సమస్య మీద కాదు దేవుని మీదనే లక్ష్యముంచాలి
పరిచయం :
సమస్య కంటే దేవుడు గొప్పవాడు, వాక్యాన్వేషకులందరిని ప్రేమతో రెఫీదీమ్ వాక్య ధ్యాన సమయముకు ఆహ్వానిస్తున్ననాను. అందరూ బాగున్నారా? దేవుడు మనపై లక్ష్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం కదా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల లక్ష్యం నుంచి గొప్ప కార్యములు జరిగిస్తున్నప్పటికీ, వారికి ఏర్పడిన చిన్న సమస్యను బట్టి వారు దేవునితో ఎలా ప్రవర్తించారో, నిర్గమకాండం 4-6 అధ్యాయముల ద్వారా తెలుసుకుందాం.
మోషే వచ్చిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలను పోగుచేసి దేవుడు తనతో చెప్పిన విషయాలన్ని వారితో చెబుతూ వారిని విడిపించడానికి దేవుడు తనను పంపినట్టుగా చెప్పిన మాటలను బట్టి వారు ఎంతగానో సంతోషించారు.
మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి. -నిర్గమకాండము 4:31
ఆ తర్వాత మోషే రాజును కలసి ఈ ప్రజలను విడుదల చేయమని కోరాడు. దానికి రాజు ఒప్పుకపోగా, మరింత కఠినంగా ప్రజలతో వ్యవహరించడం ప్రారంభించాడు. అందులో భాగంగా వారు ఇటికలు చేయడానికి అంతకుముందు గడ్డి ఇచ్చేవాడు, ఇప్పుడు మోషే వచ్చి మాట్లాడిన తర్వాత మీకు గడ్డి ఇవ్వను, కానీ ఇటికల లెక్క మాత్రం తగ్గకూడదు అని చెప్పి, వారు ఇంతకు మునుపు వలె ఇటికలు చేయలేక పోయినప్పుడు వారిని కొట్టడం ప్రారంభించారు.
దీని సంగతి ఏంటో తేల్చుకుందామని ఇశ్రాయేలు పెద్దలు రాజు దగ్గరికి వెళ్తే, అదే సమయంలో మోషే వారికి ఎదురు పడటం జరిగింది, మీ వల్లనే మాకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నట్లుగా వారి మాటలు మోషేతో ఉన్నాయి.
మోషేకిదేమంతా మంచిగా అనిపించలేదు దేవుని వద్దకు వెళ్లి ప్రార్థన చేస్తే ఆయన తాను చేయబోయే కార్యాన్ని తెలియపరిచాడు, మోషే ఆ విషయాలను తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తే వారు వారు ఉన్నటువంటి దాసత్వాన్ని బట్టి దేవుని మాట మీద మోషే మాట మీద లక్ష్యముంచలేకపోయారు.
మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమునుబట్టియు మోషే మాట వినరైరి. -నిర్గమకాండము 6:9
మన జీవితంలో కూడా దేవుడు మన మీద లక్ష్యముంచి ఎన్నో రీతులుగా సహాయం చేస్తూ, మన కొరకు ఎన్నో ఏర్పాట్లు ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి సహాయానికి, ఇంత గొప్ప సృష్టిలో మన మీద ఆయన లక్ష్యముంచి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుడు నీ కొరకు చేస్తున్న ఏర్పాట్లు గ్రహించక, ఆయన నీ జీవితంలో ఏమీ చేయలేదన్నట్టుగా నీవు మాట్లాడి ఉంటే దానిని బట్టి క్షమించమని దేవుణ్ణి కోరుకొనండి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మొదట్లో మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు వలే సమస్య మీదనే లక్ష్యం ఉంచి దేవుని మీద లక్ష్యం ఉంచకుండా కొనసాగి ఉంటే దానినిబట్టి క్షమించుమని దేవుని కోరుకుంటూ, ఇకనుండి నీపై లక్ష్యం ఉంచుతున్న దేవుని మీదనే లక్ష్యం నుంచి కొనసాగడానికి తీర్మానించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.
ముగింపు :
దేవుని వాక్యమును బట్టి సరి చేసుకుంటూ, ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పును చేయక ప్రభువును హత్తుకుని జీవించేవారంగా ఉందాం, ప్రభువు చిత్తమైతే మరొక అంశంతో మరల కలుద్దాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి