నిత్య పాలకుడు



నిత్య పాలకుడు


కీర్తనలు 45:6 దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.

ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఎన్నో రాజ్యలు ఉన్నాయి, కానీ అవన్నీ ఒక ప్రాంతానికి కొంతకాలానికి సంబంధించినవి పరిమితమైనవై ఉన్నాయి. రాజరికపు వ్యవస్థ విషయం అలా ఉంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఎప్పటికప్పుడే పాలకులు మారుతూ ఉంటారు. పాలకుడు మంచివాడైనా చెడ్డవాడైనా కాలక్రమంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే.

ఒకవేళ ఎవరైనా తమ సింహాసనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే భూమ్మీద దేవుడు వారికి నియమించిన కాలం ముగిసినప్పుడు వారి పరప పరిపాలన ముగిస్తుంది, కొన్నిసార్లు వారి శత్రువుల చేతిలో కుట్ర చేయబడి ప్రాణాలు కోల్పోయి అనుకోని పరిస్థితుల్లో సింహాసనాన్ని విడిచిపెట్టే విధానాలు కూడా జరుగుతూ ఉంటాయి.

సింహాసనాలే కాదు రాజ్యాలు కూడా చేతులు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు రాజ్యాలు కోల్పోవడం మరి కొన్నిసార్లు రాజ్యాలను సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది.

మనిషి జీవితమే నీటి బుడగ వంటిది కనుక స్థిరమైన రాజుగా శాశ్వతమైన రాజ్యముగా ఒక రాజు లేదా రాజ్యం ఈ లోకంలో నిలబడాన్ని మనం చూడలేం.

కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిరంతర పాలకుడుగా ఉన్నాడు. ఈ వచనంలో ప్రభువైన ఏసుక్రీస్తు వారిని దేవా అని సంబోధించుతున్న విషయాన్ని గమనించాలి. ఆయన దేవుడు, మానవ రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు కానీ ఆయన దైవత్వము కలవాడు అని సంగతి మనం మర్చిపోకూడదు.

ఇక్కడ మనం గమనించవలసిన రెండో విషయం ఏంటంటే ఆయనకు ఒక సింహాసనం ఉన్నది, ఏసుక్రీస్తు వారు భూలోకంలోనికి మనిషిగా దిగి వచ్చినప్పుడు ఆ సింహాసనమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజ్యము అవధులు లేనిది. పరలోకంలోనూ భూమ్మీదను ఉన్న ఏకైక రాజు ఆయనే.

మూడవదిగా ఆయన రాజ్యము నిరంతరము నిలుస్తుంది. గోమాట్లో చెప్పాలంటే ఆయన సింహాసనము నిరంతరము నిలుస్తుంది. సింహాసనం మీద నుండి ఆయనను దింపగలిగిన వారు, ఆయన యొద్ద నుండి రాజ్యమును లాగేసుకునేవారు భూలోకంలో గానీ పరలోకంలో గానీ మరెవరూ లేరు.

పాతాళ లోక ద్వారములు ఏసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా నిలిచినప్పటికీ ఆయన రాజ్యమును అది కదిలించలేవు, ఆయన రాజ్యము ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది.

యెషయా 9:7 ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

ఈ రాజ్యమునకు మితి లేకుండా రుద్ది క్షేమము కలుగుతుంది, ఈ రాజ్యమునకు క్షీణత క్షామము ఉండదు కనుక ఇది సర్వకాలము నిలుస్తుంది, దీనికి అంతము ఉండదు.

ఒకానొక రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగిస్తాడు, అయినప్పటికీ ఆయన కూడా నిరంతర పరిపాలకుడుగా కొనసాగుతాడు.

1 కోరింథీయులకు 15:24 అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.

నిరంతర పాలకుడుగా ఉన్న ఏసుక్రీస్తు వారిని నీ జీవితంలో కలిగి ఉన్నావా, ఆయనకు రాజు గాని జీవితంలో స్థానాన్ని ఇచ్చావా? ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఆయన రాజ్యమే అని గ్రహించి ఆలస్యము చేయక ఆయన రాజ్యమునకు వారసుడవై ఆ రాజ్యంలో ఉండే నీతి సమాధానం ఆత్మలో ఆనందమును అనుభవించే వ్యక్తివిగా ఉండాలని మనవి చేస్తున్నాను.

ఈ రాజ్య పౌరసత్వము కలిగి నిరంతర పాలకుని యొక్క అధీనంలో నీ జీవితం సాగుతూ ఉన్నదా, ఎలుగెత్తిని రాజును స్తుతించు, అనేకమందికి ఆయన గొప్పతనమును ప్రకటించు, ఆయనను ఒకటి కీర్తిస్తూ నీవెంతగా ఆయనను ప్రేమిస్తున్నావో తెలియపరచు. గొప్ప దీవెనలతో దేవుడు మనలను నింపును గాక.

Post a Comment