నీవు లేక క్షణమైన జీవించలేనయ్యా
పల్లవి : నీవు లేక క్షణమైన జీవించలేనయ్యా -
నీవు లేని బ్రతుకు ఊహించలేను (2)
నడిపించుచున్నావు ఇంతవరకు నన్ను -
నా చేయి పట్టి నడిపించుము (2)
నీవు లేని బ్రతుకు ఊహించలేను (2)
నడిపించుచున్నావు ఇంతవరకు నన్ను -
నా చేయి పట్టి నడిపించుము (2)
అ. ప: నీవే...నీవే...నీవే...నా యేసయ్య (2)
1. కష్టాల కడలిలోన శోధనల సంద్రములోన`
కన్నీటిలోయలోన కుమిలి నేనుండగా
కరుణించువాడవు కాపాడు దేవుడవు -
కృప చేత నన్ను విడిపించినావుగా॥నీవే॥
కన్నీటిలోయలోన కుమిలి నేనుండగా
కరుణించువాడవు కాపాడు దేవుడవు -
కృప చేత నన్ను విడిపించినావుగా॥నీవే॥
2. కార్యము సఫలము నీ వలనే సాధ్యము`
కృషి చేత మాత్రమే రాలేదు ఫలితము
కనికర సంపన్నుడవు క్షమియించు దేవుడవు
కేవలము దయచేతనే విజయమిచ్చినావుగా ॥నీవే॥
- ఆర్. సమూయేలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి