తేజస్సు
శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. -కీర్తనలు 45:3
ఇక్కడ తేజస్సు అనే పదానికి "హాడ్" అనే హెబ్రీ పదం ఉపయోగించబడింది. ఈ పదము పాత నిబంధనలో 24 సార్లు కనబడుతుంది, కేవలం కీర్తనల గ్రంథంలోనే ఎనిమిది సార్లు దీనిని మనం చూడవచ్చు. ఎక్కువ సందర్భాల్లో ఈ పదము హధార్ అనే మరొక హెబ్రీ పదం పక్కన ఉపయోగించబడింది. హధార్ అనే పదానికి ప్రభావము లేదా గౌరవము అని అర్థం. ఈ రెండు పదాలు పక్కపక్కన ఉపయోగించబడినప్పుడు మొదట హాడ్ అనే పదము తర్వాత హధార్ అనే పదము ఉపయోగించబడడాన్ని చూడవచ్చు{1}.
ఈ రెండు పదాలు పక్కపక్కనే ఉపయోగించబడిన ఏడు వచనాలను కింద గమనించండి. అంతేకాకుండా హోడ్ అనే పదము ప్రతి సందర్భంలో ఏ విధంగా తర్జుమా చేయబడిందో కూడా గమనించండి. ఈ పదాన్ని గౌరవము, ఘనత, మహత్యము, మహిమ, తేజస్సు అని అనువాదం చేశారు.
గౌరవము
- నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు. -కీర్తనలు 21:5
- ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము గౌరవప్రభావములను ధరించుకొనుము.-యోబు 40:10
ఈ వచనములో హాడ్ అనే పదాన్ని గౌరవము అని తర్జుమా చేయడము చూడొచ్చు.
ఘనత
- ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.- 1 దినవృత్తాంతములు 16:27
- ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.- కీర్తనలు 96:6
ఇక్కడ ఆ మాటను ఘనత అని తర్జుమా చేయడాన్ని చూడవచ్చు
మహత్యము
- నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించినవాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.-కీర్తనలు 104:1
ఇక్కడ మహత్యము అని తర్జుమా చేయడానికి చూడవచ్చు.
మహిమ
- ఆయన కార్యము మహిమా ప్రభావములుగలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.-కీర్తనలు 111:3
- దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులోనుండి వేంచేయుచున్నాడు.(సెలా.) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడు చున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.-హబక్కూకు 3:3
ఈ వచనంలో ఆ పదాన్ని మహిమ అని తర్జుమా చేయడం చూడవచ్చు.
తేజస్సు
- శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.-కీర్తనలు 45:3
ఇక్కడ ఈ పదము తేజస్సు అని అనువాదం చేయబడింది.
ఈ పదాన్ని పాత నిబంధనకు సంబంధించిన గ్రీకు అనువాదం డొక్సా అని తొమ్మిది సార్లు, ఎక్స్మాలోజేసీస్ అని నాలుగు సార్లు, మరియు ఇతర పదాలను కూడా దాని తర్జుమాలో ఉపయోగించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో( కీర్తన. 45:3) కొన్ని ఆధునిక గ్రీకు తర్జుమాలు "డొక్స(doxa)" అని ఉపయోగించడం జరిగింది.
దీనిని బట్టి కొన్ని ఆంగ్ల తర్జుమాలు glory అని అనువాదం చేసాయి. మరి కొన్ని తర్జుమాలు splendour అని అనువాదం చేసాయి. వాస్తవానికి Glory లేదా మహిమ అనే పదానికి హెబ్రీ భాషలో కాబోద్ అనే పదము గ్రీకులో doxa అనే పదం ఉపయోగిస్తారు.
ఈ పదము మనుషుల జంతువుల చెట్ల లక్షణాలను వివరించే సందర్భంలో కూడా ఉపయోగించడం జరిగింది.
మనుషులను గురించి ఆలోచన చేస్తే....
సంఖ్యాకాండము 27:20 ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము.
ఈ సందర్భంలో మోషేకున్న ఘనత యెహోషువకు కొంత ఇవ్వమన్నట్టుగా మనం చూస్తున్నాం.
సామెతలు 5:9 వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు
ఇక్కడ ఈ పదము బలము అని అనువాదం చేయబడ్డాన్ని గమనించాలి, English standard version లో బలము అని ఉన్నచోట గౌరవము అని తర్జుమా చేయబడింది.
దానియేలు 10:8 నేను ఒంటరినై యా గొప్ప దర్శ నమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు.
ఇక్కడ ఈ పదము సొగసు అని తర్జుమా చేయబడింది.
హోషేయా 14:7 అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.
ఇక్కడ ఈ పదము పరిమళము అని తర్జుమా చేయబడడమును చూడవచ్చు.
యిర్మియా 22:18 కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు.
ఇక్కడ శోభా అని ఈ పదము తర్జుమా చేయబడింది
జంతువుల విషయానికొస్తే గుర్రం విషయంలో ఈ పదము ఉపయోగించబడింది.
యోబు 39:19 గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?
ఇక్కడ బలము అని ఈ పదం తర్జుమా చేయబడింది.
జెకర్యా 10:3 నా కోపాగ్ని మండుచు కాపరులమీద పడును, మేకలను నేను శిక్షించెదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వములవంటివారినిగా చేయును.
ఈ పదం ఇక్కడ రాజకీయము అని తర్జుమా చేయబడింది.
చెట్లను గురించి ఆలోచన చేస్తే, ఒలివ చెట్టును గూర్చి ఈ పదం ఉపయోగించబడింది
హోషేయా 14:6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.
ఇక్కడ ఈ పదము సౌందర్యము అని తర్జుమా చేయబడింది.
ఈ పదం దేవుని గురించి కింది సందర్భాల్లో ఉపయోగించబడింది.
కీర్తనలు 8:1 యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది.
ఇక్కడ దేవుని మహిమ గురించి ఈ పదం ఉపయోగించబడింది.
కీర్తనలు 148:13 అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.
కీర్తనలు 104:1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.
ఇక్కడ మహాత్యము అని అనువాదం చేయబడింది
యెషయా 30:30 యెహోవా తన ప్రభావముగల స్వరమును విని పించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.
ఇక్కడ ప్రభావము అని అనువాదం చేయబడింది.
1 దినవృత్తాంతములు 29:25 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదు టను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.
ఇక్కడ ప్రభావము అని అనువాదం చేయబడింది.
జెకర్యా 6:13 అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును.
ఇక్కడ మెస్సియాకు దాన్ని ఆపాదిస్తూ ఘనత అని అనువాదం చేశారు.
హధార్అ నే పదాలతో పాటుగా దేవుని స్వభావమును వ్యక్తపరిచే ఇతర పదాలతో రోడ్డు అనే పదము కలిపి చెప్పబడింది. అవేమనగా గెదల్లా ( గొప్పతనము), గేబూర ( శక్తి) టిపెరేట్ (మహిమ ), నేష ( విజయము).
హోడ్ అనే ఈ పదముతో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి
నెహెమ్యా 8:7 జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి.
ఇక్కడ హో దియా అనే పేరును చూడొచ్చు - దీనికి యెహోవాయే నా మహిమ అని అర్థం.
నెహెమ్యా 7:43 లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
ఇక్కడ హోదవ్య అనే పేరును చూడొచ్చు దీనికి యెహోవా ప్రభావంతుడు అని అర్థం
1 దినవృత్తాంతములు 8:3 బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
ఇక్కడ అబీహుదు అనే పేరును చూస్తున్నాం, దీనికి నా తండ్రి ప్రభావవంతుడు అని అర్థం.
1 దినవృత్తాంతములు 9:4 యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారు డైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.
ఇక్కడ అమీహుడు అనే పదాన్ని చూస్తున్నాం, దీనికి నా బంధువే నా ప్రభావం అని అర్థం. న్యాయాధిపతిగా పనిచేసిన ఎహుదు కూడా ఇందులో చేర్చుకోవచ్చు
తేజస్సు అనే పదానికి కార్యనెరవేర్పుగల సామర్ధ్యం, ప్రకాశము, వెలుగు, గొప్పతనం, శోభ అనే అర్ధములు చెప్పవచ్చు. రాజులకు తేజస్సు ఉండాలి అని అంటారు. ఇక్కడ రాయబడిన తేజస్సు అనే ఈ పదము కత్తిని గూర్చి చెప్పబడింది అని కొంతమంది వ్యాఖ్యాన కర్తల అభిప్రాయం.
నీ గొప్పతనముకు కారణమైన కత్తిని ధరించుకొనుము అని కోరహు కుమారులు అడుగుతున్నట్టు వారి భావం. ఈ భావము సరైనదే అయినప్పటికీ మనము దీనిని విడదీసి కూడా చూడవచ్చు. అలా విడదీసి చూస్తే తేజస్సు అనగా ప్రకాశము, లేదా వెలుగు అని అర్థం చేసుకొనవచ్చు.
End notes
{1} Hamilton, V. P. (1999). 482 הוד. In R. L. Harris, G. L. Archer Jr., & B. K. Waltke (Eds.), Theological Wordbook of the Old Testament (electronic ed., p. 209). Moody Press.

కామెంట్‌ను పోస్ట్ చేయండి