పాత నిబంధన లోని ప్రాంతాలు

పాత నిబంధన లోని ప్రాంతాలు

పాత నిబంధన లోని ప్రాంతాలు 

గెరారు - 

    గెరారు అనేది ఫిలిష్తీయ దేశంలోని, పాలాస్తిన యొక్క దక్షిణ సరిహద్దులోనున్న ఉన్న ఒక జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణమై ఉన్నది. ఇది గాజాకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ వ్యవసాయానికి అనువైన ప్రాంతం అని కూడా మనం చెప్పవచ్చు.

ఫిలిష్తీయ - 

    ఈ దేశంలో గాజా, ఎక్రోను, అష్కెలోను, గాతు,గెరారు అష్డోదు అనేవి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలుగా ఉన్నవి. 

 .....ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయుల యొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయుల యొక్కయు దేశమును -యెహోషువ 13:3

    ఇక్కడ నివసించే ఫిలిష్తీయలు కస్లుహీయుల నుండి వచ్చిన వారు.

 ....ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు. -ఆదికాండము 10:14

    వీరు కఫ్తోరు అనే ప్రాంతంలో ఉండేవారు

........... కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను ....,. -యిర్మియా 47:4

    దీన్నే క్రేతు ప్రాంతంగా కూడా కొంతమంది బైబిల్ పండితులు తెలియజేస్తుంటారు, క్రేతు అనే ప్రాంతంలో అపోస్తులుడైన పౌలు పరిచర్య చేశాడు, తీతును తర్వాత ఆ ప్రాంతానికి పంపడం జరిగింది.

.......... నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. -    తీతుకు 1:5

    వీరు స్వభావికంగా గర్విష్టులు, విగ్రహారాధికులు, మూఢనమ్మకాలు కలిగిన వారు, యుద్ధాన్ని కోరుకునేవారు.

అష్డోదులో సంకర జనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను. జెకర్యా 9:6

ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడు కొనిరి. -న్యాయాధిపతులు 16:23

 .... ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు .... -యెషయా 2:6

ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని ....1 సమూయేలు 17:1

    వీరిని ఆత్మీయంగా నామకార్థ క్రైస్తవులకు పోల్చడం జరిగింది. ఐగుప్తు లోకమునకు సాదృశ్యంగా ఉంటే, ఫిలిష్తీయులను నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం అని చెప్తూ ఉంటారు, దీనికి కారణం ఏంటంటే దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన పాలాస్తిన ప్రాంతంలో వారు ఉంటున్నారు, ఆ ప్రాంతం తమదని వారు చెప్పుకుంటారు, కానీ వారి ప్రాంతానికి హక్కుదారులు కాదు. నామకార్థ క్రైస్తవులు కూడా, తమను తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ వారి జీవితంలో దేవునికి ఏమాత్రం స్థానం ఉండదు.

పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. -2 తిమోతికి 3:5

    అంతేకాదు వీరు సున్నతి లేని వారు, అనగా దేవునితో సంబంధమే లేని వారు

..జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ... -1 సమూయేలు 17:26

    నామకార్థ క్రైస్తవులు తాము దేవుని ఎరిగినవారమని, దేవుని చిత్తమును నెరవేరుస్తున్నామని చెప్పుకుంటారు కానీ నిజానికి వారు దేవుని వాక్యాన్ని వక్రీకరించి వారి సొంత భాష్యములు చెప్పుకుంటూ జీవించేవారుగా ఉంటారు.

పాలస్తీనా -

 ఫిలిష్తీయ యొక్క గ్రీకు నామాన్ని బట్టి ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది.

ఊరు -

 దక్షిణ మెసపొటోమియాలో సాంస్కృతిక వ్యాపారాలకు కేంద్రంగా ఈ ప్రాంతం ఉన్నది. ఐగుప్తు తర్వాత  ఈ ప్రాంతంలోనే నైపుణ్యమైన చేతి పనివాళ్ళు ఉండేవారు, స్థానికంగా పండిన ధాన్యాన్ని బయట ఓడల ద్వారా తెచ్చిన ధాన్యంతో ఇక్కడ మార్పిడి చేసేవారు. ఈ పట్టణస్తులు అత్యంత ధనవంతులు, కాబట్టి చాలా విశాలవంతమైన ఇండ్లలో నివసించేవారు. 

- Rephidim Ministries  

Post a Comment