచున్నాడో తెలుసుకొని, ఆ పిలుపుకు స్పందించి, ఆయన నియామకంలో జీవించే వ్యక్తిగా ఉన్నావా?

  • ఆయన పిలిచిన పని కొరకు ఆయన ఇచ్చిన సామర్ధ్యంతో ఆయన కొరకు జీవించే వ్యక్తిగా ఉండుటకు తీర్మానం చేసుకో!!

  • - ఆర్. సమూయేలు.

Post a Comment