తీర్పు తీర్చు దేవుడు




తీర్పు తీర్చు దేవుడు

తీర్పు తీర్చు దేవుడు


 అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతో కూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందెయున్నానెను - ఆదికాండము 6:7

మనం కట్టిన ఇంటిని మనమే కూల్చుకోడానికి ఇష్టపడము! మన పిల్లలను మనమే చంపుకోడానికి ఇష్టపడము. మనము తయారు చేసుకున్న వేటి మీదనైనా ఎవరైనా చేయి వేస్తే ఒప్పుకోము. మనకు సంబందించిన వాటిని ఇంకొకరు పాడు చేయడానికి అవకాశం ఇవ్వము, మనమే వాటిని నాశనం చేయడానికి ఆలోచన కూడా చేయము. నీతిమాలిన, నీచులమైన మనమే మనకు సంబందించిన వాటి విషయములో ఇలా ఉంటే పరిశుద్ధుడైన దేవుడు ఇంకెలా ఉంటారు? అయితే దేవుడు ఈ వచనములో తాను కలుగజేసిన వాటిని తానే నాశనం చేస్తాను అని తెలియజేస్తున్నాడు, ఆయన అలా ఎందుకు అంటున్నాడు??

 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి -యెషయా 49:15,16

తల్లి మరచినా మరువను అని చెప్పిన దేవుడు, అరచేతుల మీద చెక్కుకున్నాను అని చెప్పిన దేవుడు, ఎందుకు అంత కఠినముగా మాట్లాడాడు? దేవుడు ప్రేమామయుడన్న మాట నిజమే! కాని ఆయన న్యాయవంతుడు, తీర్పు తీర్చేవాడు, కోపం చూపేవాడు కూడా! దేవుడు మన సృష్టికర్తయై ఉన్నాడు గనుక ఆయనకు మన జీవితముతో ఏమి చేయడానికైనా అధికారం ఉన్నది.

 యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదు ననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయ నుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును. - యిర్మియా 18:1-10

దేవుడు మన జీవితముతో ఏదైనా చేయడానికి సమర్దుడైనప్పటికీ, ఆయన మనతో మంచిగా వ్యవహారిస్తూ మంచి చేసేవాడుగా ఉన్నాడు

 యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. - విలాపవాక్యములు 3:22,23, 25, 26

దేవునికున్న ఈ మంచితనం మనము దేవుని వెదుకునట్లు ఆయన కోరిన రీతిలో మంచిగా జీవించినట్లు చేయాలి ఇదే మనం దేవునికి చూపే కృతజ్ఞత. మనం ఈ విధంగా ప్రవర్తించనప్పుడు అది మొదట దేవునికి బాధ కలిగిస్తుంది. మన యొక్క గర్వ ప్రవర్తనలన్నీ ఆయన హృదయాన్ని ఎంతో బాధపెడతాయి

 చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును. - యిర్మియా 13:15-17

దేవుడు బాధపడుతూనే కొంతకాలం మనలను ఓర్చుకుంటాడు, మన చెడ్డ ప్రవర్తనను ఓర్చుకుంటాడు, కానీ ఆయన ఎల్లకాలం ఓర్చుకోలేడు, కారణం ఆయన తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. కచ్చితంగా మనం చేసిన కార్యాలను బట్టి తీర్పు తీర్చుటకు ప్రారంభించేస్తాడు. నోవహు కాలములోని ప్రజలు ఈ 3 విధాలుగా తప్పిపోయి దేవునికి బాధ కలిగించి, తీర్పు లో నిలబడ్డారు.

  • వ్యర్థమైన ఆకర్షణలకు లొంగిపోయినవారుగా
 దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. - ఆదికాండము 6:2
  • జీవితములో(మార్గంలో - నడవడికలో) , ఆలోచనలో చెడుతనము కలిగినవారుగా
 నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. -ఆదికాండము 6:5, 12
  • బలాత్కారము చేసేవారుగా ఉన్నారు
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. - ఆదికాండము 6:11

వాస్తవానికి మనం కూడా చేసిన జీవించిన చేయలేకపోయినా పనులను బట్టి విధానాన్ని బట్టి ఇప్పటికే తీర్పులో ఉన్నాం.

 ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. - యోహాను 3:18

మనపై ఉన్న ఈ తీర్పును బట్టి మనలను ఆ తీర్పు నుండి తప్పించడానికి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవుని తీర్పును బట్టి మనం పొందిన శిక్షను ఆయన మన స్థానంలో భరించాడు, ఆయన యందు విశ్వాసముంచిన వారి మీద నుండి ఆయనను బట్టి ఆ శిక్ష తీసివేయబడింది. అయితే యేసుని విశ్వసించక అసత్యములోనే కొనసాగుతున్న వారు ఇంక నువ్వు తీర్పులోనే ఉన్నారు ఎల్లప్పడికి ఉంటారు. కాబట్టి దేవుడు మనకు ఇస్తున్న నూతన సంవత్సరాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి చేస్తున్న మేలులను బట్టి ప్రభువు వైపు తిరిగి ఆయన మార్గంలో కొనసాగడమే నిజమైన కృతజ్ఞత.

 అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని. ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను. మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతము నందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి, దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. -2 దినవృత్తాంతములు 33:12,13,15,16

తనకు కలిగిన మేలును బట్టి మనషే దేవునికి ఇష్టుడిగా మారిపోయాడు, కానీ తనకు కలిగిన మేలును బట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని హిజ్కియా జీవించలేకపోయాడు

 ఆ దినములలో హిజ్కియా రోగియై మరణదశలో నుండెను. అతడు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన యొకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. - 2 దినవృత్తాంతములు 32:24-26

ఈరోజు వంతు మనది దేవుని కార్యాలు చూస్తున్నా మనం ఆయనతో వ్యవహరించే విధానంలో ఎలా ఉంటున్నామో పరిశీలన తీసుకొని, నిజమైన కృతజ్ఞత కలిగి తీర్పును తప్పించుకునే వారంగా ఉందాం.

Post a Comment