ఓర్వలేను ఎడబాటేసయ్యా
పల్లవి : ఓర్వలేను ఎడబాటేసయ్యా
ఓర్చుకోలేను దూరం మెస్సయ్యా
అ . ప . : నీతో సహవాసమే నన్ను మార్చిందిలే`
నీ స్నేహమే నన్ను బలపరచెనే
1. నా వారందరూ నన్ను విడచిపోగా
ఎవరూ లేక ఒంటరినైతిని
నమ్మకమైనవారే కరువై
నీ కార్యములెన్నో నిలచిపోయెను
నమ్మకస్తుడా.....నా ప్రాణ నాధ (2)
నిన్నేలా నేను నమ్ముకొనకపోతిని (2)
॥నీతో సహవాసమే॥
2. దీవించే దేవుడవు నీవైయుండగా
దీవించువారి కొరకు లోకములో వెదకితిని
ధేమా వలెను తోమా వలెను
దోషము చేసి దూరమైతిని
దయామయుడా....దయ చూపు దేవా (2)
నీకేలా నేను దూరమైతిని (2)
॥నీతో సహవాసమే॥
3. ఓనమాలే రాని నాకు
ఔన్నత్యమును కలుగజేసితివి
ఓటమి పొందిన నాకు నీవు
ఓర్పుతో నేర్పి విజయమిచ్చితివి
ఓరిమిగలిగిన...........ఓ బోధకుడా (2)
నీ బోధ నేనెలా త్రోసివేసితిని (2)
ఓరిమిగలిగిన...........ఓ బోధకుడా (2)
నీ బోధ నేనెలా త్రోసివేసితిని (2)
॥నీతో సహవాసమే॥

కామెంట్‌ను పోస్ట్ చేయండి