బైబిల్ లోని కొలతలు
తూము
యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచినీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము. -1 సమూయేలు 17:17
తూమెడు అనేది ఎండిపోయిన వస్తువులను కొలవడానికి ఉపయోగించే కొలతగా ఉంది. గింజలు పొడులు ఇలాంటివన్నీ కొలవడానికి దీనిని ఉపయోగిస్తారు. ఒక తూము పది ఓమెర్లకు సమానం. అనగా 20 కేజీలు అని చెప్పవచ్చు.
ఓమెరు
మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను. -నిర్గమకాండము 16:16
ఓమెరు ఎండిపోయిన వస్తువులను కొలవడానికి ఉపయోగించే కొలతగా ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులకు మన్నాను ఇచ్చిన సమయంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఓమెరు చొప్పున ఇచ్చాడు. మన్నా మంచు వలె కురిసి, ఎండ పెరిగే కొలది ఒక పొడి లాగా మారుతుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఓమెరు అంటే రెండు కేజీలు అని అర్థం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి