సమూయేలు మనుషుల దయలో వర్ధిల్లాడు
హాయ్ పిల్లలు బాగున్నారా, సమూయేలు వలె అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారా? సమూయేలు వయసులో వర్దిల్లినట్లుగా, దేవుని దయలో దిగినట్లుగా గడిచిన భాగంలో తెలుసుకున్నాం కదా! ఈ భాగంలో సమూయేలు వర్ధిల్ల మరొక అంశాన్ని గురించి తెలుసుకుందాం.
ఏలి అనే యాజకుని కి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారి పేర్లు హోప్ ని ఫినహస్, ఏలి వయసులో పెద్దవాడైన దాన్ని బట్టి ఆయన చూపు మందగించింది, కాబట్టి దేవుని మందిరంలో జరిగే పరిచర్య తన కుమారులకు అప్పగించాడు.
ఈ కుమారులు దేవునికి ఇష్టంగా జీవించలేదని గడిచిన భాగంలో తెలుసుకున్నాం కదా, అయితే వీరు దేవునికే కాదు దేవుని మందిరానికి వచ్చే మనుషులకు కూడా నచ్చలేదు, వీరి ప్రవర్తనను బట్టి కొంతమందికి దేవుని మందిరానికి రావాలనే ఆసక్తి లేకుండా పోయింది. ఆ రోజుల్లో దేవుని మందిరంలో జంతువులను తీసుకువచ్చి బలులుగా అర్పించేవారు, అలా అర్పించినప్పుడు యాజకునికి కొంత భాగం వస్తుంది, కొవ్వు మొత్తము దేవునికే చెందింది కనుక , దానిని దహించి వేస్తారు.
అయితే ఈ కుమారులు ఇద్దరు ఏం చేస్తున్నారో తెలుసా? యాజకునికి ఎంత భాగం మాంసం రావాలో దేవుడు చెప్పినప్పటికీ, దానిని పరిగణలోకి తీసుకోకుండా వారికి ఇష్టం వచ్చినంత మాంసాన్ని తీసుకునేవారు, అంతేకాదు దేవునికే చెందవలసిన కొవ్వు లో కూడా భాగమడిగేవారు. ఉడకబెట్టిన మాంసం వద్దని, వేపుకొని తినడానికి పచ్చి మాంసాన్నే కోరుకునేవారు.
ఇంకా చెప్పాలంటే దేవునికి అర్పించిన తర్వాత యాజకుల భాగం యాజకులు తీసుకోవాలి, కానీ వీరు దేవునికి ఇవ్వకుండానే మా భాగం మాకు ఇవ్వమని ఒత్తిడి చేసేవారు, అలా కనక ఇవ్వకపోతే బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేసేవారు. ఇలా వీరు ప్రవర్తిస్తున్నందుకు మనుషులు ఎవరికి వీలుంటే ఇష్టం లేదు. అయితే సమూయేలు ఎలా ఉన్నాడు తెలుసా?
మనుషులందరూ సమూయేలను మెచ్చుకునేటట్టుగా ఉన్నాడు. పిల్లలు, మనము దేవునికి ఇష్టంగా మాత్రమే కాదు మనుషులకు ఇష్టంగా కూడా జీవించాలి. మనలను దేవుడు మెచ్చుకుంటే మాత్రమే సరిపోదు, మన తల్లిదండ్రులు, పెద్దవారు, స్నేహితులు మన గురించి మంచి సాక్ష్యము ఇవ్వాలి, అంటే మంచి పిల్లలని వారి నోట నుండి చెప్పాలి.
ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అబ్బాయి మంచివాడు కాదు అని మనల్ని గూర్చి మన తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ, పెద్దవాళ్లు కానీ, స్నేహితులు కానీ చెప్పకుండా ఉండునట్లుగా మన జీవితాన్ని మనము నడిపించుకోవాలి. పిల్లలు, ఇక నుండి మంచి ప్రవర్తన కలిగి మనుషులకు ఇష్టంగా, మనుషులు దయలో వర్ధిల్లేవారుగా ఉంటారా? అయితే అలా ఉండటానికి సహాయం చేయమని దేవుని నీ ప్రార్ధన చేయండి.
కంఠత వాక్యం :
......ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను. -ఎస్తేరు 2:15
పునర్విమర్శ ప్రశ్నలు : కింది వాటిలో తప్పు/ఒప్పు గుర్తించండి
- ఏలికి ముగ్గురు కుమారులు ( )
- ఏలి కుమారులు దేవుడు నిర్ణయించినంత మాంసాన్ని తీసుకునేవారు [ ]
- ఏలి కుమారులు మనుషుల దయ పొందారు { }
- ఏలి కుమారులు కొవ్వును పచ్చి మాంసాన్ని కోరుకునేవారు { }
- సమూయేలు దేవుని దయ లో మాత్రమే వర్ధిల్లాడు { }
- మనకు దేవుని దయతో పాటుగా మనుషుల దయ కూడా కావాలి [ ]
- ఏలి కుమారుల ప్రవర్తనను బట్టి చాలామంది ప్రజలు దేవునిని ఆరాధించటానికి ఆసక్తితో మందిరానికి వచ్చేవారు { }

కామెంట్‌ను పోస్ట్ చేయండి