ప్రార్థన ప్రార్థన అన్నిటికి
పల్లవి : ప్రార్థన ప్రార్థన (2) అన్నిటికి
ప్రార్థన ప్రార్థన (2) ఎన్నటికి
ప్రార్థించుము ఓ క్రైస్తవ జనమా
కనిపెట్టుము ఓ సేవకతరమా
1. ప్రార్థనే భీతిని తొలగించును
ప్రార్థనే శోధన తప్పించును
ప్రార్థనే ఆరోగ్యము దయచేయును
ప్రార్థనే ఉన్నతి స్థితి అనుగ్రహించును
॥ప్రార్థించుము॥
2. ప్రార్థించెను ఏలియా రోషముతో నాడు
ప్రార్థించుము వేదనలతో ఆత్మలకై నేడు
ప్రార్థించుము అన్ని సమయములయందు
ప్రార్థించుము దానియేలు వలెను
॥ప్రార్థించుము॥
3. ప్రార్థనే విడిపించెను పేతురు చెర నుండి
ప్రార్థనే తొలగించును పాపపు చెరను ప్రార్థనే కలిగించెను యుద్దములో విజయం ప్రార్థనే ఇచ్చును సాతానుపై జయము ॥ప్రార్థించుము॥
ప్రార్థనే తొలగించును పాపపు చెరను

కామెంట్‌ను పోస్ట్ చేయండి