నీవు నా కాపరైయుండగా
పల్లవి: నీవు నా కాపరైయుండగా
నాకు కొదువేమియు లేదుగా(2)
నా అక్కరలు నా ఆలోచనలు
అన్నిటిని ఎరిగినవాడవు(2)
అ.ప: అవసరాలు తీర్చు దేవుడా అన్నిటికి చాలినవాడా
ఆదియంతమైయున్నవాడా ఆరాధ్యుడా (2)
(పరిశుద్ధుడా, అభిషక్తుడా)
1. కీడుకలిగినా కష్టములెదురైనా
కన్నీరే నాకు తోడుగా మిగిలిన ॥అవ॥
నీవు నా పక్షమైయుండగా నన్నెవరేమి చేయలేరుగా
నీవు నా తోడైయుండగా నాకు ఎదురేమియు లేదుగా
2. నిందించబడిన నీచునిగా ఎంచబడిన
నమ్మకస్తులే నన్ను అనుమానించిన ॥అవ॥
నీవు నా ప్రక్కనే వుండగా నాకు దిగులేమియు లేదుగా
నీవు నా చేయి పట్టుకొనగా నేను ముందుకే సాగెదన్
3. విజయమే కరువైన వైరాగ్యం కోల్పోయిన
విషయమే లేదంటూ త్రోసివేయబడిన ॥అవ॥
నీవు నాయకుడైయుండగా
నీవు నాయకుడైయుండగా
నేను వెనుదిరగక వెంబడిరచెదన్
నేను అన్నియు కోల్పోయిన నీవుంటే నాకు చాలుగా
నేను అన్నియు కోల్పోయిన నీవుంటే నాకు చాలుగా

కామెంట్‌ను పోస్ట్ చేయండి