మన మనసేరిగిన దేవుడు.



మన మనసేరిగిన దేవుడు.

మన మనసేరిగిన దేవుడు.

శారా నేను బలము ఉడిగినదాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. - ఆదికాండము 18: 12

శారమ్మ గారు మనసులో అనుకున్న మాట బయటకి ఎలా వినబడింది?  కానీ ఆ మాట ఎవ్వరికి వినబలేదు ఒక్కరికి తప్ప! ఆ ఒక్కరు ఎవరో కాదు అన్ని చోట్ల ఉంటూ అందరి మనసులను ఎరిగిన సర్వంతర్యామియైన మన దేవుడు.

 ఆయనకి తెలియనిది ఏది లేదు, కాబట్టి లోకమంత పరిపాలన చేస్తూ అందర్నీ నిత్యం కాపాడుతున్న మన కాపరి ఆయన, నిజమైన గొర్రెల గొప్ప కాపరి. 

ఆయనకి అంత తెలుసును కనుక శారా గారి మనసులో అనుకున్నది దేవుడు బయటికి చెప్పాడు. కాబట్టి మనం దేవునికి చెప్పినా చెప్పక పోయిన అన్ని తెలిసిన దేవుడు మనకున్నాడు అని తెలుసుకోవాలి.

 అందుకే ఆయన్ని మనం తెలుసుకోవాలి అయన గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి అని ఆశను పెంచుకోవాలి

మన గురించి ఏవో కొన్ని తెలిసిన వారిని బాగా గుర్తు పెట్టుకొని వారి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటాము కదా!  మరి మన సృష్టికర్తయైన దేవుడు, ఆయన మన తండ్రి మన కాపరి మన కేడెము మన దుర్గము మనల్ని కాపాడేవాడు పోషించేవాడు ఆదరించేవాడు ఆపదలో ఆదుకునేవాడు ఇలా ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో విధాలుగా ఆయన గురించి చెప్పొచ్చు.

 ఇలాంటి దేవుడు గురించి ఇంకా తెలుసుకోవాలి ఆయనను గట్టిగ పట్టుకోవాలి నమ్మకం కలిగి ఆయనను వెదకాలి అని మనం మరింత ఆశ కలిగి శ్రద్దగా వేడుకుందాం. మరింత తెలుసుకుందాము ఆమెన్. 

- టి . కుమారి గారు , హైదరాబాద్ . 

Post a Comment