Lxx

 

LXX

LXX

 గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడిన  హెబ్రీ  బైబిల్ ను సెప్తుజైంట్ అని LXX అని పిలుస్తారు. దీనికి పునాది మహా అలెగ్జాండర్ కాలంలోనే జరిగింది. మహా అలగ్జాండర్ ప్రపంచమంతా నిన్ను జయిస్తున్నటువంటి దినాల్లో గ్రీకు భాష మరియు సాంప్రదాయాలు ప్రాచీన దేశమంతటా వ్యాపించాయి. 

అంతేకాదు  బబులోను చెర తర్వాత  చాలామంది యూదులు యెరుషలేముకు తిరిగి రాకుండా గ్రీకు మాట్లాడే ప్రాంతాల్లో అనగా అలెగ్జాండ్రియా ఐగుప్తు  అనే ప్రాంతాల్లో స్థిరపడిపోయిన వారిగా ఉన్నారు. 

ఈ ప్రాంతాల్లో స్థిరపడిన యూదా సమాజము, ఎక్కువ భాగం లేదా దాదాపుగా హీబ్రూ భాషను మర్చిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి వీరి కొరకు హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధనను గ్రీకు భాషలోకి తర్జుమా చేయడం అనివార్యమైంది.

 దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అరిస్థియాస్  లేఖలలో మనకు లభ్యమవుతుంది. ఈ లేఖలు క్రీస్తుపూర్వం 200 సంవత్సరాలకు సంబంధించినవి. ఈ లేఖలో ఈజిప్ట్ దేశాన్ని పరిపాలిస్తున్న టోలమి II ఒక్కొక్క గోత్రానికి ఆరుగురు చొప్పున 12 గోత్రాల నుండి 72 మంది అనువాదకులను తన యొద్దకు పంపమని  యూదా ప్రధాన యాజకుని అడిగినట్లుగా చూడవచ్చు. 

ఈ 72 మంది అనువాదకులు 72 రోజుల్లో ఈ తర్జుమాను పూర్తి చేశారు అనే విషయము ఈ లేఖల ద్వారా తెలియపరచబడుతున్నది. వాస్తవానికి ఈ 72 రోజుల్లో అనువాదం చేయమని అడిగింది మరియు అనువాదం చేయబడినది మోషే రాసిన ధర్మ శాస్త్ర గ్రంథాలు మాత్రమే అయినప్పటికీ ఈ సెప్తుజైంట్ ను హీబ్రూ బైబిల్ యొక్క గ్రీకు తర్జుమాగా పిలుస్తూ ఉంటారు.

 ఈ 72 మంది తర్జుమాదారులను ఒక్కొక్క గదిలో ఉంచినట్టుగా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వీరు ఈ పని జరిగించినట్టుగా కూడా చెబుతూ ఉంటారు. వాస్తవానికి 72 మంది ఈ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ ఈ పని పూర్తయ్య లోపల ఇద్దరు మరణించారని, అందుకే దీన్ని 70 అని (LXX ) పిలుస్తారని తెలియజేసే మరొక వృత్తాంతం కూడా ప్రాచుర్యంలో ఉంది.

 అయితే ఈ తర్జుమా పాత నిబంధన గ్రంథాన్ని  పోల్చి చూడ్డానికి ఎంతో ప్రయోజనకరమైన తర్జుమా అని చెప్పవచ్చు. 

Post a Comment