పరీక్షలో విఫలమైన శారా



పరీక్షలో విఫలమైన శారా

పరీక్షలో విఫలమైన శారా

మానవ జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి సహజం, పురుషుడికైనా స్త్రీకైనా, ధనవంతులు కైనా దరిద్రులకైనా కొన్నిసార్లు వాటిని అనుభవించక తప్పదు. జీవిత నావా ఎల్లప్పుడూ ఒకే విధంగా పయనించదు, కొన్నిసార్లు పరిస్థితులు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన శార జీవితం కూడా అలాంటి ఓ పరిస్థితి ఏర్పడింది. 

మనలను పిలిచిన దేవుడే నడిపిస్తాడు, పోషిస్తాడు, సహాయం చేస్తాడు విజయం ఇస్తాడు, తాను కోరుకున్న రూపం లోనికి మనలను మార్చుతూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో అన్ని సందర్భాల్లో ఆయనను అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కొంతమందికి కష్టమవుతుంది. 

జీవితంలో అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు దేవుని అర్థం చేసుకోవడం సులభమే. కానీ దేవుడే కొన్ని కఠిన పరిస్థితులను అనుమతిస్తే ఆ సందర్భాల్లో ఆయనను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో ఎందుకిలా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నలు తొలిచేస్తూ ఉంటాయి. 

ఇంతకీ శారా జీవితం జరిగింది ఏమిటంటే.. దేవుడు పిలిచిన దేశానికి వారు వారు ప్రయాణాన్ని కొనసాగించగా, వారు కనానులో ఉండగానే ఒక కరువు వచ్చింది. కరువు పేదవాడిని కుదిపేస్తుంది, మరి కరువులో ధనవంతులు మాటేంటి? వారు కొంతవరకు దానిని మంచిగానే నెట్టకొస్తారు అని చెప్పొచెమో! 

గొప్ప ధనవంతుడైన అబ్రహం యొక్క కుటుంబాన్ని కూడా ఈ కరువు ఇబ్బంది పెట్టింది అని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో శారా మనోగతం ఎలా ఉండి ఉండొచ్చు? ఊర్లో ఉండగా కరువు అంటే ఏంటో తను అనుభవించినదా? కరువు ఉన్నట్టు విని ఉంటుందేమో కానీ, వాళ్ల కుటుంబంలో వాళ్ల గృహంలో కరువు ఉండి ఉండకపోవచ్చు. 

మన భారతదేశంలో కరోనా కలిగిన సమయంలో దేశమంతా లాక్ డౌన్ విధించగా ధనికులు మధ్య తరగతి వారు ఏదో ఒక రకంగా నెట్టుకొచ్చినప్పటికీ, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నవారు ఎంతో ఇబ్బంది అనుభవించారు. 

ఇప్పుడు కనానులో ఉంటుండగా శారాకు ఈ కరువు భారంగా అనిపించి ఉండొచ్చు. దేవుడే మమ్మల్ని పిలిచాడు కదా, మరి ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న తనకు తలెత్తి ఉండొచ్చు. 

ఈ పరిస్థితుల్లో తాను తిరిగి విడిచి వచ్చిన ఊరికి వెళదామని మనసులోనైనా భావించి ఉంటదా? అసలు ఎందుకు దేవుడు ఈ కరువును ఈ సమయంలో వారి జీవితంలో అనుమతించాడు? కేవలము వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. 

మనము దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో, ఆయనపై మనం ఎంతగా ఆధారపడతామో అను వాటిని పరీక్షించుట కొరకు, మన ప్రేమను వెల్లడి చేయటానికి అవకాశం ఇస్తూ దేవుడు కొన్ని కఠిన పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. 

కరువులో ఏలియాను సారెపతు విధవరాలను పోషించిన దేవుడు అబ్రహామును వారి కుటుంబాన్ని పోషించలేడా? దేవుని పిల్లలు శ్రమలు అనుభవిస్తుండగా, ఆయన కచ్చితంగా వారికి తోడుగా ఉండి వారికి సహాయం కలుగుటకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాడు. 

అయితే మనము శ్రమ పడుతున్న వేళ, మనకు కలిగిన శ్రమ వలన పొందుతున్న బాధను బట్టి విశ్వాసమును భక్తిని విస్మరించేవారంగా కొన్నిసార్లు మనం ఉంటూ ఉంటాము. శారా అబ్రహాము లు కూడా సరిగ్గా ఇక్కడ అదే తప్పు చేశారు. వారి విశ్వాసానికి కట్టబడిన తొలి పరీక్షలో విఫలమౌతూ కనాను దేశాన్ని విడిచి ఐగుప్తు దేశానికి పయనమవ్వాలని నిర్ణయం తీసుకుని బయలుదేరి వెళ్లారు. 

ఈ మాటలు తెలుసుకుంటుండగా, శారాలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా? అలా ఎదురైన పరిస్థితులలో మీరు ఎలా ప్రవర్తించారు? దేవుడు మీ జీవితంలో అనుమతిస్తున్న పరీక్షలలో మీరు విజయం సాధిస్తున్నారా? ఓటమిపాలవుతున్నారా? ఒకసారి ఆలోచించండి. 

పరీక్షను నిర్వహించే ఏ ఉపాధ్యాయుడు కూడా తన పిల్లలు ఫెయిల్ అవ్వాలని కోరుకోరు. వారు గెలవాలనే కోరుకుంటారు, కానీ అది పరీక్షా సమయం కనుక మౌనంగా ఉంటారు. గతంలో వారు మనకు బోధించిన పాఠాలను ఆధారం చేసుకుని, పరీక్షా పత్రంలో మన ఎదుట ఉన్న ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాలి. 

అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఇంతవరకు మనల్ని నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రస్తుతము మనకు ఎదురయితున్న శ్రమలలో తిరిగి ఆయన మీదే ఆధారపడుతూ ఆయనకు అప్పగించుకుంటూ ఆయన చిత్తము చేయడానికి నిర్ణయించుకునే వారంగా ఉండాలి.

ఇక్కడ శారా తన వైఫల్యం వల్ల మనకు నేర్పుతున్నది ఏంటి? ఆమె ఏమైతే చేయలేకపోయిందో, ఏ విషయాల్లో ఆమె విప్లమైందో, ఆ పరిస్థితులు మన జీవితంలో మన ఎదుర్కొన్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతున్నది. ఇప్పుడు ఆమె చేయలేకపోయిన వాటిని పరిశీలించి మనమేమి నేర్చుకోవాలో చూద్దాం. మనము సారా వంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు

దేవునికి ప్రార్థన చేద్దాం! - 

ఇక్కడ మనం చేయవలసిన ప్రార్థన, ఈ సమస్య నుండి నేను ఎలా బయటికి రావాలి అని కాదు, ఈ సమస్య ద్వారా నాలో నుండి ఏమి బయటికి రావాలి అనే విషయం మీద దృష్టి పెట్టి మనం ప్రార్ధించాలి. అలా చేయడం ద్వారా దేవుని మనసును తెలుసుకోగలుగుతాం, ఈ శ్రమలో తట్టుకునే శక్తి ఇవ్వమని కూడా, నడవవలసిన మార్గాన్ని బోధించమని కూడా మనము దేవుని ప్రార్థించవచ్చు

దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి- 

శ్రమల్లో మన పట్ల దేవునికున్న చిత్తమేమిటో ఎరిగినవారమై దాన్ని మనం నెరవేర్చాలి. దేవుడు వెళ్ళమని అబ్రహాముకు చెప్పే వరకు వేచి ఉంటే ఎలా ఉండేదో!

సమస్య నుండి పారిపోకూడదు -

Post a Comment