నా అవసరతలన్ని తీరుస్తున్నాడు

నా అవసరతలన్ని తీరుస్తున్నాడు

 2. నా అవసరతలన్ని తీరుస్తున్నాడు

పాట: 

యెహెవా యీరే..ఆయన నా పోషకుడు (సండేస్కూల్‌ పాటలు 3, పాట:119). 

పాఠ్యాంశ లక్ష్యం: 

దేవుడే మానవుల అవసరాలను తీరుస్తున్నాడని, మనకు కావలసినవన్ని ఇస్తున్నాడని తెలుసుకోవాలి.

లేఖన భాగం:   

    

    ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్న వానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతా నమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేతదూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచిహాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు; నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక  స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. -ఆది. 21: 8-23. 

కంఠత వాక్యం: 

 దేవుడు...మీ ప్రతి అవసరమును తీర్చును -ఫిలిప్పి. 4:19

ఉపోద్ఘాతం: 

    హాయ్‌ పిల్లలూ...బాగున్నారా? దేవుడు మన తండ్రి అని మునుపటి పాఠంలో తెలుసుకున్నాం కదా! దేవుడు మన తండ్రి అయితే మన కొరకు ఏం చేస్తారు? మీ డాడీ మీ కొరకు ఏం చేస్తారు..?(పిల్లల చేత సమాధానం చెప్పించండి) 

    మీ డాడీ మీకు అవసరమైనవన్ని ఇస్తాడు కదా! అలాగే దేవుడు కూడా మనకు అవసరమైనవన్ని ఇస్తాడు. 

ఒకసారి హాగరు అనే ఒకావిడ తన కొడుకుతో పాటుగా ఇంటి నుండి వెళ్లగొట్టబడిరది. వారికి ఎటు వెళ్లాలో తోచక చిన్నగా ప్రయాణం సాగించారు, అలా కొంతసేపు ప్రయాణం చేసిన తర్వాత వారు ఇంటి నుండి తెచ్చుకున్న నీరు అయిపోయినాయి. బాగా దప్పిక అవుతుంది. 

చుట్టుతా అంతా ఎడారి! పిల్లవాడు నీరు కోసం ఏడుస్తున్నాడు...(అలాంటి స్థితిలో మీరైతే ఏం చేస్తారు?) ఇక తన కొడుకు చనిపోతాడని హాగరు అనుకొంది. కాని....వెంటనే అక్కడ దేవుడు నీరు వున్న ప్రాంతాన్ని హాగరుకు చూపించాడు. 

    ఆమె అది చూచి నీరు తీసుకొని వచ్చి తన కొడుకు యొక్క దాహం తీర్చింది. అలాంటి ఎడారిలో వారికి నీళ్ళిచ్చి దేవుడు వారి దాహన్ని తీర్చాడు. 

ఈ రోజు మనకు కావలసినవన్ని దేవుడే ఇస్తున్నాడు.  మనం తినే చాక్లెట్‌, కూల్‌డ్రిరక్‌, పెన్సిల్‌, డ్రెస్‌ ఇలా అన్ని దేవుడిచ్చినవే. దేవుడు ఎందుకు ఇవన్ని మనకు ఇస్తున్నాడో తెలుసా? 

    మీరంటే యేసయ్యకు ఎంతో ఇష్టం, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, ఆయన మన డాడీ కాబట్టి మనకు అవసరమైన ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు. మనకు ఏది అవసరమైన ఆయనను అడిగితే ఇస్తాడు, ఆంతే కాక యేసయ్య మనకు ఇచ్చిన వాటిని బట్టి మనము యేసయ్యకు వందనములు చెప్పాలి. (వందనాలు యేసూ..సండేస్కూల్‌ పాటలు 3`45లో పాట పాడిరచి ప్రార్థన చేయించండి) 

- ఆర్. సమూయేలు 

Post a Comment