సమూయేలు దేవుని దయలో వర్ధిల్లాడు
హాయ్ పిల్లలు బాగున్నారా, సమూయేలు గురించి మనము ఏమేమి నేర్చుకున్నాము మీకు జ్ఞాపకం ఉన్నాయా? సమూయేలు దేవునిని ఆరాధించాడని, పిల్ల చేష్టలు మానివేశారు అని, ఏలిని గౌరవించాడని, దేవునికి పరిచర్య చేశాడని, ఎదుగుదల కలిగి ఉన్నాడని నేర్చుకున్నాం.
సమూయేలు పెద్దవాడు అవుతున్న కొలది దేవునికి చాలా ఇష్టుడుగా ఉన్నాడు. సమూయేలతో పాటు అక్కడే ఏలి తాత కుమారులు కూడా ఉన్నారు, అయితే వారు దేవునికి ఇష్టులుగా లేరు. దేవుడంటే దేవుని సేవ అంటే భయము గౌరవము ఏమాత్రం లేకుండా వారు ఉంటున్నారు.
దేవునికి బలం పెంచడానికి మాంసం తీసుకుని వస్తే, అది దేవునికి అర్పించకుండానే వారికి ఇవ్వవలసిన భాగం ఇవ్వాలని వారు కోరుకునేవారు. ఇంకా ఎన్నో చెడ్డ పనులు వీళ్లు చేసేవారు, అందుకని దేవుడు వీరిపై కోపం కలిగి ఉన్నాడు.
పిల్లలు మనమందరం కూడా మన పెద్దవాళ్లు చేసిన పాపాన్ని బట్టి మన రక్తంలోనే పాపముంది. అందుకనే పుట్టినది మొదలుకొని మనమందరము అబద్ధాలాడుతూ, బూతులు మాట్లాడుతూ, చెడ్డ ఆలోచనలు చేస్తూ, చెడ్డ పనులు చేస్తూ ఉంటూ ఉంటాం. అయితే ఇలా చేసే వారెవరు కూడా దేవునికి ఇష్టులు కారు.
ఇలా చేసే వారందరి మీద దేవుని కోపం ఉంటుంది. ఇలా చేసే వారందరూ వయసులో పెద్ద వాళ్ళు అవుతారు కానీ దేవుని దయలో పెద్దవాళ్లు కారు. మనము దేవుని దయలో సమూయేలు వలె, యేసయ్య వలె ఎదగాలి.
దేవుని దయలో ఎదగటం అంటే దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఎదగటం. దేవునికి ఇష్టంగా జీవిస్తున్న వారికి, అవసరమైన ప్రతి ఒక్కటి సకాలంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి ఇష్టముగా జీవించని వారికి, కొన్నిసార్లు వారు దేవునికి కోపం పుట్టించిన దానిని బట్టి దేవుడు కొన్నిటిని వారికి ఇవ్వకుండా నిలుపు చేస్తాడు.
అన్నిటికి మించి దేవునికి ఇష్టంగా ఉన్నవారు యేసయ్యతో ఉండటానికి పరలోకం వెళ్తారు, దేవునికి ఇష్టంగా లేనివారు శిక్షను అనుభవించడానికి నరకానికి వెళ్తారు.
పిల్లలు మరి మీరు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారా? లేరు కదా! అలా అయితే మీరందరూ నరకానికి వెళ్ళవలసిన వారే! కానీ మీకు ఒక శుభవార్త అదేమిటంటే యేసయ్య మనము చేసిన తప్పులన్నిటిని బట్టి దేవునికి మనము రేపిన కోపమంతటిని బట్టి, మన తప్పులు ఆయన మీద వేసుకొని మన మీద ఉన్న దేవుని కోపమంతటిని భరించాడు.
కాబట్టి ఎవరైతే యేసయ్య నా తప్పులన్నింటి కొరకు కల్వరి సిలువలో దేవుని కోపాన్ని భరిస్తూ మరణించాడని నమ్ముతూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, తప్పులు క్షమించమని వేడుకుంటూ, ఇకనుండి నీకు ఇష్టంగా జీవిస్తానని దేవునికి ప్రార్థన చేసే వరకు ఉంటారో వారందరూ యేసయ్యను బట్టి దేవునికి ఇష్టంగా ఉండుటకు చేసిన తీర్మానమును బట్టి పరలోక రాజ్యములో ప్రవేశించే అర్హతను పొందుకుంటారు.
కాబట్టి పిల్లలు దేవునికి ఇష్టంగా ఉండటానికి మీరు తీర్మానించుకుంటారా? అలా అయితే దేవునికి ప్రార్థన చేయండి, తప్పొప్పులు ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.
కంఠత వాక్యము :
దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. - ప్రసంగి 2:26
పునర్ విమర్శ ప్రశ్నలు
- సమూయేలు ఏ ఏ విషయాల్లో వర్ధిల్లాడు?
- దేవుని దయలో వర్ధిల్లటం అంటే ఏంటి?
- మనము దేవునికి ఇష్టంగా లేకపోతే ఏం జరుగుతుంది?
- దేవునికి ఇష్టం లేని వారు చేసే పనులు, దేవునికి ఇష్టమైన వారు చేసే పనులను పట్టికగా రాయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి