సత్యము
సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును.- కీర్తనలు 45:4
సత్యము అనే పదానికి హెబ్రీ భాషలో సాధారణంగా ఎమెత్ అనే పదం ఉపయోగించబడేది, ఈ పదానికి స్థిరము లేదా దృఢము ఖచ్చితము అని అర్థం. అయితే ఇందులోనే దృఢత్వము, వాస్తవికత, చెల్లుబాటుతనం, నమ్మకత్వం, నిలకడ, ఆధారపడదగిన అనే అంశాలు మిళితను చేయబడి ఉన్నాయి.
ఇదే పదం ఒక వ్యక్తి యొక్క మాట ఆలోచన చర్యను గూర్చి ఉపయోగించబడినప్పుడు అతనికున్న యదార్ధత అనే లక్షణాన్ని గూర్చి చెప్పబడింది. ఇదే పదాన్ని గ్రీక్ భాషలోని పాత నిబంధనలో (LXX) అలేత్య అని, ఇంకొన్నిసార్లు పిస్టిస్ అని, మరియు దికాయో సునే అని తర్జుమా చేయడం జరిగింది.
ఇదే పదము స్థిరపరచు నిలబెట్టు సహకరించు అనే అర్ధాలు ఇచ్చే ఆమాన్ అనే హెబ్రీ పదంతో సంబంధం కలిగినదిగా ఉన్నది, మరియు నిజము అని అర్థం ఇచ్చే ఆమెన్ అనే పదంతో కూడా దీనికి సంబంధం ఉన్నది.
ఎమెత్ అనే ఈ పదాన్ని మన తెలుగు బైబిల్ లో ఎలా తర్జుమా చేసారో చూద్దాం. తెలుగు బైబిల్ లో ఈ పదాన్ని సత్యము, నిజము,విశ్వాసము,
సత్యము
మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలోn ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి -ఆదికాండము 42:16
అప్పుడు రాజుయెహోవా నామమునుబట్టి అబద్ధముకాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీచేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా -2 దినవృత్తాంతములు 18:15
నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను. -కీర్తనలు 25:5
నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును. -కీర్తనలు 43:3
సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును. -కీర్తనలు 45:4
నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. -కీర్తనలు 51:6
యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. -కీర్తనలు 86:11
నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను. -కీర్తనలు 119:43
నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును. -కీర్తనలు 119:160
నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము -సామెతలు 8:7
సత్యమును అమ్మివేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము. -సామెతలు 23:23
ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను. -ప్రసంగి 12:10
ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. -యెషయా 10:20
యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి. -యెషయా 48:1
న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు. -యెషయా 59:14
సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను. -యెషయా 59:15
సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా జీవముతోడని ప్రమా ణముచేసినయెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు, ఆయనయందే అతిశయపడు దురు.-యిర్మియా 4:2
సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.-యిర్మియా 9:5
అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్య బడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.-దానియేలు 8:12
మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.-దానియేలు 9:13
అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.-దానియేలు 10:21
ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధ ముగా రేపును.-దానియేలు 11:2
మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమా ధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.-జెకర్యా 8:16
సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగానాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియ ముగా ఎంచుడి.-జెకర్యా 8:19
నిజము
ఆ స్త్రీ ఏలీయాతోనీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.-1 రాజులు 17:24
అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా-1 రాజులు 22:16
యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచుహృదయపూర్వకముగా నిజము పలుకువాడే-కీర్తనలు 15:2
తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు..-కీర్తనలు 145:18
నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.-సామెతలు 12:19
నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.-సామెతలు 14:25
అయితే మీకు చెవులార ఈ మాటలన్నిటిని చెప్పుటకు నిజముగా యెహోవా మీయొద్దకు నన్ను పంపియున్నాడు గనుక, మీరు నన్ను చంపినయెడల మీరు మీమీదికిని ఈ పట్టణముమీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలిసికొనుడి.-యిర్మియా 26:15
విశ్వాసము
ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థ్వములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను.-ఎస్తేరు 9:31
నూతన నిబంధనలో సత్యము కొరకు ఉపయోగించబడిన అలేత్య అనే పదాన్ని మన తెలుగు బైబిల్ లో ఎలా తర్జుమా చేసారో చూద్దాం. ఈ పదాన్ని సత్యము అని, నిశ్చయము అని, నిజము అని, తర్జుమా చేయడం జరిగింది.
సత్యము
బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. -మత్తయి 22:16
నిశ్చయము
మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.-లూకా 4:27
నిజము
క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు.-రోమీయులకు 9:2
ఇందులో నేను పొందుపరచని రెఫరెన్స్లను తెలుగు బైబిల్ పదకోశంలో సత్యము అనే పదాన్ని వెతికి చూడండి. ఈ పదాన్ని ధ్యానిస్తున్నప్పుడు దానికి ఉపయోగించబడిన వివిధ పదాలను దృష్టిలో ఉంచుకొని మీరు ధ్యానిస్తున్న పదం ఉన్న సందర్భాన్ని బట్టి భావాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి