దేవుడు మనలను ఎందుకు విమోచించాడు ?
మనలను విమోచించుకున్న దేవునికి మన జీవితంతో ఏమి చేయటానికైనా ఆయనకు హక్కు ఉంది అయితే ఆయన ఏమి కోరుకుంటున్నాడు ? మనలను మరల బిగించే ప్రయత్నం చేయడంలేదు కానీ మనకు ఆయన స్వేచ్ఛనిచ్చి ఇలా బ్రతకండి అని ఆయన తెలియజేస్తున్నాడు .
పరిచయం :
దేవుడు మనపై ఎంతో గొప్ప ప్రేమను చూపి మన కొరకు ఎవరు చేయలేని కార్యములు ఆయన చేసినప్పటికి, మనలను ఆయనకు బందీలుగా చేసుకొనకుండా మనకు స్వేచ్ఛనిచ్చాడు. సత్యాన్వేష్కులకు ప్రేమమాయుడైన యేసయ్య నామములో శుభములు కలుగును గాక.
అందరూ బాగున్నారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించి నడిపిస్తున్న విధానం గురించి తెలుసుకుంటూ ఉన్నాము కదా! ఈనాటి భాగములో నిర్గమకాండము 18 నుండి సంఖ్యకాండము 10 అధ్యాయముల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల నుండి ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకుందాం!
ఇశ్రాయేలు ప్రజలను పోషిస్తూ దేవుడు వారిని మోషేకు మొదటిసారి ప్రత్యక్షమైన సినాయకొండ యొద్దకు నడిపించాడు. అక్కడ ఈ ప్రజలకు వారు ముందుకు సాగవలసిన విధానాన్ని విశదపరిచాడు. వారు పాటించవలసిన ఆజ్ఞలను తెలియపరిచాడు, ఆరాధన క్రమాన్ని, ఆచరించవలసిన పండుగలను, బలులను అర్పన్లను వారికి తెలియపరచాడు.
వాటిని అనుసరించి నడుచుకుంటే దీవెన కలుగుతుందని, వారు ప్రత్యేకమైన జనముగా దేవుని యొక్క స్వకీయ సంపాదియంగా ఉంటారని ఆయన తెలియపరిచాడు. విమోచింపబడిన ప్రతి వ్యక్తి మీద ఉన్న బాధ్యత, విధేయత కలిగి కొనసాగడమే. వాక్య విశేషాలను తెలుసుకుంటూ, ఆత్మీయ క్రమాన్ని నేర్చుకుంటూ, మనలను విమోచించినప్పటికీ మనకు గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఆయన మనలను చూడాలనుకున్న రీతిలో మార్చబడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును , పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. -1 పేతురు 2:9
ముగింపు :
మనలను తన స్వకీయ జనముగా చేసుకున్న దేవుడు మనము ఆయన కొరకు జీవించేవారముగా ఉండాలని కోరుతున్నాడు. మన పట్ల ఆయన కలిగియున్న ఈ కోరికను నెరవేర్చడానికి సర్వరత్ర ప్రయాసపడదాం.. ప్రభు చిత్తమైతే మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి