నీతిని విడిచి పెడుతున్నావా??


నీతిని విడిచి పెడుతున్నావా??


నీతిని విడిచి పెడుతున్నావా??


     నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. - కీర్తనలు 125:3

    మన చుట్టూ దుర్మార్గుల రాజ్యమేలుతున్నా, నీతి విడిచి జీవించడానికి పాపము చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అసలు అలా ఉంటానికి మనం ఎందుకు ప్రయత్నం చేస్తాం?
మనలో ఉన్న ఈ నాలుగు భావనలు మనం అలా చేయడానికి కారణమవుతూ ఉంటాయి.

  • నీతికి ఇక రోజులు లేవు 
  • భక్తి కలిగి ఉండుట ద్వారా సాధించేదేముండదు 
  • అన్నిచోట్ల అన్యాయమే గెలుస్తుంది 
  • చెడ్డదారిలో వెళితే తప్ప ఫలితాన్ని చూడలేము

    ఇలా ఆలోచిస్తే లోకమంతా దుర్మార్గంగా ఉన్నప్పుడు నీతిమంతులు కూడా తప్పిపోవటానికి పాపం చేయడానికి ఆస్కారం ఉన్నది. ఇది ఒక రకమైన శోధన అని చెప్పవచ్చు. 

    మరి దీన్ని జయించడం ఎలా? దుర్మార్గపు ప్రజల మధ్య అన్యాయము రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో నీతిగా జీవించడం ఎలా? ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే మనం దాన్ని జయించగలుగుతాం 

  • దుర్మార్గుల పరిపాలన తాత్కాలికమే,
  • దేవుడు ఇంకా అధికారంలో ఉన్నాడు,
  • కీర్తనకారుడు చెప్పినట్లు నీతిమంతులు పాపం చేయకుండా ఉండుటకుగాను దేవుడు భక్తిహీనులను దుర్మార్గులను ఎక్కువ కాలం అధికారంలో ఉంచడు.

    కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీతి విడిచి జీవించాలనే నీ ఆలోచనను దయచేసి పక్కకు పెట్టాలని విన్నవిస్తున్నాను.

    గడిచిన కాలంలో పరిస్థితుల ప్రభావమునకు లొంగిపోయి నీతికి రోజులు లేవంటూ అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా ప్రవర్తించుటకు నీవు ప్రయత్నం చేసినట్లయితే దానిని బట్టి దేవుని ఎదుట క్షమాపణ కోరుకుందాం, అలా మనం ప్రయత్నం చేయడం నిజంగా దేవుని యొక్క అధికారాన్ని గుర్తుంచక పోవడమే అవుతుంది.

    దుర్మార్గుల పరిపాలనలో మనం ఉన్నా అక్రమార్కుల మధ్య జీవిస్తున్నా, దేవుడే మనల్ని పరిపాలిస్తున్నాడని ఆయనే మనకు ఫలితం ఇస్తాడని నీతిని విలువలను విడిచిపెట్టక ఆయన కొరకు ఎదురుచూస్తూ జీవిద్దాం. 

    రూతు గ్రంథం రెండు మూడు అధ్యాయాలు చదివి ఆమెలో ఈ కోణం ఎలా కనబడుతుందో ధ్యానించండి.

    దేవా కాలాన్ని బట్టి మనుషులను బట్టి నా విలువలను విడిచిపెట్టక నీతి గల న్యాయాధిపతివైన నీ వైపు చూస్తూ మంచి మార్గంలో కొనసాగే భాగ్యం నాకు దయచేయండి. 
- ఆర్. సమూయేలు






Post a Comment