నా తలంపులలో నుండి…

నా తలంపులలో నుండి…

నా తలంపులలో నుండి…   

    నా జీవితంలోను, ఇతరుల జీవితములలోను నేను ధ్యానించిన, చూసిన, అనుభవించిన రకరకాల పరిస్థితులలో నాలో కలిగిన కొన్ని ఆలోచనలు మీ జీవితంలోను అన్ని సందర్భాల్లో కాక పోయిన కనీసం కొన్ని సందర్భాల్లోనైనా మీకు ఉపయోగపడతాయని, మిమ్మల్ని ఆదరిస్తాయని హెచ్చరిస్తాయని, మీకు అందిస్తూ ఉన్నాను.

Life is a journey.

 Life is a journey. On this journey, we will meet with various people. Some people become our friends, some relatives, others family members, and some other soul mates. Every person leaves a remarkable influence on us. Sometimes good and other times worst. In fact, we gather good and bad memories because of those people. However, none of them would stay forever, but only the one who designed and gave us this life, Jesus Christ. Therefore trust him every moment and submit everything into his hands. You just relax and enjoy what he provides. - August 16, 2016. 

    నీ దారిలో నీవు వెళ్తూనే వుండాలి. నీకు ముందు వెళ్ళినవారిని చూచి వ్యసనపడవద్దు, నీకన్నా ముందు వెళ్లారని, మాదిరికరమైన పాఠాలు నేర్చుకో! నీకు వెనుకవున్నవారిని చూచి గర్వించకు, వారికన్నా నీవు ముందు వున్నావని, సోమరితనమును రాన్విక లక్ష్యం వైపు దూసుకుపో! ఖచ్చితముగా దేవుడు నీకు తోడైయుంటాడు. - (జనవరి 25, 2019). 

యజమాని - జీతగాడు 

భాధ్యతగల యజమాని తన భావోద్రేకముతో సంబంధం లేకుండా బాధలోను సంతోషంలోను పనిచేస్తాడు. 
భారము లేని జీతగాడు ఏదో ఒకదానిని సాకుగా చూపి పనిని తప్పించుకుంటాడు. 
భాధ్యత గల యజమాని అవసరమును బట్టి అలసిన రీతిలోనే పని చేస్తాడు. 
భారము లేని జీతగాడు అవసరమున్న, లేకున్నా పనిలో విశ్రాంతిని కోరతాడు. 
భాధ్యతగల యజమాని తన ప్రాణమును ఫణంగా పెట్టి పోరాడతాడు. 
భారములేని జీతగాడు ఎవరు ఎలా మునిగినా తన ప్రాణమును కాపొడుకోడానికి ప్రయత్నిస్తాడు. 
భాధ్యతగల యజమాని వలె యేసయ్య వుండగా 
భారములేని జీతగాళ్ళుగా మనం ఉండవచ్ఛునా???? 
- (జనవరి 25, 2018). 

పని 

ఎవరో వస్తారు, మన పనులను సులభతరం చేస్తారని ఎవరి కొరకు ఎదురు చూడక, దేవుడు నీకిచ్చిన జ్ఞానముతో కష్టించి పనిచేయి, దేవుడు నీకు విజయమిస్తాడు. -
- (ఫిబ్రవరి 12,2018, కాకానివారిపాలెం). 

అభినందన - విమర్శ 

మంచి లక్షణమును గూర్చి ప్రచారం చేయలేని మనం చెడ్డ లక్షణమును గూర్చి పెదవివిప్పుతాం ఎందుకు?
అమ్మ అన్నం పెట్టగా అభినందించని మనం ఆమె అన్నం వండని రోజున కేకలేస్తాం ఎందుకు?
దేవుడు మేలుచేయగా కృతజ్ఞతలు చెప్పని మనం కీడుచేయగా ఆయనపై అరుస్తాం ఎందుకు? 
అభినందించలేని వారికి విమర్శించే హక్కులేదు. 
- (మార్చి  10, 2018, మైనంపాడు). 

ఎవరిని గూర్చో చెడుగా విమర్శించి ఏమి సాధిస్తావు? మనలను మనమే విమర్శించుకుంటే విమర్శ దినమున తప్పించబడతాము కదా ఆలోచించండి!! 
-(జూన్  10, 2020, హైదరాబాద్)

ఏ వ్యక్తి కూడా తన స్థాయికి మించిన దేనిని అర్ధం చేసుకోలేరు! కాబట్టి కనీస పరిజ్ఞానం, అనుభవముతో సంబంధం లేకుండా చేసే విమర్శలకు చెవిని ఇవ్వకపోవడమే మంచిది. -- (జనవరి 27, 2019)

సమస్యలు 

కసితోవున్నవాడు ఎదిగినట్లుగా కడుపునిండినవాడు ఎదగలేడు;
అపాయంలో ఉన్నవాడికి తెలిసినన్ని ఉపాయాలు సురక్షిత ప్రాంతంలో ఉన్నవాడికి తెలియవు.
సమస్యలలో పుట్టినంత గొప్ప సాహిత్యం సంతోషంలో పుట్టదు.
వేదన నిన్ను విస్తరింపజేయడానికే కలుగుతున్నది. విచారపడకు!
ప్రసవ వేదనపడతున్న స్త్రీ తన కుటుంబమును విస్తరింపజేసుకున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చవేయడానికి సిద్దపరచుచున్నాడు కృతజ్ఞతలు చెల్లించు! 

-(జనవరి 02 ,2019)

కష్టాలు అన్ని నాకే అని బాధపడకు! అవి నిన్ను ఎలా మార్చుతున్నాయో, ఎక్కడికి చేర్చుతున్నాయో గ్రహించి దేవునికి లోబడి జీవించు - మే 13, 2021

ఆలస్యం అవుతుందని ఆలోచించకు! ఆలస్యం ఇచ్చే అవకాశమును సద్వినియోగపరచుకో!! - మే 21, 2021

నీ జీవితం లో దేవుని సమయం పరిపూర్ణమైనదని యెరిగి ఆయన నీకు యే పని కేటాయించారో దానిని చేస్తూ భవిష్యత్తును గూర్చిన చింత మొత్తం దేవుని మీద మోపు ! - మే 23, 2021

దేవుడు నిన్ను ఏ పరిస్థితులు గుండా తీసుకువెళ్లినా కృతజ్ఞత కలిగియుండు! ఎందుకంటే ప్రతి పరిస్థితి,మరియు అక్కడ నేర్చుకున్న పాఠాలు నిశ్చయముగా మరొక సందర్భంలో ఉపయోగపడతాయి!! - మే 24, 2021

ఒక మనిషి మన దగ్గర లేడని బాధపడడం కన్నా సాధ్యపడితే కొంచెం మనం ఇబ్బంది పడినా పర్వాలేదు ఆ మనిషిని మనతోనే ఉంచుకొనడం మంచిది - మే 25, 2021

    యుద్ధవీరుడు కొన్ని సార్లు యుద్ధంలో గాయాలు పొందవచ్చు, కొన్ని సార్లు ప్రాణం కోల్పోవచ్చు. కాని ఈలోగా తాను అనేకమంది శత్రువులను హతమార్చి ఉంటాడు. కలుగుతున్న గాయాలు, జరుగుతున్న నష్టం గురించి ఆలోచించకు, దాని ద్వారా నీకు సిద్ధించబోయే విజయం మీదనే దృష్టి నిలుపు. - మే 27, 2022

    నేను మంచి చేసినా గాని ఎవరూ నన్ను గుర్తించడం లేదు అని చింతిస్తున్నావా ? గుర్తింపు గౌరవం లేకపోయినా కనీసం ప్రేమ ఆప్యాయత కూడా దొరకడం లేదని బాధపడుతున్నావా? నేను ఏమి చేసానని నన్ను ఇలా అందరు ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నారు అని ఆలోచిస్తున్నావా ? ఒక వైపు ఇలాంటి ఆలోచనలతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ, నిన్ను సమూలముగా నాశనం చేయాలని శత్రువు పన్నాగములు పన్నుతుండగా ఆ శత్రువు ఆశల పై నీళ్లు చల్లుతూ నిన్ను ఘనపరచుటకు హెచ్చించుటకు దేవుడు ప్రణాళికలు సిద్ధం చేయుచున్నాడు. కనుక దిగులు విడిచి దేవుడు ఏర్పరచిన ఆ సమయం కొరకు ఎదురు చూద్దాం ! - మే 28, 2022

    కత్తిరింపులు, కష్టాలు చూచి క్రుంగిపోవద్దు అవి నిన్ను బహుగా ఫలింపచేయడానికే వచ్చాయి అని తెలుసుకో. ఈ దిద్దుబాటులో పూర్తిగా దేవునికి అప్పగించుకో అప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. - మే 29, 2022

సమస్యలు, సవాళ్లు వచ్చినప్పుడే మనలో తగ్గింపు స్వభావం కలుగుతుంది.

పంచుకొనుట 

    మనము ఏదైనా విషయాన్ని (సమస్యలు, సంతోషాలు ) మరొక వ్యక్తితో ఈ రెండు కారణములు చేత పంచుకోవాలి. ఒకటి మన సమస్యను పంచుకొనడం ద్వారా వారు మనకు ఏమి చేసిన చేయకపోయినా ప్రార్ధన సహాయం చేసేవారుగా వుంటారు. రెండు, మన సంతోషమును పంచుకొనడం ద్వారా వారు కూడా దేవుని స్తుతించడానికి అవకాశం ఇచ్చిన వారముగా ఉంటాము.

 అర్ధం చేసుకొనుట 

    మనకు అర్ధం కాని విషయాలు ఎన్నో ఉంటాయి, అయితే మనకు అర్ధం కాని వాటిని గూర్చి మనకు అర్థమైన భావం చెప్పడం కన్నా ఎదుటి వ్యక్తి యొక్క స్థితిని అర్ధం చేసుకొని తగు రీతిగా ప్రవర్తించడం, సలహాలు ఇవ్వడం ఉత్తమం.

 స్వాతంత్రము

మనకు ఇవ్వబడిన సంపూర్ణ స్వాతంత్రమును బట్టి మనము అంత్యంత బాధ్యత కలిగి వ్యవహరించవలసియున్నది.

    ప్రసంగీకుడు 

    ఒక ప్రసంగీకునికి పవిత్రత, ప్రార్ధన, పరిశోధన, ప్రసంగ సిద్దపాటు చాలా అవసరం. వీటిలో ఏది కొరవైన ప్రసంగం ప్రభావవంతముగా ఉండదు.

    విలువ

    దేవుడు కొన్నిసార్లు మన యొద్ద నుండి కొన్నిటిని దూరం చేసి లేదా కొన్నిటి కొరకు ఎదురు చూచే విధముగా చేసి దాని విలువును మనకు అర్థమయ్యే విధముగా చేస్తాడు. - మే 25, 2017

        ఆకలైతేనే ఆహారం విలువ, జేబు ఖాళీయైతేనే డబ్బు విలువ, బందం దూరమైతేనే మనిషి విలువ, తిరస్కారం పొందితేనే అవకాశం విలువ, దప్పికైతేనే నీటి విలువ తెలుస్తుంది.

    క్రుంగిపోవద్దు

        ఈ వస్తువు పనికిరాదు అని ఓ వ్యక్తి అన్నప్పుడు క్రుంగిపోవద్దు, కుమిలిపోవద్దు. నిజమే ఈ వస్తువుకున్న కొన్ని లక్షణాలు ఆయన చేసే పనికి, ఆలోచనకు పనికిరాకపోవచ్చు. కాని కేవలం ఈ వస్తువుకు ఉన్న లక్షణాలే అవసరమైన పనులు ఉన్నాయి. దానికి ఈ వస్తువే. ఆ వ్యక్తే కావాలి. బహుశా దేవుడు నిన్ను ఆ పని కొరకు, ఆ ఉద్దేశం కొరకు సృష్టించి ఉంటాడు.
        కాబట్టి మనుష్యుల అభిప్రాయములను బట్టి క్రుంగిపోవద్దు. దేవుడు నీ పట్ల కలిగియున్న ఉద్దేశం తెలుసుకొని దాని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మనుషులు నిన్ను తృనికరించినందుకు కుమిలి పోవద్దు. వారికి నీవు అవసరం లేకపోవచ్చు కాని నీవు మాత్రమే అవసరమైనవారు. అలాంటి పనులు ఉన్నాయి. అవి నీ ఎదుటికి వచ్చినప్పుడు గొప్ప కార్యములు చూడగలుగుతావు.

    ప్రేమ 

        తండ్రియైన దేవుడు తన వలె మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. యేసుక్రీస్తువారు తానుండే స్థలంలో మనం కూడా ఉండాలని కోరుకున్నాడు. పౌలుగారు అందరూ తన వలె ఉండాలని ఆశించాడు. నీ వంటి ఐశ్వర్యం, ఆరోగ్యం, సమాధానం, రక్షణ, నిత్యజీవం, భౌతిక, మానసిక, ఆత్మీయ స్థితులలో నీ పొరుగువాడు ఉండాలని కోరుతున్నవా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుచున్నావా???? - (జనవరి 26, 2019). 

        ఆత్మహత్య చేసుకోకూడదు కాబట్టి నేను బ్రతుకుతున్నాను, విడాకులు తీసుకోకూడదు కాబట్టి కాపురం చేస్తున్నాను, ఏదో ఒక సంఘానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను, ఈ మాటలు ప్రేమ కలిగిన మాటలు కాదు.

    కోపము 

        మనకంటే పెద్దవాళ్ళు మనలను తృణీకరించగా కృంగిపోతాం! మనకంటే చిన్నవాళ్ళు మనలను తృణీకరించగా కోపపడతాం!! అయితే మనకంటే ఎంతో గొప్పవాడైన దేవునిని మనం తృణీకరిస్తే ఆయన మన మీద ఇంకెంతగా కోపించాలి?

    మాటలు

        కొన్ని మాటలు కృంగుదలను కలిగిస్తాయి!! కొన్ని మాటలు రోషమును పుట్టిస్తాయి!! కొన్ని మాటలు ప్రోత్సాహమును అందిస్తాయి!!! కొన్ని మాటలు నిద్రనుండి మేల్కొలుపుతాయి!!!! కృంగదీసినవారిపై కోపముంచుకొనవద్దు! రోషము పుట్టించినవారికి ప్రతీకారం చేయవద్దు!! ప్రోత్సహించినవారిని మరచిపోవద్దు!!! నిద్రలేపినవారికి వారసునిగా మారిపో!!!!

    కాలము 

        కాలమే అన్నిటికి సమాధానం చెప్తుంది అంటారు! కాలానుగుణముగా పరిస్థితులు మారతాయి అంటారు!! కాలము మారుతున్నదా? మనుష్యులు మారుతున్నారా? ఓ మంచి వ్యక్తి తన వ్యక్తిత్వమును జాగ్రత్తగా కాపాడుకొంటే తాను ఎల్లప్పుడు మంచి వ్యక్తిగానే ఉండగలడు!!! ఓ చెడ్డ వ్యక్తి తన చెడ్డ జీవితాన్ని మార్చుకొంటే తాను కూడా ఘనమైన స్థితిలో ఉంచబడగలడు!!!!

    క్షమాపణ 

        ఇతరులు కోపముతో మనలను గూర్చి చెడుగా మాట్లాడితే ఆ మాటలు మన హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తాయి! అంతటితో వారిపై మనకున్న సదాభిప్రాయము తొలగిపోతుంది!! వారిని ఎంతగానో అభిమానించిన మనమే వారిని అంతకంటే ఎక్కువగా అసహ్యించుకుంటాం!!! ఆ క్షణంలో వారితో మనకున్న మధుర జ్ఞాపకాలన్ని చేదు జ్ఞాపకాలుగా అన్పిస్తాయి!!! అయినప్పటికి కోపములో వారు పలికిన మాటలను మనస్సునుంచుకొనక క్రీస్తువలె వారిని క్షమించి ఆయన వలె వారిపై ప్రేమను చూపిద్దాం అలాంటి మనసు నాకివ్వు ప్రభువా.

    విశ్లేషణ 

        మనుష్యులు తమకు కనబడిన దానిని విశ్లేషిస్తారు; దేవుడు మన చర్యలన్నిటిని పరిశీలిస్తాడు; కాబట్టి మనుష్యులు మీ మంచితనమును గుర్తించకపోతే దిగులుపడవద్దు! మీ చెడుతనమును గుర్తించనందుకు అతిశయించవద్దు!! దేవుడు ఖచ్చితముగా ఎవరి ఫలమును వారికి ఆయన ఇస్తాడు!!!

    pleasure

    Sometimes pleasures of this world take us away from God, and other times painful situations that we experience in this world bring us closer  to God

    సృష్టికర్త

    సృష్టికర్తకు దూరంగా నీ జీవితం నిష్ప్రయోజనమే; సృష్టికర్త చేతిలో నీవో గొప్ప ఆయుధమే విశ్వసించు ఈ సత్యం, విజయం నీ సొంతం- జూన్ 24, 2018. 

        నన్ను సృష్టించాడు, పోషిస్తున్నారు, ప్రేమించుచున్నాడు,ప్రాణం పెట్టాడు, కునుకు లేకుండా కాపాడుతున్నాడు. ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండ కాపాడుతున్నాడు. ప్రయాణంలో తోడుగా నిలిచి భద్రత ఇస్తున్నారు. మన పట్ల ఇంత ప్రేమ కలిగిన దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాము??? ఆయనకు దగ్గరగా వద్దాం!! - జూన్ 29, 2021. 

    మన గతాన్ని చక్కగా ఎరిగినవాడే మన ప్రస్తుత జీవితమును గొప్పగా అర్ధం చేసుకోగలడు. - జూన్ 30, 2022. 

        దేవుడు మన జీవితంలో చేయని కార్యములను బట్టి మనం ఆయనను అపార్థం చేసుకొనక దేవుడు గతంలో చేసిన కార్యములను బట్టి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో గ్రహించే వారముగా ఉందాము . - జూలై  1, 2022. 

        దేవుడు చేసే ప్రతిది మన మంచి కోసమే. ఆయన మన యొద్ద నుండి ఏదైనా దాచియుంచినా, దూరం చేసినా అది మన మంచి కోసమే కనుక దేవునికి లోబడి ఆయన నియమించిన పరిధిలో దేవునిని సేవిద్దాం

    విధేయత

    విధేయత దీవెనను, అవిధేయత శాపమును తీసుకొస్తాయి విధేయత విజయమును, అవిధేయత అపజయమును తీసుకొస్తాయి. అవిధేయతను బట్టి ఓడిపోయిన సమయం చాలు దేవునికి విధేయత చూపి విజయాన్ని పొందు.

    కనిపెట్టుకొనుట 

        మనుష్యుల కొరకు కనిపెట్టుకొని అలసిపోయావా? అవమానపరచబడ్డావా? నిన్ను సిగ్గుపరచక, నీ ప్రతి అవసరమును తీర్చి, నిన్ను భద్రపరచగలిగిన దేవుని కొరకు కనిపెట్టుకొని సంతృప్తిని అనుభవించు

    దేవుడు చూస్తున్నాడు 

    దేవుడు నీ అక్రమమును చూస్తున్నాడు అతిశయించవద్దు దేవుడు నీ నీతిని చూస్తున్నాడు నిరాశపడవద్దు దేవుడు నువ్వు ద్వేషించబడడం చూస్తున్నా దిగులుపడవద్దు మనుష్యులు నీకు అన్యాయం చేయడం దేవుడు చూస్తున్నాడు అధైర్యపడవద్దు

    రక్షణ

    పాపం యొక్క తీవ్రత ఎలాంటిదో, దాని పర్యవసానాలు ఎంత గొప్పవో అర్ధం చేసుకోలేనివాడు దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణను అభినందించలేడు

    కుటుంబం

        మన కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం దెబ్బతినే వరకు మనమెందుకు ఒకరినొకరం పలకరించుకోవడం లేదు! ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంతో ప్రేమను చూపించే మనం బ్రతికియుండగా ప్రేమను గౌరవమును ఎందుకు చూపించలేకపోతున్నాం!! ఓ వ్యక్తి మరణిస్తేనే మనకు మన బాధ్యతలు జ్ఞాపకమెస్తాయా? ఆ తర్వాతనే గౌరవం పెరుగుతుందా?? ప్రేమ కలుగుతుందా??? ఓ వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి లేడని బాధపడే మనం బ్రతికుండగా ఎందుకు ఆ వ్యక్తి యొక్క విలువను గుర్తించడం లేదు? 

        ఓ వ్యక్తి మరణించిన తర్వాత సమాధితో, సంస్మరణ సభకో వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రేమను చాటే మనం బ్రతికుండగా తన అవసరానికి 10 రూపాయాలు ఇచ్చి ప్రేమను పంచితే ఎంత బాగుంటుంది! బ్రతికుండగానే చంపేస్తున్నాం! చనిపోయాక బ్రతకాలనుకుంటున్నాం!! భారమైన దూరమైన మనిషి ఉండగానే మేలు చేద్దాం!!! మన సంబంధాలను కుటుంబాలను బ్రతికించుకుందాం!!!! - జులై 9, 2019 , కాకానివారిపాలెం . 

        ప్రతి వ్యక్తి లోను ఓ బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను ప్రేమతో కప్పి వేసినప్పుడే మన సంబంధాలు నిలబడతాయి, అయితే ఆ బలహీనతను అదిగమించడానికి మనం సహాయం చేసినప్పుడే సహవాసంలో అందరము సంతోషంగా ఉండగలుగుతాము. - (జనవరి 30, 2021). 

        మనకు నచ్చినట్లు ఉండలేని చోటు మన ఇల్లు కాదు ! మనకు నచ్చినట్లుగా ప్రవర్తించలేని సంబంధం మనకు చెందినది కాదు ! చాలా తినాలి అన్పిస్తుంది కాని తినలేము, చాలా మాట్లాడాలి అన్పిస్తుంది కానీ మాట్లాడము ఎన్నో చేయాలని అనిపిస్తుంది కాని ప్రతి దానికి సంశయమే ఈలాంటి ప్రాంతములను, సంబంధాలను నరకం అని కాక ఏమని పిలవాలి ? మన సొంతవారే స్వతంత్రముగా మనతో ఉండలేని గౌరవప్రదమైన జీవితం మనకు వద్దు. వాళ్ళు అలా భావించడానికి ఏమి కారణమైందో తెలుసుకొని స్వేచ్ఛగా జీవిద్దాం ! జీవింపజేద్దాం !!

    శ్రమ

        శ్రమ మనలను గొప్ప వ్యక్తులనుగా తీర్చుతుంది. శ్రమ పొందిన పిమ్మట మనము ఇతరులను ఆ రీతిగా శ్రమపరచకూడదని; శ్రమ పొందుతున్నవారిని ఆదరించాలని ; శ్రమ పెట్టినవారికి మేలు చేయాలని ప్రభువు మనకు నేర్పిస్తాడు. -(జూన్  10, 2020, హైదరాబాద్)

     ఆనందాలు

    కొన్నిసార్లు ఈ లోకంలోని ఆనందాలు దేవుని నుండి మనల్ని దూరం చేస్తాయి, మరియు ఈ లోకంలో మనం అనుభవించే బాధాకరమైన పరిస్థితులు మనలను దేవునికి దగ్గరగా చేరుస్తాయి

    నాన్న

        మిమ్మల్ని నడిపించిన నాన్నకు మీరు నాన్నయై నడిపించవలసిన దినమున మీరు అందుబాటులో ఉండి సహాయం చేయగలిగితే అదే మీరు ఆయనకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి అవుతుంది.

    ఇరుకు

        ఇరుకుగా ఉందని విసుక్కోకు! నిందించకు!! ఇరుకుగా ఉండడానికి ఏది కారణం అవుతుందో గుర్తించు దానిని తొలగించుకో!!! అన్నిటికీ మించి ఇరుకులో విశాలత కలిగించు దేవుని వైపు చూడు!!!!

    దారులు 

    మూయబడిన దారులను గూర్చి చింతపడకు! దాని మూలంగా తెరవబడుతున్న దారులను గురించి సంతోషించు!!

    భయం

    దేవుని యందు మనకు ఉన్న భయం ఇతర భయములన్నిటిని జయించే విధముగా చేస్తుంది.

    faithful 

    Being faithful in smaller things will give you not only an opportunity but also the potential to handle greater things

    నమ్మకముగా ఉండడం

    చిన్న విషయములలో నమ్మకముగా ఉండడం గొప్ప విషయములను నెరవేర్చడానికి అవకాశమును మాత్రమే కాక సామర్ధ్యాన్ని కూడా ఇస్తుంది.

    లక్ష్యం

    నీ లక్ష్యం పెద్దదైనప్పుడు పర్వాలేదు చిన్న చిన్నగానైనా అడుగులు వేయి! కాని ఎక్కడా ఆగిపోకు !!

    నాయకుడు

        ఒక నాయకుడు మార్పును కోరుతున్నప్పుడు కొన్ని ఆటుపోట్లు, అవమానాలు, అపనిందలు, విమర్శలు ఎదుర్కొనడం సహజం.. నీవు చేసేది మంచి పనైతే వెనక్కు తిరుగకుండా ముందుకు సాగు, నిన్ను విడిచి వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తారు.

    ఆత్మీయ బలము

        ఆత్మీయ బలము, అంతరంగములో దేవుని శక్తి లేకుండా పరిచర్యలో పైకి సింహం వలె జూలు విదిల్చుకోవాలని చూడడం శత్రువుకు మనలను మనమే అప్పగించుకొనడం అవుతుంది.

    నిర్లక్ష్యం

        చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. చిన్న చిన్న ఆనందాలను, చిన్న పిల్లలతో గడిపే సమయాన్ని, చిన్న మొత్తంలో ఉన్న ధనమును, చిన్న పాపము, చిన్న చిన్న వ్యాయామాలు, మీ దృష్టిలో చిన్నగా కనిపించే మీ తలాంతును, నిర్లక్ష్యం చేయవద్దు.

    సంపాదించుకో

    దేవుడు చూసేవి మనుషులు చూసేవి కాదు! సంపాదించుకో!!

    మేలు

        కొన్ని చూడడానికి మాత్రమే బాగుంటాయి ! అవి ఆకలిని తీర్చలేవు ఆశలను తీర్చలేవు ఆవేదనను తీర్చలేవు ఆరోగ్యమును ఇవ్వలేవు ఆదాయము కలిగించలేవు. మోసకరమైన వాటిని మోహించి మనసు పాడుచేసుకొనక మనకు అన్ని విధాలా మేలు కలిగించువారి వైపు మన దృష్టి నిలుపుదాం!!

    దేవునితో సహవాసం

        ఒక మనిషి దేవునితో సహవాసం కలిగినవాడుగా ఉన్నప్పుడు తాను నిస్వార్ధపరుడుగా ఉంటాడు. తన గురించి కంటే ఇతరుల గురించి ఆలోచిస్తాడు. తనకు చేయవలసిన వాటి మీద కన్న తాను చేయవలసిన ,వాటి మీద దృష్టిపెడతాడు. తన అవసరాలు కన్నా ఇతరుల క్షేమం, మేలును ఆకాంక్షిస్తాడు.

    పరిశీలన 

    వారు ఎలా పడిపోయారో అనే దానిని దగ్గరగా పరిశీలించాలి అనే ప్రయత్నములో నీవు కూడా పడిపోతావేమో జాగ్రత్త !

    ఆదికాండము 

    పాపము - పరుగు       

        పాపం మనలో అపరాధభావం కలిగిస్తుంది. అపరాధభావం మనలో భయమును కలిగిస్తుంది. భయము మనలను పరుగెత్తి దాక్కునేలా చేస్తుంది. అయితే దేవుని యొద్ద నుండి దూరముగా పరుగెత్తడం ద్వారా మనం నిరాశ, నిసృహలకు, అనేక అపజయాలకు లోనయ్యేవారముగా వుంటాము. కాబట్టి నీ రాక కొరకు ఆతురముగా ఎదురుచూస్తున్న నీ రక్షకుడైన యేసు యొద్దకు పరుగున రా! ఆయన నీ అపరాధమును, దాని మూలముగా కలుగు ప్రతి ఫలితమును తొలగించి, మంచి మనస్సాక్షిని నీకు అనుగ్రహిస్తాడు (ఆది. 3:10; హెబ్రీ. 9:14)

    సిద్ధపాటు 

    తన సన్నిహితులను తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తువారు రానైయున్నారు! నీవు సిద్దమా!! (ఆది. 5:24)

    ఆశీస్సులు

    ప్రభువా! నా నుండి ఆశీస్సులు ఇతరులలోనికి ప్రవహించునట్లు చేయండి. అయితే తద్వారా గర్వం నాలో కలుగక దీనత్వం కలిగియుండునట్లు కృప చూపండి (ఆది . 12:1).

    తెలియదు కనుక త్వరపడదాం

    మన పోకడ యేసయ్య రాకడ ఎప్పుడో తెలియదు గనుక మన జీవితాలు మార్చుకొనుటకు, బాధ్యతలు నెరవేర్చుటకు, మన వలన మేలు పొందుటకు ఎదురుచూస్తున్న వారికి సహాయం చేయుటకు త్వరపడదాం (ఆది. 27:2).

    పిల్లలు 

        పిల్లలను అనుగ్రహించు వాడు దెవుడె. ఆ పిల్లలను ఆశీర్వదించు వాడు, జీవమును, భద్రతను, కృపను, ఘనతను మరియు మేలును అనుగ్రహించు వాడు కూడా దేవుడే. కాబట్టి పరిస్థితి యేదైనా దేవుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం ఉంచండి, ఎదురు చూడండి. (ఆది. 33:5&28:4& కీర్తన 84:1)

    నిర్గమకాండము 

    మార్పు 

        దేవుని వాక్య సత్యములను బట్టి మన నమ్మకాలూ, ఆలోచనలు, ఆచారాలు, ప్రవర్తన విధానం మారాలి. అది మన పెద్దవారు చెప్పి నేర్పినవి కావొచ్చు, అందరూ నమ్ముతూ పాటిస్తున్నవి కావొచ్చు, అవి హేతువులేనివిగాను, అర్ధం లేనివిగాను, దేవుని వాక్య విరుద్ధమైనవిగాను ఉన్నప్పుడు వాటిని మనము మార్చుకొనవలసియున్నది (నిర్గమ. 12:11)

    సమతుల్యత 

        జీవితంలో ఉండే ప్రతి అంశమునకు సమతుల్య స్థానం మనము ఇవ్వవలసియున్నది. కేవలము ఆత్మీయ విషయాలు మీద మాత్రమే గాక వ్యక్తిగత, కుటుంబ అంశాలకు కూడా సముచిత స్థానం ఇచ్చే ప్రయత్నం చేయాలి (నిర్గమ. 12:16)

    దేవునిని ఘనపరచుట     

        మనము చేసే ప్రతి పనిలో దేవునిని ఘనపరచేవారముగా ఉండాలి. దానినే ద్వేయంగా పెట్టుకుని మనము ముందుకు సాగాలి. దేవా నా జీవితంలో నిన్ను ఘనపరచలేని సందర్భములను బట్టి క్షమించండి. రాబోవు జీవితమంతా నిన్ను ఘనపరచు భాగ్యము దయచేయండి (నిర్గమ. 12:27)..

    ఆధిపత్యం

        దేవుడు సమస్తము పై ఆధిపత్యం కలిగియున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ రధములు కదలనివ్వకపోవడం, ముందుకు వెళ్లే అవకాశం, వెనకకు వెళ్లే అవకాశం రెండు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వస్తువులు. వ్యక్తులు, ప్రకృతి సమస్తము ఆయన ఆధిపత్యం క్రింద ఉన్నవి.

        నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న ఏ విషయాలు నిన్ను కృంగదీస్తున్నాయో జ్ఞాపకం చేసుకో, అయితే వాటిని గూర్చి దిగులుపడక దేవునిపై సంపూర్ణ విశ్వాసముంచి ఆయన ఆధిపత్యముకు అప్పగించుకో! ఈ లోకములో నీవు నమ్ముకొనదగినవారందరు కంటే ఆయన నమ్మదగినవాడు (నిర్గమ. 14:25)... (22 జూలై, 2022)

    అవగాహన

    నీ అవగాహన లోపంతో ఇతరులకు అడ్డు బండగా మారకు! (నిర్గమ. 16:22)

    బయట దొరకదు 

    దేవుడు అనుగ్రహించె శాంతి, సంతోషం, సమాధానము, ఆశీర్వాదము మరియు రక్షణ యేసు క్రీస్తు వారిలో తప్ప బయట దొరకదు. దేవుడు మన కొరకు ముందుగానే వాటిని సమృద్ధిగా యేసు క్రీస్తు వారిలో సిద్ధపరచి ఉంచారు. బయట వెదక వద్దు క్రీస్తు లోని సమృద్ధిని అనుభవించు. (నిర్గమ. 16:25)

    ఎస్తేరు గ్రంధము 

    విధేయత

    స్థితి మారినా, హోదా మారినా దేవునికి, సేవకులకు, తల్లిదండ్రులకు, పెద్దలకు మనము చూపు విధేయతలో మార్పు లేకుండ, రాకుండ చూసుకుందాం ! (ఎస్తే . 2:20). 

    దేవుని కృప మరియు న్యాయము

        దేవుని కృప మరియు న్యాయమును బట్టి జీవితములో సమస్తము సాధ్యమే! దేవుని కృపను బట్టి మనము మన బానిసత్వము నుండి విడిపించబడి రాజులుగా అధికారులుగా చేయబడవచ్చు, దేవుని న్యాయమును బట్టి మన నాశనమును కోరుకొనుచున్న విరోధులు నాశనము చేయబడడమును చూడవచ్చు. కాబట్టి నీ జీవితములో నీవు ఉన్న స్థితిని బట్టి కృంగిపోక దేవా నీ కృపను న్యాయమును కనబరచమని ఆయనను వేడుకొనండి!

    సమస్తము సాధ్యమే!

    సమస్తము సాధ్యమే! నీవు మార్చలేనిది! మనుష్యులు మార్చలేనిది!! దేవుడు మార్చుతాడు కనుక దైర్యం కోల్పోకు !!! ప్రార్ధించడం మానకుండా విశ్వాసముతో ముందుకు సాగిపో !!!! (ఎస్తేరు . 8:8). 

    కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 

    శోధన సమయం

        శోధన సమయం కొంచెం కష్టముగా, భారముగా, గందరగోళముగా మొదట్లో అనిపించవచ్చు కాని దేవుని సహాయముతో తట్టుకొని నిలబడగలిగితే గొప్ప నెమ్మది, దీవెన చూస్తాము (1 కొరింథీ . 10:31). 

    ఫిలిప్పియులకు రాసిన పత్రిక 

    సేవకుడు 

       మీరే తమ కిరీటములుగా భావించి దేవుని సేవలో అలుపెరుగక పరుగెడుతున్న మీ సేవకుని గూర్చి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, మీ మంచి పదార్థాలు వారితో పంచుకొని వారిని బలపరచండి (ఫిలిప్పి . 4:10) -(ఏప్రిల్  9, 2021, బూసరపల్లి) 

         నీ ఆత్మీయ క్షేమమును, ప్రగతిని ఆకాంక్షిస్తూ... తనను తాను మరిచిపోయి సేవ చేస్తున్న నీ సేవకుని యొక్క భౌతిక అవసరాలను గూర్చి ఆలోచన చేయుచున్నావా??? (ఫిలిప్పి . 4:16) -(మే 1, 2021, మద్దులూరు) 

    - ఆర్. సమూయేలు

    Post a Comment