ధన్యుడను ధన్యుడను ధన్యుడను
పల్లవి: ధన్యుడను ధన్యుడను
ధన్యుడను నేను ధన్యుడను
ధన్యత కలిగెను నీమూలముగ (2)
దీవించితివి కృపలో నన్ను,
దయ చూపితివి ఇంతకాలము (2)
అ.ప: దేవా ఏమి అర్పింతును ,
ప్రభువా నీకై బ్రతికెదను
1. నమ్మకత్వము లేని నాపై నమ్మకం
ఉంచిన నా నిజస్నేహితుడా
నిత్యము వెన్ను తట్టి ప్రోత్సహించి నన్ను
ఇంతవరకు నడిపితివి (2)
నిరీక్షణ ఆధారం నీవే దేవా (2)
నన్ను ఆనందంతో నింపితివి ॥దేవా॥
2. కన్న కలలన్ని నెరవేర్చుచుంటివి
కృపతో జీవము నిచ్చితివి
కనికరమును రెట్టింపు చేసి
కనికరమును రెట్టింపు చేసి
కృతజ్ఞతతో నన్ను నింపితివి ,
కార్యసాధకుడా నీ మూలముగా (2)
కార్యసాధకుడా నీ మూలముగా (2)
కలిగెను నాకీ భాగ్యము. ॥దేవా॥

కామెంట్‌ను పోస్ట్ చేయండి