అబ్రాహామును ఎన్నుకోవడం వెనుక దేవునికున్న ఉద్దేశం ఏమిటి ?

 

అబ్రాహామును ఎన్నుకోవడం వెనుక  దేవునికున్న ఉద్దేశం ఏమిటి ?

అబ్రాహామును ఎన్నుకోవడం వెనుక దేవునికున్న ఉద్దేశం ఏమిటి ?

తన ప్రజలు తన యొద్ద నుండి దూరమై నరక శిక్షను నిత్య వేదనలను అనుభవించుటను చూడలేని దేవుడు వారి శిక్షను తప్పించాలని వారిని విమోచించు ప్రణాళికను కలిగినవాడుగా ఉన్నాడు.

పరిచయం :

 మన దేవుడు పక్షపాతి కాదు, ఆయన ఎన్నికలలో ఏర్పాటులలో ఏమాత్రం పక్షపాతము లేదు.

 దేవుని వాక్యము కొరకు ఆసక్తిగల ప్రతి ఒక్కరికి  శుభములు తెలియజేస్తూ మిమ్మలను ప్రేమతో రెఫీదీమ్ వాక్య ధ్యాన సమయముకు ఆహ్వానిస్తున్నాను.

అందరూ బాగున్నారా, దేవుడు అబ్రాహాము ఒక్కడినే ఎందుకు ఎన్నుకున్నాడు? అలా ఎన్నుకోవడం ఏమి తెలియజేస్తుందో ఈనాటి భాగములో తెలుసుకుందాం . . 

ఈ లోకంలో ఉన్న వారందరూ దేవుని ఆజ్ఞలను మీరుట వలన, దేవునితో సహవాసమునకు దూరమైనవారై, నరక శిక్షకు పాత్రులుగా ఉన్నారు.

తన ప్రజలు తన యొద్ద నుండి దూరమై నరక శిక్షను నిత్య వేదనలను అనుభవించుటను చూడలేని దేవుడు వారి శిక్షను తప్పించాలని వారిని విమోచించు ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు.

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సర్వలోకమంతా దేవుని ఎదుట దోషులై ఉన్నారు, ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని విమోచించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు.  

ఈ ప్రణాళిక నెరవేర్చుటకు దేవుడు ఎన్నుకున్నది కొంతమందినే అయినప్పటికీ, ఆయన ప్రణాళిక మాత్రం సమస్త మానవాళి నిమిత్తమై ఉన్నది. ఏ ఒక్కరు నశించి పోవడం దేవునికి ఇష్టం లేదు.
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా -ఆదికాండము 12:3

దేవుడు యూదులను మాత్రమే ఎన్నుకున్నప్పటికీ, ఆయన యూదులను మాత్రమే ఆశీర్వదించాలని ఆ విధంగా చేయలేదు. ఆయన ఉద్దేశం ఆ యూదులను ఉపయోగించుకొని సర్వలోకమానవాళికి రక్షణను దీవెనలు తీసుకురావాలని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. 

ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు లేదు, సత్య సువార్తకు విశ్వాసంతో స్పందించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే దీవెన పొందే అవకాశం ఉన్నది. ఆయన మార్పు లేని వాడు, ఆయన ఉద్దేశాలు ఇప్పటికీ మారలేదు.

అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ఈ సమస్త జనులు అనే విషయం అబ్రహాము మొదలుకొని ఇప్పటివరకు దేవుని ఆలోచనలో మెదలాడుతూనే ఉన్నది అనే విషయము మనము గమనించాలి. 

ముగింపు :

దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో నీవు నేను భాగమేనని తెలుసుకున్నాం కదా! ఆయన ఏర్పాటును గ్రహించి ఆయన కుమారుని స్వీకరించి, రక్షణను నిత్యజీవమును పొందేవారముగా ఉందాం. ఆయన ప్రణాళిక నెరవేర్చబడుటకు సమస్త జనులకు ఈ విషయాలు చేరవేద్దాం  

 ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్. 

Post a Comment