రూతు : దేవుడే మన బంధువు
దేవుని ప్రేమించిన ఒక అన్యురాలుకి దేవుడిచ్చిన ప్రతిఫలమును గూర్చి తెలియజేసే గ్రంథమే రూతు గ్రంథము. ఈ గ్రంథంలో నాలుగు అధ్యాయాలు మనం చూడవచ్చు.
మొదటి రెండు అధ్యాయాల్లో రూతు అనే మోయాబీరాలు దేవునిని ఎలా ప్రేమించిందో తెలియజేస్తే చివరి రెండు అధ్యాయాలు మోయాబీరాలైన రూతుకు దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చారో తెలియజేస్తున్నారు.
ఈ గ్రంథంలో 12 సంవత్సరాల చరిత్రను మనం చూడవచ్చు. ఈ గ్రంథం కూడా న్యాయాధిపతులు కాలమునకు సంబంధించినదే. ఈ గ్రంథంలోని విషయాలు యూధా గోత్రంలోని ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలుగా ఉన్నాయి.
బెన్యామీను గోత్ర సరిహద్దుకు రెండు మైళ్ళ దూరంలో మాత్రమే రూతు గ్రంధంలో జరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ వాతావరణాన్ని పూర్తిగా భిన్నంగా ఉండటం మనం గమనించాలి.
ఈ గ్రంథం మనకు నేర్పే విషయాలు
మన కఠిన సమయాల్లో దేవునిపై ఆధారపడాలి.
న్యాయాధిపతులు ఏలిన కాలంలో వచ్చిన కరువు గురించి రూతు గ్రంథం మాట్లాడుతున్నది. పాత నిబంధనలో సాధారణంగా కరువులు దేవుని క్రమశిక్షణలో భాగంగా అనుగ్రహించబడతాయి. కరువులో దేవునిపై ఆధారపడిన వారిని దేవుడు పోషించాడు.
కరువులో కనానుని విడిచిపెట్టి వెళ్లిన వారు ఇబ్బందులు పడతారు. తమకు కలిగిన కరువును బట్టి ఎలిమెలకు నయోమి అనే ఈ కుటుంబం దేవునికి ప్రార్థన చేస్తే బాగుండేది. ఎందుకిలా జరుగుతుందని ఇప్పుడు మేము ఏమి చేయాలి అని దేవుని అడగటం వలన ఆయన వారికి మార్గ నిర్దేశం చేసుండేవాడు.
అయితే దానికి భిన్నంగా వీరు తమ సొంత ప్రణాళికను అనుసరించి రొట్టెల ఇల్లు అనే పిలవబడే బెత్లహేముని విడిచిపెట్టి మోయాబు అనే దేశానికి పయనమైనవారుగా ఉన్నారు. మోయాబు అనేది ఇస్రాయెలుకు శత్రుదేశం, ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బిలామును పిలిపించింది ఈ దేశస్థులే. వీరు ఆదేశములోనికి వెళ్లడం, అక్కడి స్త్రీలను పెళ్లి చేసుకోవడం ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి.
కానీ కొన్ని సంవత్సరాల్లోనే నయోమి తన భర్తను తన ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నది. కాబట్టి మన కఠిన సమయాల్లో మనకు మంచిగా అనిపించిన దారిని వెతుక్కుని వెళ్ళకుండా, దైవ చిత్తం ఏదో పరిశీలించి దానిని బట్టి అడుగులు వేయటానికి ప్రయత్నం చేయాలి.
మన నిర్ణయాలే మన జీవితాన్ని రూపొందిస్తాయి
ప్రతి వ్యక్తి జీవితంలోనూ నిర్ణయాలనేవి కీలక పాత్ర వహిస్తాయి, బెత్లహేమును విడిచి పెట్టాలనే నిర్ణయమే నయోమి కుటుంబాన్ని మోడుగా మార్చింది. ఇప్పుడు నయోమి కుటుంబంలో తనతో సహా ముగ్గురు విధవరాలు మిగిలారు. తానున్న పరిస్థితిని బట్టి మోయాబుల్లో తానిక ఉండాల్సిన అవసరం లేదని నయోమికి అనిపించింది, పైగా కరువు ఉందని ఏ బెత్లహేమును తాను విడిచిపెట్టి వచ్చిందో, అక్కడ ఇప్పుడు ఆహారము సమృద్ధిగా దొరుకుతుందన్న వార్తలు కూడా వినపడ్డాయి.
కాబట్టి తాను తిరిగి బెత్లహేముకి వెళ్లాలని నిర్ణయం చేస్తుంది అయితే విధవరాలు గా ఉన్న తన ఇద్దరు కోడళ్లను కూడా తనతో పాటు బెత్లహేముకి తీసుకెళ్లడం ద్వారా వారి భవిష్యత్తుకు ఏమంత మేలు చేకూరదని ఎరిగిన నయోమి, మీరు మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి అని తన ఇద్దరు కోడలను ప్రోత్సహించింది.
నయోమి, పెద్ద కోడలు అయిన ఓర్పా తన భవిష్యత్తును వెతుక్కుంటూ అత్తను విడిచి బయలుదేరి వెళ్లింది. కానీ మరో కోడలైన రూతు నయోమిని విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడక, నీ దేశమే నా దేశమే నీ దేవుడే నా దేవుడు అంటూ, మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయలేదు చెప్పి తన అత్తతో పాటు బయలుదేరి బెత్లహేము కు చేరింది.
అతను విడిచి వెళ్లిన ఓర్పా గురించి, చదవడానికి చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. కానీ అతను హత్తుకున్న రూతు, గొప్ప చరిత్రలో భాగం పంచుకుంది. మోయాబులో ఒక సాధారణ మహిళగా సమాధి కావలసిన రూతు జీవితం, ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఉన్నతమైన స్థానానికి, జీవితానికి కారణమైంది.
ఏసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె చోటు దక్కించుకోవడం ఎంత గొప్ప విశేషమో. అంతేకాదు ఈవిడ ఇశ్రాయేలు చరిత్రలో గొప్ప రాజుగా పేరుందిన దావీదుకు అవ్వగా ఉన్నది. ఇది మనకు నేర్పుతున్న పాఠము ఏంటంటే సరైన సమయంలో సరైన నిర్ణయం చేయడం చాలా కీలకం. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ సుందరంగా మన జీవితాన్ని మలుచుకుందాం.
దేవునిని మనుషులను ప్రేమించుటకు నేర్చుకుందాం.
ఈ గ్రంథంలో రూతు, అటు దేవునిని మనుషులను ప్రేమించేదిగా ఉన్నది. తాను ఆరాధించి వచ్చిన మోయాబు దేవుళ్ళు దేవతల కంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆమెకు నిజమైన దేవుడుగా కనబడ్డాడు.
దేవుడు తన ప్రజలను శిక్షిస్తున్నటువంటి సమయంలో కూడా, ఆమె దేవుని ప్రేమించగలిగింది. ఆ ప్రేమను బట్టి తన అత్తకు ఎంతో నమ్మకంగా సేవ చేయగలిగింది. ఇంతగా దేవునిని ప్రేమించిన రూతు, దేవునికి ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది.
బెత్లెహేము ప్రజలందరూ ఆమె గురించి చర్చించుకునే అంతగా వారిని ప్రభావితం చేసింది. మన తోటి వారిని ప్రేమించక దేవుని ప్రేమిస్తున్నామని మోసం చేసుకోవద్దు. మన కష్ట పరిస్థితులలో దేవునిని అపార్థం చేసుకొనుక ఆయనను ఇంకా ఎక్కువగా ప్రేమించుటకు ప్రయాసపడేవారంగా ఉందాము.
ధైర్యము వినయము కలగలిసిన జీవితం
ఈ రెండు గుణాలు కలిగిన వ్యక్తిగా రూతును మనం ఈ గ్రంథంలో చూడవచ్చు. పరాయి పరిగ ఏరుకొనడానికి వెళ్లే అంత ధైర్యం ఆమెకు ఉన్నది, నేను వెళ్లి వచ్చేదా అని అడిగే అంత వినయం కూడా ఆమెకు ఉన్నది. ఇలాంటి జీవితం కచ్చితంగా ఎవరినైనా ఆకర్షిస్తుంది.
ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? నిజానికి ధైర్యం ఉంటే వినయం లేక, వినయం ఉంటే ధైర్యం లేక కొనసాగే వారు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ఈ మాటలు ధ్యానిస్తుండగా మనం ఏ గుంపుకు చెంది ఉన్నాము ఆలోచిద్దాం.
దేవుడే మన సమీప బందువు
రూతు గ్రంథాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవడానికి, రెండు విషయాలు మనం గ్రహించాలి. ఒకటి బంధు ధర్మము రెండు వివాహం విషయంలో ఇజ్రాయిల్ కున్న సామాజిక ఆచారం.
మొదటిగా బందు ధర్మము గురించి ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరమును గూర్చిన నియమము ఒకటున్నది, సునాద సంవత్సరమనే జూబ్లీ అని కూడా అంటారు. అంటే ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ 50 సంవత్సరాలలో, ఏ వ్యక్తి అయినా ఏ కారణం చేత అయినా తన ఆస్తిని అమ్మితే లేదా పోగొట్టుకుంటే 50 సంవత్సరాల తర్వాత అది మరల తిరిగి అతనికి వస్తుంది.
ఆ ఆస్తి పై గల తమ హక్కును తెలియపరచడానికి ఆ ఇంట్లో పురుషులు ఉండాలి. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా, లేదా కుటుంబంలోనైనా ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే, వారసులు లేకుండా చనిపోతే, ఆ వ్యక్తికి తర్వాత ఉన్నవారు, రక్తసంబంధీకులు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యను వివాహం చేసుకొని తమకు కలిగే మొదటి బిడ్డను చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి వారసునిగా ప్రకటించాలి, అలా చేయడం ద్వారా ఇశ్రాయేలు జాతిలో ఆ వంశము తుడిచిపెట్టబడకుండా, వారి ఆస్తి వేరే ఎవరికీ దక్కకుండా దేవుడు ఏర్పాటు చేశాడు.
ఇప్పుడు ఇక్కడ రూతు గ్రంథంలో మన ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గడచిన కాలంలో నయోమి లేదా రూతు కుటుంబానికి చెందిన ఆస్తిని అమ్మడం లేదా తాకట్టు పెట్టడం వారు చేసి ఉంటారు, అలా చేసినప్పుడు అమ్మిన దాన్ని తాకట్టు పెట్టిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అవసరమైన సొమ్మును సంపాదించుకుని, ఈ 50 సంవత్సరాల లోపు గా పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి తెచ్చుకోవచ్చు.
వారికి అంతటి సమర్థత లేనప్పుడు 50 సంవత్సరాలు వరకు ఆగితే వారి ఆస్తి వారికి మరల వస్తుంది, అయితే అది మాది అని చెప్పటానికి వీరి కుటుంబంలో పురుషుడు లేదా వారసుడు ఉండాలి.
కానీ రూతు కుటుంబంలో లేదా నయోమి కుటుంబంలో పురుషులు ఎవరు లేరు, ఇప్పుడు ఆ ఆస్తిని తిరిగి తెచ్చుకునే ఏకైక మార్గం ఏమిటంటే దేవుడు ఏర్పాటు చేసిన బందు ధర్మమును బట్టి రూతును ఎల్లిమెలకు ఇంటికి చెందిన సమీప బంధువుడు రూతును వివాహము చేసుకోవడమే.
సమీప బంధువుడిగా మారాలనుకున్న వ్యక్తికి ఈ మూడు అర్హతలు ఉండాలి. అతను రక్తసంబందియై ఉండాలి, రెండు విడిపించే సమర్థత కలిగిన వాడై ఉండాలి అనగా ఆస్తిని తిరిగి తీసుకురాగలిగిన ధనం తన దగ్గర ఉండాలి, మూడు విడిపించుటకు ఇష్టత చూపే వాడై ఉండాలి.
వాస్తవానికి ఈ గ్రంథంలో బోయజు ఈ పాత్రను నిర్వర్తించినప్పటికీ, బోయిజు కంటే ఇంకా సమీప బంధువు ఒక ఆయన ఈ పని చేయడానికి ముందుకు రాలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే, తాను రూతును వివాహం చేసుకొని పిల్లలను కంటే, రూతు ద్వారా కలిగే ఆ ఒక్క వారసుడే తనకు వారసుడుగా ఒకవేళ మిగిలితే తన ఆస్తి మొత్తం కూడా ఎల్లిమెలకు వంశానికి వెళ్ళిపోయిద్దేమో అన్న భయంతోటి ఆయన వెనక్కు తగ్గాడు.
ఏది ఏమైనప్పటికీ బోయజు రూతున వివాహం చేసుకొని ఎలిమలకు యొక్క ఆస్తిని విడిపించినవాడుగా ఉన్నాడు. మరొక సమీప బంధువు వలె భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయంతోటి బోయజు వెనక్కు తగ్గలేదు.
మనందరం మన యొక్క పాపములను బట్టి రూతు వలె మనకు మనము సహాయం చేసుకోలేని స్థితిలో ఉండగా, మనకు సమీప బంధువుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన మనవలే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు, మన విమోచన కొరకు అవసరమైన ధనాన్ని చెల్లించాడు, మనకు విడుదల కలిగించిన వాడుగా ఉన్నాడు. మన సమీప బంధువైన ఏసుక్రీస్తు వారిలో తప్ప ఇంకెక్కడ మనకు విమోచన దొరకదు.
దేవునితో లోతైన సంబంధం ఏర్పాటు చేసుకోవాలి.
ఈ నాలుగు అధ్యాయాల్లో రూతు ప్రవర్తించిన విధానము మనకు చక్కని పాఠమును నేర్పుతున్నది. మొదటి అధ్యాయంలో అసలు బోయజు ఉన్నాడన్న సంగతి రూతుకు తెలియదు, రెండవ అధ్యాయంలో బోయజు ఒక రైతు వలే ఆమెకు పరిచయమయ్యాడు. మూడవ అధ్యాయంలో రూతు బోయజుకు మరింత దగ్గర అయింది, నాల్గవ అధ్యాయంలో రూతు బోయజును వివాహం చేసుకున్నది.
మనలో చాలామంది రెండవ అధ్యాయంలో ఉన్న రూతు వలె మన కష్ట కాలంలో దేవుడిచ్చే దీవెనల కొరకు ఆయనను వెంబడించేవారంగా ఉంటాం, మనము అక్కడే ఆగిపోతాం, ఇంకొక అడుగు ముందుకు వేసి రూతు ప్రవర్తించిన రీతిలో ప్రవర్తించే ప్రయత్నం మనలో చాలామంది చేయడం లేదు.
ఇక్కడ రూతు గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనకు తెలియాల్సిన మరొక కీలకమైన విషయం ఏంటంటే వివాహం విషయంలో ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న ఒక సామాజిక ఆచారం.
ఇస్రాయిల్ దేశంలో ఒక స్త్రీ ఒక పురుషునికి వివాహ ప్రతిపాదన చేసే అవకాశం లేదు. వివాహం విషయంలో తానే ముందడుగు వేసే అవకాశము స్త్రీకి లేదు. నేను పలాన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనే విషయాన్ని తెలియపరిచే అవకాశం ఒక స్త్రీకి లేదు.
అయితే తాను వివాహానికి సిద్ధంగా ఉన్నట్టు, తన యొక్క ఇష్టతను వ్యక్తపరిచే ఇతర మార్గాలు ఉన్నాయి. మూడవ అధ్యాయంలో రూతు చేసింది అదే. ఆ మార్గంలో ఒక మార్గం ఏంటంటే, పురుషుడి యొక్క కాళ్ల దగ్గర ఉన్న బట్ట తీసి, అతని కాళ్ల వద్ద పడుకోవడం. ఇలా చేసి నీ కొంగు నా మీద కప్పమని అడగడం ద్వారా తాను అతనితో వివాహానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియపరచడం అవుతుంది. రూత్ అలా చేసినప్పుడు బోయజు తన నిర్ణయాన్ని తెలియపరిచాడు.
మనము కూడా మన జీవితాల్లో కేవలం దేవుడిచ్చే అనుదిన దీవెనలతో తృప్తి చెందక, ఆయన పాదాల వద్దకు చేరి ఆయనతో లోతైన సహవాసం ఏర్పరచుకొనుటకు, రానయున్న పెండ్లి కుమారుని కొరకై సిద్ధపాటు కలిగి ఉండుటకు తీర్మానించుకుందాం.
పవిత్రతను కాపాడుకోవడం.
రూతు తన జీవితంలో విధవరాలుగా మారినప్పటికీ, బోయజుతో తన వివాహము జరిగే వరకు తనకి ఇష్టమైన ఏ వ్యక్తిని వెంబడించక, పవిత్రమైన జీవితాన్ని జీవించింది. బోయజు,రూథులు ఇద్దరు కూడా బంధు ధర్మమును గూర్చిన విషయం తేలే వరకు, వారి వివాహం జరిగే వరకు పవిత్రంగా వారి జీవితాన్ని కొనసాగించారు. అటువంటి మాదిరిని మనం కూడా అనుసరిద్దాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి