సమూయేలు చెడ్డ మాదిరిని అనుసరించలేదు



సమూయేలు చెడ్డ మాదిరిని అనుసరించలేదు


సమూయేలు చెడ్డ మాదిరిని అనుసరించలేదు


 బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకుపరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు. -1 సమూయేలు 3:1

హాయ్ పిల్లలు బాగున్నారా? సమూయేలు గురించి చక్కని పాఠాలు నేర్చుకుంటున్నాము కదా! సమూయేలు ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగి పెద్దవాడు అయ్యాడు. 12 సంవత్సరాలు వచ్చాయి. సమూయేలు చుట్టూ ఉన్న వాతావరణం అంత బాగాలేదు. ముఖ్యముగా యాజకులుగా ఉన్న హోప్ని, ఫినేహాసు అనువారు దేవుని దృష్టిలో మంచిగా లేరు, ప్రజల దృష్టిలో కూడా మంచిగా లేరు. వాళ్లు ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నారు అని గడచిన భాగములో తెలుసుకున్నాం కదా.

ఏలీ తాతకు కళ్ళు సరిగా కనబడక వారికి ఆ పని అప్పగిస్తే వాళ్లు వారి ఇష్టం వచ్చినట్టు దానిని చేస్తూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఏమౌతుందో ఏలీ తాతకు తెలుసు గనుక ఆయన తన పిల్లలను పిలిచి హెచ్చరించాడు.

మీరు చేసే పనులు బాగా లేవు అలా చేయవద్దు అని చెప్పాడు, కాని వారు ఏమాత్రం దానిని వినిపించుకోలేదు, వారి ప్రవర్తన మార్చుకోలేదు. ఇంకా చెడ్డ జీవితమును కొనసాగించారు.

అయితే అక్కడ ఉన్న సమూయేలు మాత్రం వయసు పెరుగుతున్నా ఏలీ తాతను ఎప్పటి లాగానే గౌరవించాడు, తన కుమారులే తన మాట వినకపోయినా తాను మాత్రం విధేయుడుగా ఉన్నాడు.

మీ ఇంట్లో, మీ స్కూల్లో కొన్ని సార్లు మందిరములో కూడా ఇలాంటి వారు చాలా మంది కనబడతారు. వాళ్లు మీ కంటే పెద్దవారైనప్పటికి తల్లిదండ్రుల మాట, పెద్దవారి మాట వినకపోవడం మీరు కొన్ని సార్లు గమనించగలరు. అయితే వారు అలా ఉంటున్నప్పటికి మీరు మాత్రం ఆ ప్రవర్తన నేర్చుకోకూడదు.

మీ అక్క వాళ్లు మీ అన్న వాళ్లు స్కూల్ కి సరిగా వెళ్లకపోతే, సరిగా చదవకపోతే, మంచి మార్కులు తెచ్చుకోకపోతే, అబద్దాలు చెప్పేవారుగా ఉంటే, బూతులు మాట్లాడేవారుగా, కంఠత వాక్యములు నేర్చుకోననివారుగా, పాటలు పాడని వారుగా, ప్రార్ధన చేయనివారుగా, పరిచర్య చేయనివారుగా ఉంటే మీరు వారిని, వారి మాదిరిని అనుసరించకూడదు.

కంఠత వాక్యము

 ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు. -3 యోహాను 1:11

పునర్విమర్శ ప్రశ్నలు

క్రింది వాటిని జతపరచండి

  1. ఏలీ ( ) చెడ్డ మాదిరి కనపరచారు
  2. సమూయేలు ( ) అనుసరించాలి
  3. హోప్ని( ) కుమారులను గద్ధించాడు
  4. చెడ్డ మాదిరి ( ) 12 సంవత్సరాల వయసు
  5. మంచి మాదిరి ( ) అనుసరించకూడదు

Post a Comment